Congress vs CPI ( image CREDIT: TWITTER)
నార్త్ తెలంగాణ

Congress vs CPI: నువ్వా నేనా అంటూ హోరాహోరి పోరు

Congress vs CPI: : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ వర్గాలు కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ గా మారుతున్నాయి. 2023 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరికి మరొకరు తోడుగా ఉంటూ కొత్తగూడెం ఎమ్మెల్యే స్థానాన్నిబీఆర్ఎస్‌(BRS) పై గెలిచేందుకు పోటీకి కృషి చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. సిపిఐ పార్టీతో రాష్ట్రంలో పొత్తు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తొలి అసెంబ్లీ సమావేశాల నుండే తన వాడి వేడిని అసెంబ్లీలో చూపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పై వేలెత్తి చూపించే ప్రయత్నం సైతం చేశారు. అయితే ఇటీవల కాలంలో అటు కాంగ్రెస్(CONGRESS) నాయకులు, ఇటు కాంగ్రెస్ పొత్తుతో సిపిఐ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన కూనంనేని సాంబశివరావు చేస్తున్న వ్యాఖ్యలు పలు వివాదాలకు తావిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Pongileti Srinivas Reddy) పదేపదే సిపిఐ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేను కాంగ్రెస్ మద్దతుతో గెలిపించామని చెబుతూ వస్తున్నారు. అంతేకాకుండా తాను పాలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ నా దృష్టి మాత్రం కొత్తగూడెం మీదనే ఉందని పలుమార్లు ఉద్ఘాటిస్తూ వస్తున్నారు.

 Also Read: Rare Mineral In Karre Gutta: అధికారికంగా 30 లక్షలు.. అనధికారికంగా కోటిపైనే చెట్లను నరికేందుకు స్కెచ్!

పొత్తుతో గెలిచిన అంతర్యుద్ధమే
మాజీ సీఎం కేసీఆర్ సిపిఎం, సిపిఐ పార్టీలను తోక పార్టీలుగా అభివర్ణించడంతో ఎర్ర జెండాల నాయకులు కాంగ్రెస్ పార్టీ పంచన చేరారు. ఈ క్రమంలో సిపిఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పొత్తు కుదరలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీతో అసెంబ్లీ ఎన్నికల్లో జతకట్టింది. పొత్తులో భాగంగా కొత్తగూడెం ఎమ్మెల్యే సీటు సీపీఐ పార్టీకి కేటాయించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మొత్తానికి కాంగ్రెస్, సిపిఐ పార్టీలు ఏకమై బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పై గెలుపొందారు. గెలిచిన నాటి నుండే ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ పార్టీపై ఓరకంటి చూపుతో చేయాల్సిన చర్యలన్నీ చేస్తూ వస్తున్నారు. ఇందుకు సరైన సమయం కోసం చూస్తూ వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు మంత్రి పొంగిలేటి రూపంలో కూనంనేని సాంబశివరావు పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ వస్తున్నారు. పదేపదే కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా సిపిఐ ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావును గెలిపించామని పలు సందర్భాల్లో వెలిబుచ్చారు.

నువ్వా నేనా అంటూ హోరా హోరి
గత వారం రోజుల క్రితం నుండి మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఏ సందర్భం వచ్చిన తన పాలేరు నియోజకవర్గం కంటే ఎక్కువగా కొత్తగూడం నియోజకవర్గం పై దృష్టి సారిస్తున్నట్లుగా వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. ఇదే కాబోలు కొత్తగూడెం సిపిఐ 27వ మహాసభల సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కూనంనేని  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సహకారంతో నేను ఎమ్మెల్యేగా గెలవలేదని… అన్ని పార్టీల సహకారంతోనే గెలిచానని సాంబశివరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కొత్తగూడెంలో కమ్యూనిస్టులను దూరం చేయాలని కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని వెల్లడించారు.

భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా సిపిఐ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామని స్పష్టం చేశారు. సిపిఐ, సిపిఎం పార్టీలను మాజీ సీఎం కేసీఆర్ తోకపాటిలని అభివర్ణించినట్లుగా గుర్తు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ తో పొత్తు పెట్టుకోకుంటే ఏం జరిగిందో మాజీ సీఎం కేసీఆర్ కు తెలిసిందని వివరించారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కమ్యూనిస్టులు పొత్తుల కోసం వెంపర్లాడరని వెల్లడించారు. కేరళ, తమిళనాడులోని బలంగా ఉన్నట్లుగానే తెలంగాణలోని ఎర్ర పార్టీలు పూర్వ వైభవాన్ని దక్కించుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగి తమ రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పారు. అయితే ఇటీవల అటు కాంగ్రెస్ పార్టీ ఇటు సిపిఐ పార్టీ నువ్వా నేనా అంటూ వివాదాస్పద వ్యాఖ్యల్లో హోరా హోరీగా పోటీ పడుతున్నారు. కొత్తగూడెం మహానగర పాలక సంస్థ కావడంతో మేయర్ పదవి కోసం ఇరు పార్టీలు తమ శాయశక్తుల ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకే ఇరు పార్టీలు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.

 Also Read: Shadnagar Road Accident: షాద్ నగర్‌ లోఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి కూతురు స్పాట్ డెడ్!

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!