Cyber Crime: సైబర్ నేరగాళ్లు సాధారణ వ్యక్తులనే కాదు. సమాజంలో అన్ని మెలకువలు తెలిసినా వారిని కూడా మోసగించడంలో సఫలీకృతులవుతున్నారు. మొన్న పరకాలకు చెందిన ఇద్దరు యువ డాక్టర్లు సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ.2.51 కోట్లు పోగొట్టుకున్నారు. నేడు వరంగల్(Warangal) నగరానికి చెందిన డాక్టర్ దంపతులు అదే సైబర్ నేరగాళ్ల వలలో పడి 3 కోట్లు పోగొట్టుకున్నారు. ఇవన్నీ చూస్తే నేరగాళ్లు మోసం చేయడంలో ఏదో రకమైన ఆశ చూపెడుతూ మోసగించడంలో ఆరీ తేరారు. అలాంటి ఆశని డాక్టర్లకు సైతం చూపించారు. డాక్టర్లే మోసపోతుంటే సాధారణ ప్రజలు మోసపోవడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
డాక్టర్లు మోసపోయారు ఇలా..
మోనార్క్ నెట్వర్త్ క్యాపిటల్ లిమిటెడ్ (monarch networth capital limited MNCL) భారతదేశంలోని ప్రముఖ ఆర్థిక సేవల కంపెనీ. ఇది 1993 లో నెట్వర్త్ ఫైనాన్స్ లిమిటెడ్ గా స్థాపించబడింది. అయితే ఎంఎంసిఎల్ పేరుగాంచిన ఆర్థిక సేవలు కంపెనీ కదా అని నమ్మి మొదట కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఈ క్రమంలోనే లాభాలు సైతం చవి చూశారు. ఇదే ఆసరా చేసుకున్న సైబర్ నేరగాళ్లు డాక్టర్ల చేత మరింత పెట్టుబడులు పెట్టించారు. ఆ తర్వాత రావాల్సిన లాభాలు రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. చాలా నగదును పోగొట్టుకున్నారు కాబట్టి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ను సైతం ఆశ్రయించాల్సి వస్తుందని పోలీసులు వెల్లడించారు.
Also Read: Telangana global summit: ఒక్క పునరుత్పాదక రంగంలోనే లక్ష కోట్లకుపైగా పెట్టుబడులకు ఎంవోయూలు
దాదాపు రూ.5.51 కోట్లు..
పరకాల యువ డాక్టర్లు ఇద్దరూ, వరంగల్ నగరానికి చెందిన డాక్టర్ దంపతులు దాదాపు రూ.5.51 కోట్లు సైబర్ నేరగాళ్లకు సమర్పించుకున్నారు. అంతేకాకుండా వరంగల్ కు చెందిన వివిధ విభాగాల డాక్టర్లు దాదాపు 30 మంది వరకు ఇలాంటి పెట్టుబడులనే పెట్టినట్టుగా వరంగల్ పోలీసులు వెల్లడిస్తున్నారు. నలుగురు డాక్టర్లు మోసపోతేనే రూ.5.51 కోట్లు వెలుగులోకి వచ్చాయి. అదే 30 మంది డాక్టర్లు మోసపోయారు. మరి ఇంకెన్ని కోట్లు నష్టపోయారో తెలియాల్సి ఉంది.
Also Read: Kriti Height: హీరోల హైట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కృతి సనన్.. అంటే మహేష్ బాబు కూడా!

