Army Jawan Missing case (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Army Jawan Missing case: మహబూబాబాద్ జిల్లాలో మిస్టరీగా మారిన మిస్సింగ్ కేసు.. జాడ దొరికేనా!

Army Jawan Missing case: భార్య ఆరోగ్యం బాగోలేదని ఆర్మీ అధికారులకు చెప్పకుండా హైదరాబాద్ వచ్చిన ఆర్మీ జవాన్ మిస్ అయిపోయాడు. బుధవారం నాటికి ఆర్మీ జవాన్ తప్పిపోయి 27 రోజులైంది. ఆర్మీ జవాన్ భార్య సరిత, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్(Mehabubabad) జిల్లా మరిపెడ మండలం గిరిపురం గ్రామ శివారు పూసల తండాకు చెందిన మూడు నవీన్(Naveen) గత కొంతకాలంగా ఆర్మీ(Army)లో పనిచేస్తున్నాడు. ఢిల్లీ(Delhi)లో ఆర్మీ వీధుల్లో ఉన్న నవీన్ కు భార్య సరిత ఆరోగ్యం బాగోలేదని తెలుసుకుని హైదరాబాదులో నివాసం ఉంటున్న వారి ఇంటికి వచ్చాడు. భార్య గాల్ బ్లాడర్ లో రాళ్లు ఉండడంతో ఆమెకు ఆపరేషన్ చేయించాడు. ఆపరేషన్ అనంతరం భార్య సరితతో నవీన్ మాట్లాడాడు. గత వారం రోజులుగా ఆర్మీలో ఉద్యోగం చేయడంతో కంటిమీద కునుకు లేకుండా ఆహారం తినకుండా ఉంటున్నానని భార్యకు నవీన్ వివరించాడు.

సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో 

ఈ క్రమంలోనే భార్య సరిత(Saritha) నవీన్ ను ఉద్యోగానికి వెళ్ళవద్దు ఇక్కడే ఉందామని సూచించింది. దీంతో నవీన్ తప్పనిసరిగా ఢిల్లీ వెళ్లి అధికారులకు రిపోర్ట్ చేయాలని జూలై 11వ తేదీన సాయంత్రం బయలుదేరాడు. బయలుదేరిన కొద్ది సమయానికి నవీన్(Naveen) సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో సరిత ఆందోళనకు గురైంది. సరితకు ఆపరేషన్ అయ్యాక సొంత గ్రామం గిరిపురం శివారు పూసల తండాకు వచ్చారు. ఆ తర్వాత భర్త నవీన్ సెల్ ఫోన్ కు పలుమార్లు ఫోన్ చేస్తున్నప్పటికీ స్విచ్ ఆఫ్ రావడంతో మరింత ఆందోళనకు గురైంది. ఇదే విషయమై బంధువులకు, కుటుంబ సభ్యులకు వివరించి ఆచూకీ తెలుసుకోవాల్సిందిగా బ్రతిమలాడింది. ఆ తర్వాత మరిపెడ పోలీస్ స్టేషన్ లో నవీన్ విషయమై ఫిర్యాదు చేశారు.

చివరిసారిగా నవీన్ వీడియో కాల్

ఆ తర్వాత శ్రీశైలం డ్యాం(Srisailam Dam) సమీపంలో నవీన్ ప్రయాణించిన కారు, అందులో పురుగుమందుల డబ్బా, సెల్ ఫోన్ ఉన్నట్లుగా గుర్తించారు. కానీ నవీన్ ఆచూకీ మాత్రం లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు పలు విధాలుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నవీన్ ఆచూకీ కోసం వేయి కళ్ళతో కుటుంబ సభ్యులు, భార్య సరిత ఎదురుచూస్తున్నారు. అయితే చివరిసారిగా బంధువులకు నవీన్ వీడియో కాల్ చేస్తూ తన ఇద్దరు పిల్లలు జాగ్రత్త ఇక నేను మీకు కనిపించనని మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అయితే కారులో పురుగుల మందు ఎందుకు ఉంది? ఒకవేళ పురుగుల మందు తాగితే ఆ సమీప ప్రాంతంలో నవీన్ ఉండాలి కదా? అని అనుమానం సైతం కుటుంబ సభ్యుల్లో వెళ్లడైతుంది. అయితే నవీన్ పురుగుల మందు తాగి ఉంటాడా? లేదంటే తాగాలని తీసుకొచ్చి కారులో ఉంచాడా అనేది తేలాల్చి ఉంది.

Also Read; Rahul Gandhi: రిటైర్ అయినా వదిలిపెట్టను.. ఈసీ అధికారులకు రాహుల్ గాంధీ తీవ్ర హెచ్చరిక

కారణాలు ఏంటనే కోణంలో పోలీసులు

ఒకవేళ పురుగుల మందు(Insecticide) సేవిస్తే ఆ పరిసర ప్రాంతాల్లో నవీన్ ఆచూకీ తెలియాల్సి ఉండాలి. మరి నవీన్ ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించక పోవడానికి గల కారణాలు ఏంటనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఘటన శ్రీశైలం డ్యాం(Srisailam Dam) సమీపంలో జరిగితే అక్కడి పోలీసులకు మరిపెడ పోలీస్ స్టేషన్ నుంచి కేసును ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఆర్మీ జవాన్ నవీన్ పురుగుల మందు సేవించి ఉంటే ఆ పరిసర ప్రాంతాల్లో విగత జీవిగా కనిపించాల్సి ఉంది. అయితే నవీను కనిపించక పోవడానికి గల కారణాలు ఏంటనేది స్పష్టత లేకపోవడంతో కుటుంబ సభ్యుల్లో మరింత ఆందోళన వ్యక్తం అవుతుంది.

ఎందుకు వెళ్లాడు అనేది ప్రశ్న

ఒకవేళ ఊహించని విధంగా ఆర్మీ జవాన్ నవీన్ పురుగుల మందు సేవించి డ్యాం లో దూకేశాడా? అనే కోణంలోనూ పోలీసులు(Police) విచారణ లోతుగా చేపడితే అర్థమయ్యే పరిస్థితులు ఉంటాయా? అనేది మరో కోణం. అసలు ఆర్మీ జవాన్ నవీన్(Naveen) కారులో హైదరాబాద్(Hyderabad) విమానాశ్రయానికి వెళ్తానని భార్యకు చెప్పిన విధంగా వెళ్లకుండా శ్రీశైలం డ్యాం వైపు ఎందుకు వెళ్లాడు అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న. ఏదేమైనా నవీన్ ఆర్మీ అధికారులు ఇస్తున్న టాస్క్ చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడా? లేదంటే కుటుంబ సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నాయా? అనేది అంతుచిక్కని విషయం. ఏదైతేనేం మొత్తానికి నవీన్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులకు సైతం అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపితే నవీన్ ఆచూకీ లభ్యం ఈజీగానే ఉంటుంది. ఇప్పటివరకు మరిపెడ పోలీసులకు నవీన్ మిస్సింగ్ విషయంలో ఎలాంటి అప్డేట్ లభించలేదని తెలుస్తోంది.

Also Read: TS Politics: గ్రేటర్ గులాబీ బాధ్యతలు.. ఆ ఇద్దరిలో ఎవరికి?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!