Bhupalpally District: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో క్లౌడ్ బస్టర్..!
Bhupalpally District (imagecredit:twitter)
నార్త్ తెలంగాణ

Bhupalpally District: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో క్లౌడ్ బస్టర్.. నేలకొరిగిన పత్తి మిర్చి పంట

Bhupalpally District: గత సంవత్సరం ములుగు జిల్లా మేడారం తాడ్వాయి అడవుల్లో జరిగిన టోర్నడోల్ తరహాలో లాగే పలిమెల అటవిలో సంభవించడం చర్చకు దారి తీసింది. ఆ తరహాలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం లెంకలగడ్డ గ్రామ శివారులో ఒక్కసారిగా వచ్చిన సుడిగాలులతో రెండు కిలోమీటర్ల మేర 20 ఎకరాల పత్తి, 10 ఎకరాల మిర్చి, 10 ఎకరాల వరి, నేలవాలగా అడవి లోని భారీ వృక్షాలు కూలిపోయాయి. సమీప పంట పొలాల్లోని చెట్లను పెకిలించుకుంటూ వెళ్ళిన రాకాసి గాలులు. పలిమెల అటవీ ప్రాంతంలో నెలకొరిగిన చెట్లకు సంబంధించి అటవీ శాఖ అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

అధికవేగంతో వీచిన గాలులు.

వ్యవసాయ భూముల వద్దకు వెళ్ళి చూసిన రైతులు ఆందోళన చెందాడు. రైతుల సమాచారంతో అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు పర్యటిస్తున్నారు. 50 మీటర్ల వెడల్పుతో కిలోమీటర్ పొడవునా ధ్వంసమైన వృక్షాలు. సుమారు 200 భారీ వృక్షాలు కూలిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించాడు. రెండు వైపులనుండి అధికవేగంతో వీచిన గాలుల వల్ల తీవ్ర నష్టం జరిగినట్లు నిర్ధారించారు. క్షేత్ర స్తాయి సర్వే తర్వాత పూర్తి డ్యామేజ్ అంచనా వేయనున్న అటవీశాఖ అధికారులు తెలిపారు. పలిమెల మండలంలోని లెంకలగడ్డలో గోదావరి పరివాహక అటవీ ప్రాంతంలో సుడిగాలుల ఏర్పడడంతో భారీగా చెట్లు ,మిర్చి, పత్తి పంటలు నెలకొరిగాయి. గత సంవత్సరం సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు మూడు సార్లు ప్రకృతి విలయతాండవం చేయడం సంచలనంగా మారింది. అయితే గత సంవత్సరం సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో ములుగు జిల్లా మేడారం అటవీ ప్రాంతంలో బీభత్సం చోటు చేసుకోగా తాజాగా లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో ప్రళయం సంభవించడం గమనార్హం.

Also Read: Weather Update: రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. అప్రమత్తమైన అధికారులు

గురత్వాకర్షణ శక్తి వల్ల..

మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్య ఏర్పడిన వాటర్ స్పౌట్ ఉత్తర దిశ నుండి దక్షిణం వైపు ప్రయాణం చేసింది. దాదాపు 60 మీటర్ల వెడల్పుతో కిలో మీటర్ పొడవున సుడిగాలులు బీభత్సం సృష్టించింది. అయితే లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో ఏర్పడిన వచ్చిన వాతావరణ మార్పుల ప్రభావం వల్ల కొంతమంది రైతులు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నామని పలువురు రైతులు తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసం మోటార్లను తరలిస్తున్న ఎద్దుల బండి కూడా సుడిగాలుల ఉధృతికి కొట్టుకపోయింది. దీంతో ఎడ్ల బండిలో తీసుకెల్తున్న వ్యవసాయ పనిముట్లన్ని తునాతనకలు అయ్యాయి.. వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయిన కొంతమంది రైతులు వాటర్ స్పౌట్ కారణంగా పలుమార్లు గాల్లోకి లేవగా గురత్వాకర్షణ శక్తి వల్ల తిరిగి నేలపై పడిపోయారు. ఇక్కడే ఉన్నట్టయితే ప్రాణాలు పోయేలా ఉందని గమనించిన రైతులు రాత్రి వరకూ ఇండ్లకు చేరుకుని భిక్కుభిక్కుమంటూ కాలం వెల్లదీశారు. లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో సంభవించిన వాటర్ స్పౌట్ ప్రభావంతో సుమారు 200 చిన్న,పెద్ద చెట్లు నేలకొరిగాయని పలిమెల ఎఫ్ఆర్వో నాగరాజు తెలిపారు. లెంకలగడ్డ అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న వ్యవసాయ భూముల్లో మిర్చి,పత్తి పంటలు కూడా నాశనం అయ్యాయి. మిర్చి, పత్తి వంటి పంటలన్ని ధ్వంసం కావడంతో రైతులు తాము తీవ్రంగా నష్టపోయామని , ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: MD Ashok Reddy: త్వరలో వాటర్ ఆడిట్.. ప్రతి చుక్క నీటిని లెక్కకడతాం: ఎండీ అశోక్ రెడ్డి

Just In

01

Chiranjeevi: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మార్కెట్‌లోకి వచ్చేశారు..

SS Rajamouli: ‘ఛాంపియన్’కు దర్శకధీరుడి ఆశీస్సులు.. పోస్ట్ వైరల్!

Peddi Song: ‘సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక..’ లిరిక్ గమనించారా? ‘చికిరి’‌కి కూడా నోటీసులు ఇస్తారా?

KTR: ప్రజలు కాంగ్రెస్‌ను బొందపెట్టడం ఖాయం.. జలద్రోహాన్ని ఎండగడతాం..కేటీఆర్ ఫైర్!

Archana Iyer: ‘శంబాల’లో రొమాంటిక్ పాటలు, స్టెప్పులు ఉండవని ముందే చెప్పారు