VRAs Demands: వీఆర్ ఏ వారసులకు తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని ఆ జేఏసీ కోరుతున్నది. ఇప్పటి వరకు 61 ఏళ్ల పై బడిన వీఆర్ ఏల్లో సుమారు 400 మందికి పైనే చనిపోగా, ఆయా వారసుల్లో దాదాపు 28 మంది మృతి చెందారు. ఇందులో 11 మంది వారసులు సూసైడ్ చేసుకోగా, 8 మంది యాక్సిడెంట్, 9 మంది అనారోగ్యంతో మరణించారు. వారసత్వ ఉద్యోగాల అపాయింట్ మెంట్ ఆర్డర్ల కోసం రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా. .ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్వపు వీఆర్ ఏ(VRA), వీఆర్(VRO) ల్లో కొందరికి తాజాగా జీపీవో(GPO)లుగా అవకాశం కల్పించిన సర్కార్.. తమకూ ఛాన్స్ ఇవ్వాలంటూ వీఆర్ ఏ(VRA) వారసత్వ ఉద్యోగాల జేఏసీ కోరుతున్నది. మంత్రుల చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా..న్యాయం జరగడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
జీవో ప్రకారం ఉద్యోగాలు
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యేక చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని వీఆర్ ఏ జేఏసీ(VRA JAC) కన్వీనర్ వంగూరు రాములు కోరారు. జీవో 81,85 ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. 3797 ఉద్యోగుల్లో కొందరు తమ వారుసులను పది నుంచి పన్నేండేళ్లుగా వీఆర్ ఏలుగా పనిచేపిస్తూనే ఉన్నారు. ఇందులో కొందరు కంప్యూటర్ వర్క్, మరి కొందరు ఫీల్డ్ లెవల్ వర్క్ చేస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చేసినోళ్లూ ఉన్నారు. దీంతో వీళ్లకు ఉద్యోగాలు ఇవ్వడం వలన రెవెన్యూశాఖ బలోపేతం అవుతుందని రాములు వివరించారు. పేద కుటుంబాలకు న్యాయం జరగడమే రాకుండా, ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్న భూ భారతి చట్టం కూడా సమర్ధవంతంగా అమలవుతుందని ఆయన వివరించారు.
Also Read: Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?
బీఆర్ ఎస్ హామీ.. కాంగ్రెస్ భరోసా…?
వీఆర్ ఏ(VRA) లకు పే స్కేల్, వారసులకు ప్రభుత్వం లో ఉద్యోగాలు కల్పిస్తామని గత సీఎం కేసీఆర్(KCR) 2020లో హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత మాట నెరవేర్చలేదు. దీంతో వీఆర్ ఏ(VRA)లు ఐక్యమై జేఏసీగా ఏర్పడి 24 జూలై 2022 నుంచి అక్టోబరు 12 వరకు 80 రోజుల పాటు సుదీర్ఘ సమ్మె, ఛలో అసెంబ్లీ, రాస్తారోకో వంటి కార్యక్రమాలు చేశారు. వీఆర్ ఏ లంతా రోడెక్కడంతో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ హోదాలో న్యాయం చేస్తానని గతంలో హామీ ఇచ్చారు. అంతేగాక సీపీఎం(CPM), సీపీఐ(CPI), బీజేపీ(BJP), బీఎస్ పీ(BSP), జన సమితి తదితర పార్టీలతో పాటు ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు కూడా వీఆర్ ఏ ధర్నా పాయింట్లు, సభలకు చేరుకొని మద్ధతిచ్చాయి. దీన్ని గమనించిన గత ప్రభుత్వం జూలై 2023న జీవో 81,జీవో 85 ను విడుదల చేసింది.
వారసత్వ ఉద్యోగాలు
ఈ జీవోల ప్రకారం 20,555 మంది లో 16,758 మంది వీఆర్ ఏ లకు ప్రమోషన్లు కల్పిస్తూ, రెవెన్యూతో పాటు మున్సిపల్(Muncipal), మిషన్ భగీరథా(Mission Bhagiratha), ఎడ్యుకేషన్, హెల్త్(Health), అగ్రికల్చర్(Agriculture,), సోషల్ వెల్ఫేర్ శాఖల్లో సర్దుబాటు చేశారు. కానీ ఇందులో 61 ఏళ్లకు పై బడిన 3797 మంది కి వారసత్వ ఉద్యోగాలు కల్పించాల్సి ఉన్నా.. ఇవ్వలేదు. ఇదే సమయంలో ప్రభుత్వం మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్(Congress) ప్రభుత్వం న్యాయం చేస్తుందని భావించినప్పటికీ తమకు నిరాశే మిగిలిందని ఉద్యోగులు చెప్తున్నారు. వారసత్వ ఉద్యోగాల కోసం చాలా మంది ఆస్తి పంపకాలు చేసుకున్నారు. వాటాలు షేర్ కోసం కొందరు అప్పులు కూడా చేసినట్లు జేఏసీ చెప్తున్నది. ఉద్యోగాలు ఆలస్యమవడంతో మానసిక ఒత్తిడితో అనారోగ్యంతో పాటు ఆత్మహత్యలు జరుగుతున్నాయని జేఏసీ స్పష్టం చేసింది.
Also Read: Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?