CPI Party: ఒంటరిగా బరిలోకి సీపీఐ ఎదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో సీపీఐ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మొహమ్మద్ మౌలానా అన్నారు. ఈ మేరకు ఎదులాపురం మున్సిపాలిటీలోని ముత్తగూడెంలో సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రానున్న ఎన్నికల్లో సిపిఐ 15 వార్డుల్లో పోటీ చేయనుందన్నారు. కావున సీపీఐ శ్రేణులు సమయత్వం కావాలని పిలుపునిచ్చారు.
Also Read: CPI Hyderabad: 100 ఏళ్ల సిపిఐ వేడుకలు.. జెండాలతో కళకళలాడిన నగరం!
సైనికుల్లా పనిచేయాలి
గెలుపు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆయా వార్డుల్లో సీపీఐ జెండా ఎగరేసేందుకు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. విజయ సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పుచ్చకాయల కమలాకర్, మెడకంటి పెద్ద వెంకటరెడ్డి, సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఉన్నం రంగారావు, చెరుకుపల్లి భాస్కర్ వెంపటి సురేందర్ పగిళ్ల వీరభద్రం సీపీఐ మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్, సీపీఐ మున్సిపాలిటీ వార్డుల కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.
Also Read: CPI Narayana: బీజేపీ – బీఆర్ఎస్ మధ్య సంబంధం ఉంది: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

