Best Teacher Awards (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Best Teacher Awards: ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో నిబంధనలు నిల్.. పైరవీలు ఫుల్!

Best Teacher Awards: జోగులాంబ గద్వాల జిల్లా జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు ఏర్పాటు అయిన సెలక్షన్ కమిటీ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు జిల్లాను యూనిట్ గా తీసుకోవాలి, కానీ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేయాలంటే కనీసం 15 సంవత్సరాల సీనియారిటీ ఉండాలి, కానీ జూనియర్లను ఎంపిక చేసి మండల స్థాయి ఎంఈఓ(MEO) లు సూచించిన ఉపాధ్యాయులు పేర్లని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఎంఈఓ(MEO) లు సీనియారిటీ పాటించకుండ తమ అనుకూలంగా ఉన్నవారిని ఎంపిక చేసి జాబితాను రూపొందించారని పలువురు ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. అదేవిధంగా దీర్ఘకాలిక సర్వీస్ లో వారు బోధించిన విధానాన్ని పరిగణలోకి తీసుకోవాలి.

అంతా ఎంఈఓల కనుసన్నల్లోనే..

ఎంఈఓలు(MEO), సెలక్షన్ కమిటీ వారు కూర్చుని మండలానికి ఇన్ని అని చెప్పి పంచుకున్నట్టుగా ఉందని వారు విమర్శించారు. బాగా పనిచేసిన సీనియర్లను కాదని ఎంఈఓల ఒత్తిడికి లోనై మండలాల నుంచి జూనియర్లను ఎంపిక చేయడం జరిగింది. కొన్ని మండలాల ఎంఈఓ లు సత్రవర్తన లేని వారిని కూడా ఎంపిక చేసినట్లు తెలిసింది. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఉత్తమ ఉపాధ్యాయ సెలక్షన్ లిస్ట్ కూడా లేటుగా విడుదల చేయడం అంతర్యం ఏమిటని పలువురు ఉపాధ్యాయులు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్క మండలంలో ఐదు మంది నుంచి ఆరు మంది చొప్పున ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయగా కొత్తగా ఏర్పడిన మండలంలో కేవలము ముగ్గురు ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేశారు.

Also Read: KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

ఈ మండలంలో ఎక్కువమంది ఉపాధ్యాయులు లేరా అని పలువురు సంఘాల నాయకులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. కొంతమంది ఉపాధ్యాయులపై కేసులు నమోదై సంఘటనలుఉన్న వారిని కూడా వారిని కూడా ఉత్తమ ఉపాధ్యాయులను ఏ విధంగాఎంపిక చేశారని పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు గుసగుసలాడుతున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు గతంలో కూడా అవార్డులను తీసుకున్నారని, ఎంఈఓలు ఒకే యూనియన్ కు కొమ్ముకాస్తున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో మాత్రం సరైన పద్ధతులు జరగలేదని తెలుస్తుంది.

కేటిదొడ్డి మండలంలో అవకవతవకలు

కేటిదొడ్డి(Katie Dhodi) మండలంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో అవకవతవకలు జరిగాయి. 2002 సంవత్సరం నుంచి పని చేస్తున్న ఉపాధ్యాయులను కేటిదొడ్డి ఎంఈఓ(MEO) పక్కన పెట్టాడని సీనియర్ ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. ప్రతి మండలం నుంచి 5 మంది ఉత్తమ ఉపాధ్యాయులు ఎంపిక చేయాల్సింది. కేటిదొడ్డి మండలం నుంచి ముగ్గురే ఎంపికపై అసహనం చేసిన ఉపాధ్యాయులు ఎంఈఓ‌‌‌ సొంత నిర్ణయాలతో, ప్రత్యేక కోటరీ ఏర్పాటు చేశారు. చేసుకోవడంతోనే మిగతా టీచర్ లకు మొండిచేయి చూపించారని వాపోతున్నారు.

Also Read: Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. రీతూ చౌదరి, డీమాన్ పవన్, సంజన!

Just In

01

Illegal Sand Mining: యథేచ్ఛగా అధికారుల అండతో.. అక్రమ మట్టి దందా?

CM Revanth Reddy: నెత్తిన నీళ్లు చల్లుకున్నంత మాత్రాన.. వాళ్ల పాపాలు తొలగిపోవు.. సీఎం రేవంత్

Crime News: తండ్రిని హత్య చేసి.. డెడ్‌బాడీ పక్కన నిద్రపోయిన కొడుకు

Rajinikanth- Kamal Haasan: ఇద్దరు పెద్ద హీరోలతో ఒక సక్సస్‌ఫుల్ దర్శకుడు.. ఇక బాక్సాఫీస్ బద్దలే

Raashii Khanna: రాశీ ఖన్నా ఎమోషనల్ అయింది.. తెలుసు కదా!