Dhammapet Revenue Office (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Dhammapet Revenue Office: గతంలో రికార్డులు తగలబడిన కేసు.. ఉద్యోగికి ప్రమోషన్

Dhammapet Revenue Office: ఈ సార్ ధోరణి మారదా ప్రజలకు అందుబాటులో ఉండాల్సింది ఫలాలకు అందుబాటులో ఉంటున్నారంట దమ్మపేట ఎమ్మార్వో బి భగవాన్ రెడ్డికి(Bagavan Reddy) భూ వివాదాల విషయంలో ఈయన ప్రవర్తన ఇదేం కొత్త కాదు గతంలో కూడా అనేక అక్రమాలలో బాధ్యుడిగా నిలిచాడు గతంలో 2015- 16 ఈ భగవాన్ రెడ్డి ఖమ్మం(Khammam) జిల్లా కల్లూరు మండలంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించాడు అప్పుడు ఏకంగా ఆఫీస్ రూమ్ లోని రికార్డులను తగల బెట్టిన సంఘటనపై ఇప్పటికి ఇతనిపై ఖమ్మం కార్యాలయంలో కేసు పెండింగ్లో ఉన్నది. అంటే ఈయన విధి నిర్వహణలో సామాన్య ప్రజల కన్నా పలుకుబడిదారులకే పెద్దపీట వేసేది కనపడుతుంది.

ప్రస్తుత విధి నిర్వహణ
దమ్మపేట మండలంలో ప్రస్తుతం ఎమ్మార్వో(MRO)గా విధులు నిర్వహిస్తున్న బి భగవాన్ రెడ్డి ఈయన వ్యవహార శైలే వేరు అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. ధనవంతుడికి ఒక విధానం బలహీనుడికి ఒక విధానం ఉన్నట్టు కనిపిస్తుంది. ఈయన పని విధానాన్ని ఎవరు కూడా వేలెత్తి చూపద్దు దీనిపైనా సామాన్యుడే కానీ పత్రిక విలేకరులే కానీ సమాచారం. అడిగితే వారిపై పూనకం వచ్చినట్టు ఊగిపోతారు. తనను అడిగిన సమాచారం. ఎమ్మార్వో ఆఫీస్ వారి బాధలు పనులు నిమిత్తము వచ్చిన సామాన్యుడి చెప్పిన మాట పూర్తిగా వినిపించుకునే టైము మాత్రం ఈయన వినిపించుకోరు దానిని కప్పిపుచ్చేందుకు హడావుడి మాటలతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు వెలుబడుతున్నాయి.

Also Read: Illegal Bike Taxi: మంత్రి స్టింగ్ ఆపరేషన్.. సామాన్యుడిలా మారి.. బైక్ ట్యాక్సీల గుట్టురట్టు!

విమర్శలు ఎదుర్కొంటున్న ఉద్యోగికి.. ప్రమోషన్
బి భగవాన్ రెడ్డి గతంలో ఖమ్మం(Khammam) జిల్లా కల్లూరు మండలంలో 2015-16 ఈయన సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించేవాడు అప్పటినుండే ఇతనికి భూముల(Land) విషయాలలో మంచి అనుభవం కలిగిన వ్యక్తి ఆయా సమయంలో దివంగ మూర్తి మాజీ ఎమ్మెల్యే కట్ట వెంకట నరసయ్య(Katta Venkata Narasaiah) సమీప బంధువులు కు వ్యతిరేకత వాళ్ల వారి వద్ద నుండి భారీ స్థాయిలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు అప్పట్లో కల్లూరు మండలంలో సంచలనం సృష్టించిన గ్రామంలో భారీ స్థాయిలో ప్రచారాలు వెలుపడ్డాయి. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 2016-17 కేసు నమోదు చేయడమే కాకుండా ఇప్పటికీ విచారణ నిమిత్తము పెండింగ్లో ఉన్నది.

కేసును కూడా పట్టించుకోకుండా
కేసు విచారణ క్రమంలో ఆఫీసులో రికార్డులు తగులబెట్టిన దానిపైన బి భగవాన్ రెడ్డి కి సంబంధం ఉందని ఈయనతో పాటు ఆఫీసులో పనిచేస్తున్న సదరు చిన్న ఉద్యోగపై కూడా కేసు నమోదు చేసి A-1. A-2 కింద కేసు నమోదు చేసి కలెక్టరేట్లో విచారణ నిమిత్తము వీరిద్దరిని సస్పెండ్ చేశారు. కేసు విచారణ ఉన్న సమయాన్ని పెండింగ్లో ఉన్న కేసును కూడా పట్టించుకోకుండా ఈయనకు మరోచోట పోస్టింగ్ ఇచ్చారు. అనంతరం భగవాన్ రెడ్డిని ఎమ్మార్వోదాలో మరో చోటుకు బదిలీ చేశారని ఒక ఉద్యోగిపై విచారణ జరుగుతున్న సమయాన వారిని సస్పెండ్ చేసి ఉన్నత అధికారుల ఆధీనంలో విధులకు ఉంచుతారు. కానీ భగవాన్ రెడ్డి పై ఆరోపించబడిన ఆరోపణ పూర్తికాకముందే మరొక చోటుకు ప్రమోషన్ పై పంపించడం ఏంటి అని చర్చనీయంగా మారింది. దీనిపై ఉన్నత అధికారులు ఎందుకు పట్టించుకోవడానికి గల కారణమేంటి తెలియాల్సి ఉన్నది.

Also Read: UP Shocking: భర్త చనిపోయాక మరుదులతో ఎఫైర్.. అత్తను లేపేసి చివరికి?

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్