Khammam District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Khammam District: 400 ఎకరాల భూమి సాగుకు అవకాశం.. పట్టించుకోని ప్రభుత్వం

Khammam District; రైతుల గోస రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదాయే అని సిపిఎం(CPM) మధిర మండల కార్యదర్శి మందా సైదులు(Manda Saidul) ఆరోపించారు. మధిర(Madhira) మండలం తొండల గోపారం గ్రామపంచాయతీ పరిధిలో కట్టలేరుపై ఏర్పాటుచేసిన లిఫ్ట్ మరమ్మత్తులు చేయించి రైతాంగానికి ఉపయోగంలోకి తీసుకురావాలని స్థానిక రైతులు, సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. రైతులు, సిపిఎం పార్టీ నాయకులు చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం ముందు “చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు” అయ్యిందని సిపిఎం పార్టీ మధిర మండల కార్యదర్శి మందా సైదులు అన్నారు.

కనీస స్పందన కరువు
సుమారు 400 ఎకరాల భూమి రెండు పంటలు సాగుకు అవకాశం ఉన్న విషయాన్ని బహిరంగంగా ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తిపై అధికారులు ప్రజాప్రతినిధుల నుండి కనీస స్పందన లేకపోవడం రైతాంగం పట్ల ప్రభుత్వ బాధ్యతలో నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందని అన్నారు. అధికార పార్టీ నాయకులమని గొప్పలు చెప్పుకునే నాయకులకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరణ పనులు చేయటం ఇష్టం లేదా? అనే విషయం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: Swetcha Effect:స్వేచ్ఛ కథనానికి స్పందన.. మెట్లను తొలగించిన అధికారులు

సిసి రోడ్డు నిర్మించాలి
రైతులు తొర్లపాడు రోడ్డు నుండి పొలాల వరకు వెళ్లడానికి రోడ్డు గుంతల మయం అయిందని ఆ రోడ్డును వెంటనే మంజూరు చేసి పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. రైతులు వ్యవసాయ పనులు రీత్యా కట్టలేరు వరకు వెళ్లడానికి రావడానికి ట్రాక్టర్లు, అరకలు, పశువులు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే రోడ్డు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని కోరారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించకుంటే రైతుల స్పందించి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ రోడ్డు(Road)) పరిశీలన కార్యక్రమంలో సిపిఎం(CPM) పార్టీ డివిజన్ నాయకులు పాపినేని రామ నరసయ్య(Papineni Rama Narasaiah ఎర్రుపాలెం పార్టీ మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్(Prabakar) గంగనబోయిన శివ కాశిబోయిన శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Also Read: Revanth Reddy: నిబద్ధత గల జర్నలిజానికి లక్ష్మణ రేఖ గీయాలి: సీఎం

Just In

01

Pawan Kalyan: అల్లు అరవింద్ మదర్ పవన్ కళ్యాణ్‌ని ఏమని పిలిచే వారో తెలుసా?

Vimal Krishna: ‘డీజే టిల్లు’ దర్శకుడి తర్వాత చిత్రం, హీరో.. డిటైల్స్ ఇవే!

Hyderabad Collector: ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన.. జిల్లా కలెక్టర్ హరిచందన

R.V. Karnan: శానిటేషన్ వర్కర్ల జీవితాల్లో వెలుగు.. రూ. 30 లక్షలకు పెరగనున్న కార్మికుల ఇన్సూరెన్స్

Bigg Boss 9 Telugu: బాడీ షేమింగ్.. మొదటి రోజే కామనర్ ఆగ్రహానికి గురైన ఇమ్మానుయెల్!