CPI Centenary: ట్రంప్‌కు బ్రేక్ వేయాలంటే మాకే సాధ్యం..!
CPI Centenary (imagecredit:twitter)
Telangana News, ఖమ్మం

CPI Centenary: ట్రంప్‌కు బ్రేక్ వేయాలంటే మాకే సాధ్యమవుతుంది: ఎమ్మెల్యే కూనంనేని

CPI Centenary: కమ్యూనిస్టు పార్టీలన్నీ ఒక్క జెండా కిందికి రావాలని, అప్పుడే ఢిల్లీలోని ఎర్రకోటపై ఎర్రజెండా ఎగురుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. సీపీఐ ఆవిర్భవించిన 100 ఏళ్ల సందర్భంగా అంతా ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలన్నారు. అందరం కలిసి ఆలోచన చేస్తే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, సిద్దాంత వైరుద్దాలు ఉన్నా పరిష్కారం అవుతూనే వచ్చాయని గుర్తు చేశారు. ఆదివారం సీపీఐ బహిరంగ సభలో పాల్గొన్న కూనంనేని మాట్లాడుతూ, సీపీఐ, సీపీఐ(ఎం) కలిసి ప్రజా సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ రెండు పార్టీలు కలిసిన తర్వాత మిగిలిన అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఏకం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మావోయిస్టులు భిన్నమైన ఎజెండాతో ఉన్నప్పటికీ వారు కూడా ఆలోచన చేయాలని కూనంనేని సాంబశివరావు బహిరంగ సభ వేదిక ద్వారా పిలుపునిచ్చారు. అప్పటివరకు ఐక్యత కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని తెలిపారు. ఆ ఐక్యత లేకపోతే ఇవాళ అపరేషన్ కగార్ అనో, ఇంకో పేరుతోనో మావోయిస్టుల పేరుతో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మానవ హననానికి పాల్పడుతూనే ఉంటుందని ఆయన హెచ్చరించారు. దీనికి పరిష్కారం ఒక్కటేనని, కమ్యూనిస్టులంతా ఒక్కటి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు. ‘ప్రజల కోరికను అంగీకరిద్దాం. వీడిపోయిన మనమంతా ఐక్యమవుదాం’ అని కూనంనేని సాంబశివరావు కోరారు.

బహిరంగ సభనే సమాధానం

కమ్యూనిస్టు పార్టీ ఎక్కడ ఉందనే వారికి సీపీఐ బహిరంగ సభనే సమాధానమని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. 100 ఏళ్ల ఉత్సవాలను వీర తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది ఆశువులు బాసిన తెలంగాణలో, అందులో ప్రధానమైన పాత్ర పోషించిన ఖమ్మంలో ప్రాంతంలో జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నా మన్నారు. కమ్యూనిస్టు పార్టీకి మరణం లేదని, ఈ జెండాను మోసేవాడు నేలకొరిగే లోపే మరొకరు జెండాను ఎత్తేందుకు ఎప్పుడూ సిద్దంగా ఉంటారన్నారు. ఇందుకు ఈ బహిరంగ సభకు తరలి వచ్చిన చిన్నారుల మొదలు నవయువతే సాక్షమన్నారు. మనిషి కోసం పుట్టిన సిద్దాంతం కమ్యూనిజమని, పేదవాడి కంచంలో మెతుకు కమ్యూనిస్టు పార్టీ అని, నిరుపేదల ఆశా జ్యోతి ఎర్రజెండా అన్నారు. మనిషి ఉన్నతం వరకు ఎర్రజెండాకు మరణం లేదని, నిజమైన దేశ భక్తులు కమ్యూనిస్టులేనని సాంబశివరావు ఉద్ఘాంటించారు.

కాంగ్రెస్ ప్రజాస్వామిక పార్టీ

కాంగ్రెస్ పార్టీతో రాజకీయ వైరుద్దం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రజాస్వామిక పార్టీ అన్నారు. అన్నింటి కంటే తాను ముఖ్యమంత్రిని అనే భేషజాలు చూపని ప్రజా విప్లవకారుడు ముఖ్యమంత్రి రేవంత్ అని, అందుకే ఆయనను సీపీఐ వందేళ్ల ముగింపు ఉత్సవాలకు ఆహ్వానించామని కూనంనేని సాంబశివరావు చెప్పారు. అదేవిధంగా గొప్ప మేధావి అయిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అందరికంటే ఎక్కువగా మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు సైతం బహిరంగ సభలో భాగస్వామ్యం కావడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.

Also Read; BRS Party: మున్సిపల్, ఎన్నికల్లో నమ్మకస్తులకే బాధ్యతలు.. ఆ మాజీ ఎమ్మెల్యేలకు చెక్!

కమ్యూనిస్టు పార్టీకి వందేళ్ల పోరాట చరిత్ర

భారతదేశంలో కాంగ్రెస్‌కు 140 ఏళ్లు, భారత కమ్యూనిస్టు పార్టీకి వందేళ్ల ఘనమైన పోరాట చరిత్ర ఉందని, దేశభక్తి అంటే ఏంటో ఈ పార్టీలకే తెలుసని సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా పేర్కొన్నారు. చరిత్ర లేని వారు నేడు దేశభక్తులుగా చెప్పుకునేందుకు తాపత్రయ పడుతున్నారని ఆయన ఆర్ఎస్ఎస్‌ను ఉద్దేశించి ఆరోపించారు. భారత కమ్యూనిస్టు పార్టీ శత వసంతాల ముగింపు ఉత్సవాల సందర్భంగా ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ, 1925లో ఆవిర్భవించిన సీపీఐ, అంతకంటే ముందే సంపూర్ణ స్వాతంత్ర్యానికి పిలుపునిచ్చిన ఏకైక పార్టీ అని కొనియాడారు. వందేళ్ల త్యాగాలతోనే ఈ నేల పునీతమైందని, స్వాతంత్ర్యానంతర పరిణామాలలోనూ కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

మోదీపై ధ్వజం..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంతలా వ్యవహరిస్తూ మరో హిట్లర్ కావాలని చూస్తున్నారని, ఆయన సామ్రాజ్యవాద ధోరణిని ఎర్ర జెండాలు ఎదుర్కొంటాయని రాజా స్పష్టం చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయాలని అమెరికా ఒత్తిడి తెస్తుంటే, దానిని ప్రశ్నించే శక్తి ప్రధాని మోదీకి లేదని విమర్శించారు. దేశంలో మతోన్మాద శక్తులు విజృంభిస్తున్నాయని, వాటిని అడ్డుకునేందుకు లౌకిక శక్తులన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మెక్సికో, క్యూబా వంటి దేశాలను బెదిరించడం అనుచితమని, ఐక్యరాజ్యసమితి మద్దతు ఉన్న పాలస్తీనా ద్విరాష్ట్ర పరిష్కారానికి సీపీఐ కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు. దేశంలో మతోన్మాద, ఫాసిస్టు శక్తులు విజృంభిస్తున్నాయని, వీటిని అడ్డుకునేందుకు లౌకిక శక్తులన్నీ ఏకం కావాలని రాజా పిలుపునిచ్చారు. బలమైన ఉద్యమాల ద్వారానే మతోన్మాదాన్ని అడ్డుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ శతాబ్ది ఉత్సవాల సభ కార్యకర్తలలో నూతన ఉత్తేజాన్ని నింపిందని పేర్కొన్నారు.

Also Read: CM Revanth Politics: ఎన్టీఆర్, చంద్రబాబు ఫ్యాన్స్‌కు సీఎం రేవంత్ అనూహ్య పిలుపు.. ఇక తిరుగుండదా?

Just In

01

Minister Ponguleti: విపక్షాల కారుకూతలు నమ్మోద్దు.. పట్టణాల్లో పాగా వేద్దాం: మంత్రి పొంగులేటి

Municipal Elections: మున్సిపల్ ఎన్నికల ఇంఛార్జులుగా.. తెలంగాణ మంత్రులు.. సీఎం రేవంత్ వ్యూహం ఇదే!

RTA Corruption: సుప్రీం పవర్స్‌తో ఏఓల ఆధిపత్యం.. ఆర్టీవోలు లేకపోతే వాళ్లదే ఇష్టారాజ్యం!

KGBV Teachers: సార్ మా గోడు వినండి.. చాలీచాలని జీతాలతో కేజీబీవీ ఉద్యోగులు అవస్థలు..!

Kavitha – PK Alliance: కవిత కొత్త పార్టీ.. రంగంలోకి రాజకీయ వ్యూహాకర్త పీకే.. వర్కౌట్ అయ్యేనా?