CP Sunpreet Singh (imagcredit:twitter)
నార్త్ తెలంగాణ

CP Sunpreet Singh: వరంగల్ పోలీసులపై సీపీ సీరియస్.. మెమో జారీ

CP Sunpreet Singh: సమాజంలో పోలీస్ శాఖకు ఉన్న స్థాయిని హోదాను మరిచి నాయకుల మెప్పుకోసం తరచూ దిగజారుడు పనులు చేసి ప్రజల వద్ద అబాసు పాలు కావడం వరంగల్ డివిజన్ పోలీసులకు అలవాటుగా మారింది. ఇబ్బందులు ఎదుర్కొని పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ప్రజలకు భరోసా నింపి అండగా నిలవాల్సిన పోలీసులు చట్టానికి విరుద్ధంగా వ్యవహరించి ఏలాంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో లేకున్న రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే నాయకుల మెప్పు కోసం వారిని సంతృప్తి పరిచే పనులు చేస్తూ సామాన్య ప్రజల ముందు నవ్వుల పాలు అవుతున్నారు. ఏకంగా ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకుల పుట్టిన రోజు వేడుకలు బహిరంగంగానే నిర్వహించడం, చట్ట విరుద్ధమైన వారు చెప్పిన పనులు చేస్తూ అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులు వత్తుతూ కొందరు పోలీస్ అధికారులు పోలీస్ శాఖ పరువు తీస్తున్నారు.

నేతల పుట్టిన రోజు వేడుకలు.. వంగి వంగి దందాలు

అతివినయం దుష్ట లక్షణం అంటారు. అచ్చం అచ్చుగుద్దినట్టు ఇలాగే వ్యవహరిస్తున్నారు కొందరు వరంగల్ డివిజన్‌లోని పోలీసు అధికారులు. వారు రాజకియ నాయకుల పట్ల స్పందిస్తున్న తీరు తరుచూ తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాహాటంగానే ప్రజాప్రతినిధులు, రాజకియ పార్టీ నేతల పుట్టిన రోజులు నిర్వహించడం, దావతులు చేయడంపై పలుమార్లు పోలీస్ ఆగ్రహం వ్యక్తం చేసిన వారి తీరు మారకపోవడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ నాయకులకు అనాధికారికారికంగా పోలీస్ సెక్యూరిటీ ఇవ్వడం, నాయకులకు ఎదురెళ్లి వంగి వంగి దందాలు పెట్టీ పోలీస్ స్టేషన్‌కు, అధికారిక కార్యక్రమాలకు స్వాగతం పలకడం, నాయకులు చెప్పినట్టు విని తప్పుడు కేసులు పెట్టీ సామాన్యులను వేదింపులకు గురి చేయడం వంటి స్థాయి తక్కువ పనులు చేసి పరువు తీసుకున్నారనే విమర్శలు ఉన్నాయి.

Also Read: Minister Seethakka: పొగరుతో కేటీఆర్‌.. మంత్రి సంచలన వ్యాఖ్యలు!

వరంగల్ డివిజన్ పోలీసులకు మెమో జారీ

నాయకుల మెప్పుకోసం తరచూ ఆరాటపడే పోలీసు అధికారులు తాజాగా ఎలాంటి రాజ్యంగ పదవిలో లేని కాంగ్రెస్ నాయకుడు కొండా మురళికి ఎస్కార్ట్ కల్పించి వరంగల్ పోలీస్ కమిషనర్ ఆగ్రహానికి గురి అయ్యారు. అతిగా స్పందించి మాజీ ప్రజా ప్రతినిధికి ఎస్కార్ట్ ఇచ్చిన పోలీసు అధికారులపై వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కొండా మురళికి ఎస్కార్ట్ కల్పించిన వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్, సీఐ షూకూర్ సహా మరో ఇద్దరు అధికారులకు సీపీ మెమోలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లుగా మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించిన సీపీ మెమోలు జారి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలుపలంటూ సీపీ మెమోలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితం పోలీసు అధికారులు కొండా మురళికి ఎస్కార్ట్ తీసుకెళ్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి.

నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు

దీంతో ఈ విషయం ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లడం, ప్రతిపక్షాలు, సామాన్య జనాలు, ముఖ్యంగా నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో దీనిపై ప్రభుత్వం సీరియస్ స్పందించినట్లు తెలుస్తుంది. అనేక వివాదాలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సీపీ వరంగల్ డివిజన్ పోలీస్ అధికారులకు మెమో జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మెమో జారీ చేసినా వారిపై వేటు పడటం ఖాయంగా అనే చర్చ ఇప్పుడు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చర్చ పెద్ద మొత్తంలో సాగుతుంది. ఇకనైనా నాయకుల అండ చూసుకుని రెచ్చిపోయే పోలీస్ అధికారులు తీరు మార్చుకొని ప్రజల కోసం నిబంధనల ప్రకారం పని చేయాలని ప్రజలు కోరుతున్నారు. నేతల అండ చూసుకుని రెచ్చిపోయి ఇబ్బందుల్లో పడ్డ అనేక మంది అధికారులు పనిష్మెంట్ గురైనప్పుడు ఆదుకునే వారు ఉండరని ఇప్పటికైనా వాస్తవం గ్రహించి చట్ట ప్రకారం పని చేయాలి అని వరంగల్ ప్రజలు కోరుతున్నారు.

Also Read: Kaleshwaram Project Commission: కాళేశ్వరం విచారణలో బిగ్ ట్విస్ట్.. రేవంత్ సర్కార్‌కు కమిషన్ సంచలన లేఖ!

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!