Child Protection Bhavan (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Child Protection Bhavan: చట్టబద్ధత ద్వారానే పిల్లలకు హక్కులు.. ఇలా చేయండి

Child Protection Bhavan: చట్టబద్ధత ద్వారానే దత్తత చేసుకునే పిల్లలకు హక్కులు కలుగుతాయని జిల్లా సంక్షేమ అధికారిణి కె. శిరీష(K Shirisha) పేర్కొన్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాల రక్షా భవన్(Child Protection Bhavan) లో దత్తత కోరే తల్లిదండ్రుల సమావేశం జిల్లా సంక్షేమ అధికారి శిరీష ఆధ్వర్యంలో నిర్వహించారు. కారా 2017 నియమ నిబంధనల మేరకు దత్తత వల్ల కలిగే ప్రయోజనాలను, పిల్లల పెంపకం పట్ల, వారి యొక్క సంక్షేమానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అనంతరం కారా వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది.

కొంత సర్దుబాటు సమస్యలు

ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి కె శిరీష మాట్లాడుతూ.. పిల్లలను ప్రేమ, వాత్సల్యంతో పెంచాలని, పిల్లలు లేని దంపతులు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మహిళా శిశు సంక్షేమ శాఖ(Women and Child Welfare Department) వారిని, సంప్రదించాలని కారా వెబ్సైట్ www .cara.WCD.gov.inలో కావలసిన ధ్రువపత్రాలను ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(Child Welfare Committee) చైర్ పర్సన్ డాక్టర్ నాగవాణి(Nagamani) మాట్లాడుతూ.. దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు, పిల్లలకు కొంత సర్దుబాటు సమస్యలు వస్తాయని అప్పుడు పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తించకుండా వారి సంక్షేమం గురించి ఆలోచించాలని, దత్తత(Adoption) తీసుకునే తల్లిదండ్రులు ఆడ పిల్లలను ఎక్కువ ఎంపిక చేసుకోవడం హర్షణీయమని తెలిపారు.

Also Read: Complex Fertilizers: పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు..ఆందోళనలో అన్నదాతలు

బాలుడి పట్ల చూపిస్తున్న ప్రేమ

ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ డేవిడ్(David) మాట్లాడుతూ.. పిల్లలను అమ్మడం కొనడం కానీ చేస్తే చట్టరీత్యా శిక్షార్హులవుతారని అటువంటి వారు ఎవరైనా ఉంటే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కి సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లాలో దచ్చట కోసం అప్లై చేసుకున్న తల్లిదండ్రులకు కారా యాప్(Kara App) పై అవగాహన కల్పించారు. బాలల సంరక్షణ అధికారి నరేష్(Naresh) మాట్లాడుతూ. మహబూబాబాద్(Mehabubabad) మండలం రెడ్యాల గ్రామానికి చెందిన మంచాల రమేష్(Ramesh) మాధవి(Madhavi) దంపతులు నిజామాబాద్(Nizamabad) నుండి కారా ద్వారా దత్తత తీసుకున్న బాలుడి వివరాలను చెప్పి, దత్తత బాలుడి పట్ల చూపిస్తున్న ప్రేమ అభిమానాలను, బాలుడు యొక్క సంరక్షణ కోసం తీసుకుంటున్న జాగ్రత్తల గురించి, చట్టబద్ద దత్తత వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిపారు.

ఈ కార్యక్రమంలో బాలల సంరక్షణ అధికారి వీరన్న , కౌన్సిలర్ రమేష్ , సోషల్ వర్కర్ వెంకన్న, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ వెంకటేష్, సరోజ సాయి ప్రభు మరియు జిల్లాలోని దత్తత కోసం అప్లై చేసుకున్న పలువురు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Also Read: Army Jawan Missing case: మహబూబాబాద్ జిల్లాలో మిస్టరీగా మారిన మిస్సింగ్ కేసు.. జాడ దొరికేనా!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!