Google: గూగుల్ కొత్త నివేదికలో ఐఫోన్ కంటే ఆండ్రాయిడ్ ఫోన్‌లు స్కామ్‌లను అడ్డుకోవడంలో ముందంజలో ఉన్నారని తెలిపింది. ఇటీవలే కాలంలో సైబర్ మోసాలు ఎక్కువవుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని వినియోగదారుల భద్రత చాలా కీలకం అవుతోంది. అయితే, ఈ విషయంలో గూగుల్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
స్కామ్‌ల నుండి రక్షించడంలో ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఐఫోన్‌ల కంటే మెరుగ్గా పనిచేస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ నెల ముగింపు సందర్భంగా గూగుల్ ఓ నివేదికను రిలీజ్ చేసింది. దీని ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత భద్రతా సిస్టమ్స్ ఆండ్రాయిడ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. AI వల్ల బిలియన్ల స్కామ్ కాల్స్, మెసేజ్‌లు బ్లాక్ అవుతున్నాయి. గూగుల్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రతి నెలా 10 బిలియన్లకు పైగా అనుమానాస్పద స్కామ్ కాల్స్ , మెసేజ్‌లు ఆండ్రాయిడ్ AI సిస్టమ్ ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తోంది. అలాగే RCS (Rich Communication Services) ద్వారా కూడా అదనపు భద్రతా తనిఖీలు జరుగుతున్నాయి. గత నెలలోనే దాదాపు 100 మిలియన్ల నంబర్లు బ్లాక్ చేసినట్లు సంస్థ తెలిపింది.
Also Read: IND vs AUS 2nd T20I: అభిషేక్ ఒంటరి పోరాటం.. చేతులెత్తేసిన మిగతా బ్యాటర్లు.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?
ప్రపంచవ్యాప్తంగా భారీ నష్టాలు .. AI ద్వారా నమ్మకమైన స్కామ్‌లు
గత 12 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా $400 బిలియన్లకు పైగా నష్టాలు స్కామ్‌ల వల్ల సంభవించాయని గూగుల్ వెల్లడించింది. ఇప్పుడు మోసగాళ్లు కూడా AI టెక్నాలజీని వాడి నకిలీ కాల్స్, మెసేజ్‌లను నిజమైనట్టుగా కనిపించేలా రూపొందిస్తున్నారు. అందుకే గూగుల్ తమ సిస్టమ్స్‌ను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దిందని తెలిపింది.
సర్వేలో బయటపడిన ఆసక్తికర విషయాలు
Google ఆదేశించిన YouGov సర్వేలో భారత్, అమెరికా, బ్రెజిల్ దేశాల వినియోగదారులను ప్రశ్నించారు?
1. ఆండ్రాయిడ్ యూజర్లు తక్కువ స్కామ్ మెసేజ్‌లు అందుకున్నారని వెల్లడైంది.
2. పిక్సెల్ ఫోన్ వినియోగదారులు అతి తక్కువ స్కామ్ టెక్స్ట్‌లు చూసినట్టు వెల్లడించారు.
3. ఐఫోన్ యూజర్లు పిక్సెల్ యూజర్ల కంటే 136% ఎక్కువగా స్కామ్ మెసేజ్‌లు పొందారని గణాంకాలు చూపిస్తున్నాయి.
గూగుల్ లక్ష్యం
వినియోగదారులు తమ ఫోన్‌లను వాడేటప్పుడు భయపడకుండా, ఫ్రీగా వాడగలిగేలా చేయడం. ఎందుకంటే AI ఎప్పుడూ వారి రక్షణలో ఉంటుంది అని గూగుల్ స్పష్టం చేసింది. గూగుల్ ఈ నివేదికతో స్పష్టం చేసిన విషయం ఏంటంటే భవిష్యత్తు స్మార్ట్‌ఫోన్ భద్రత AI చేతుల్లోనే ఉంది. కానీ అదే సమయంలో, మోసగాళ్ల చేతుల్లో AI పడితే.. వినియోగదారులే ప్రమాదంలో పడతారని తెలిపింది.

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				