Anil Ravipudi: మెగాస్టార్‌కి వెళ్తున్నానని చెప్పకుండానే జారుకున్నా!
Chiru Anil Ravipudi (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Anil Ravipudi: చిరుకి కథ నచ్చకపోవడంతో.. వెళ్తున్నానని చెప్పకుండానే జారుకున్నా!

Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) చిత్రం 2026 సంక్రాంతికి విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. హిట్ మేకర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. సినిమా ప్రారంభం నుంచే ప్రమోషన్స్ మొదలెట్టిన అనిల్ రావిపూడి అండ్ టీమ్.. సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. రీసెంట్‌గా విడుదల చేసిన ‘మీసాల పిల్ల’ సాంగ్ రికార్డులు క్రియేట్ చేయగా, తాజాగా ‘శశిరేఖ’ అనే మరో లిరికల్ సాంగ్‌ని మేకర్స్ వదిలి, సినిమాపై మరింతగా అంచనాలను పెంచేశారు. ఇంకో సాంగ్ చిత్రీకరణ జరిపితే షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి చిత్రీకరణను చూసుకుంటూనే, ప్రమోషన్స్‌లోనూ పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన పాల్గొన్న తాజా ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

Also Read- Rahul Ravindran: రష్మిక ముఖంపై రంగులు.. ‘అర్జున్ రెడ్డి’కి కనెక్షనా? నెటిజన్ ప్రశ్నకు రాహుల్ సమాధానమిదే!

నేనే తుర్రుమని వెళ్లిపోయా

ఆయన షేర్ చేసుకున్న విషయంతో మెగాస్టార్ చిరంజీవి గొప్పతనం ఏంటో మరోసారి అనిల్ రావిపూడి తెలియజేసినట్లయింది. సరే విషయంలోకి వస్తే.. అనిల్ రావిపూడి ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘మన శంకర వర ప్రసాద్ గారు సినిమా కంటే ముందే ఆయనతో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఒక సబ్జెక్ట్ అనుకుని ఆయన దగ్గరకు వెళ్లడం జరిగింది. కానీ స్లాట్ విషయంలో సెట్ కాలేదు. కొంచెం డిలే అవుతుందని చెప్పి.. నేనే తుర్రుమని వెళ్లిపోయా. నిజం చెప్పాలంటే.. ఆయనకు చెప్పుకుండా జంప్ అయిపోయా. అయినా కూడా ఆయన నాకు మళ్లీ అవకాశం ఇచ్చారు. ఆయనలో ఉన్న గ్రేట్‌నెస్ అదే. హి లవ్స్ సినిమా. హి లవ్స్ టెక్నీషియన్స్.

Also Read- Tollywood Producers: టాలీవుడ్ నిర్మాతలు ఎప్పటికీ మారరా? ముందు చేయాల్సింది ఇదే!

ఆయనలో నేను చూసిన బెస్ట్ థింగ్ అదే

ఈ కుర్రోడి దగ్గర ఏదో ఛార్మ్ ఉంది. మంచి ఫైర్ క్రాకర్‌లా ఉన్నాడని నాపై ఆయనకు ఓ ఫీలింగ్ ఉంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత మళ్లీ వెళ్లి కలిశాను. సార్, మీతో సినిమా చేస్తున్నాను అని అనగానే ఆయన కూడా ఎంతో ఎగ్జయిట్ అయ్యారు. మాములుగా అయితే.. వీడు అప్పుడు చెప్పుకుండానే వెళ్లిపోయాడని మనసులో పెట్టుకుంటారు. కానీ ఆయన అలాంటి పర్సన్ కాదు. ఆయన దగ్గర ఎంత ఓర్పు ఉందంటే.. మాములుగా నాకే ఓర్పు ఎక్కువని అనుకుంటూ ఉంటాను. ఆయనతో పోలిస్తే అది నథింగ్. ఆయనకి ఎంత ఓర్పు ఉంటుందంటే.. నచ్చిన వాళ్లతో ఎవరైనా మాట్లాడతాం. ఆయన మాత్రం నచ్చని వాళ్లతో కూడా ఎంతో ప్రేమతో మాట్లాడతారు. ఎలాంటి కష్టసమయమైనా సరే.. ఆయన చాలా ఓర్పుగా ఉంటారు. 4 జనరేషన్స్‌ను రూల్ చేసిన హీరో ఆయన. మెగాస్టార్. ఇప్పటికీ అదే గ్రౌండ్‌లో ఉంటూ, తన బ్యాలెన్స్ మిస్సవకుండా.. శత్రువు అయినా సరే.. పాజిటివ్‌గానే మాట్లాడతారు. ఆయనలో నేను చూసిన బెస్ట్ థింగ్ అదే. నాకు ఆయనతో ఉన్న స్పేస్ నిజంగా లైఫ్ టైమ్ మెమరబుల్. ఆయన డ్యాన్స్, ఫైట్స్ చూస్తూ పెరిగాం. చిరంజీవి అనే పేరే ఒక సెన్సేషన్. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని చాలా మంది ఇండస్ట్రీకి వచ్చారు. ఒక కామన్ మ్యాన్‌గా వచ్చి, స్టార్ అయ్యారు. అలా చాలా మందికి స్ఫూర్తిగా నిలిచిన హీరో ఆయన. ఆయనతో జర్నీ నిజంగా అద్భుతం’’ అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Lipstick: మీ స్కిన్ టోన్‌కి అద్భుతంగా కనిపించే లిప్ స్టిక్ షేడ్స్.. డే-టు-డే నుండి పార్టీ లుక్ వరకు

New Year Party: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్.. నగరానికి చేరుస్తున్న పెడ్లర్లు డెడ్​ డ్రాప్​ పద్దతిలో..!

Nagababu Politics: అక్కడ ఫోకస్ పెట్టేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఫోకస్ తగ్గించుకుంటున్న మెగా బ్రదర్..

BiggBoss9 Prize Money: బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్‌కు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే?

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా