Vivek Venkatswamy: గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
Vivek Venkatswamy ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Vivek Venkatswamy: గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం : మంత్రి వివేక్ వెంకటస్వామి!

Vivek Venkatswamy: నియోజకవర్గంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సర్పంచులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ బలాన్ని మరోసారి చాటింది. జిల్లా ఇన్చార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరై, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి సర్పంచులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే శక్తి కాంగ్రెస్‌కే ఉందని స్పష్టం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యంతో గ్రామాలు వెనుకబడ్డాయని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల ముఖచిత్రమే మారుతోందని అన్నారు.

Also Read: Vivek Venkatswamy: బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి వివేక్

50 వేల టీచర్ పోస్టులను భర్తీ

గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు విద్య అత్యంత కీలకమని, చదువు ద్వారానే మంచి ఆలోచనలు, సామాజిక చైతన్యం వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 50 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేశామని గుర్తు చేశారు.అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని, గృహ జ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్‌ను కోట్లాది కుటుంబాలకు అందిస్తున్నామని తెలిపారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ల మంజూరుకు కూడా ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.

మరో 3,500 ఇండ్లను మంజూరు

ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు వేగంగా ప్రారంభమై పూర్తయ్యేలా సర్పంచులు ముందుండాలని పిలుపునిచ్చారు. వచ్చే సంవత్సరం దుబ్బాక నియోజకవర్గానికి మరో 3,500 ఇండ్లను మంజూరు చేస్తామని, పేదల సొంతింటి కలను సాకారం చేస్తామని హామీ ఇచ్చారు.ఇన్చార్జ్ మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధి తన బాధ్యతని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం ప్రజల సమస్యలకు పరిష్కారం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని, ప్రజలే కాంగ్రెస్‌కు బలం అని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: Google: ఆండ్రాయిడ్ కంటే ఐఫోన్ వాడేవారికే ఎక్కువ స్కామ్‌లు.. గూగుల్ సంచలన కామెంట్స్

Just In

01

Thummala Nageswara Rao: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Chinmayi Sripada: నీ కొడుకులకు కూడా.. మరోసారి శివాజీకి ఇచ్చిపడేసిన చిన్మయి!

Sudheer Babu: మైనర్లకు మందు అమ్మినా… సరఫరా చేసినా కఠిన చర్యలు : రాచకొండ సీపీ సుధీర్​ బాబు

Ranga Reddy District: పట్టా భూములను కబ్జా చేస్తున్న బిల్డర్లు.. కోర్టు కేసులను లెక్కచేయకుండా బరితెగింపులు!

Singireddy Niranjan Reddy: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం 27 వేల ఎకరాలు భూసేకరణ చేశాం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి!