Dara Kavitha: వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ నూతన డీసీపీగా దార కవిత కవిత బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా సెంట్రల్ జోన్ పరిధిలోని అధికారులు సిబ్బంది నూతన డీసీపీగా మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేసారు. డీసీపీ కవిత హైదరాబాద్ సైబర్ విభాగం పని చేస్తూ బదిలీపై సెంట్రల్ జోన్ డీసీపీగా ఇటీవలే నియమించబడ్డారు.
Also Read: Cyber Crime: సైబర్ క్రైమ్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. ఈ ప్లాన్ తో ఎవరైనా పట్టుపడాల్సిందే..!
పదవీ విరమణ పొందిన హోంగార్డును సత్కారం
వరంగల్ పోలీస్ కమిషనరేట్ హోంగార్డ్స్ విభాగంలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి నేడు పదవీ విరమణ చేస్తున్న హోంగార్డ్ ఐలయ్యను ఆర్ముడ్ రిజర్వుడు అడిషనల్ డీసీపీ సురేష్ కుమార్ ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనంతరం ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపి నాగయ్య, ఆర్. ఐ చంద్రశేఖర్ తో పాటు పదవి విరమణ చేసిన హోంగార్డ్ బంధుమిత్రులు పాల్గొన్నారు.
Also Read: Hyderabad Cyber Crime: సైబర్ కేటుగాళ్ల చేతిలో రూ.18వేలు స్వాహా.. నిమిషాల్లోనే రికవరీ చేసిన పోలీసులు

