Warangal District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Warangal District: సైకిల్‌ రైడర్స్‌ను ఉత్సాహ పరిచిన కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్

Warangal District: హనుమకొండలో ఉదయం పుల్ జోష్ గా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. స్వయంగా సైకిల్ తొక్కి వరంగల్ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్(Commissioner Sunpreet Singh) సైకిల్‌ రైడర్స్‌లో ఉత్సాహం నింపారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సైకిల్‌ ర్యాలీలో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ తో పాటు, యువత, విద్యార్థులు, చిన్నారులు, వృద్దులు, పోలీసులు ఉత్సహంగా పాల్గోన్నారు. ఈ సైకిల్ ర్యాలీలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి, ఎన్.డి.పి సి.ఎల్ సియండి వరుణ్ రెడ్డి(Varun Reddy), ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్(Ankith Kumar) పాల్గొన్న ఈ ర్యాలీని అదనపు డిసిపిలు రవి, సురేష్ కుమార్ పచ్చా జెండా ఉపి ఈ సైకిల్‌ ర్యాలీని ప్రారంభించారు.

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌..

పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయము నుండి అంబేద్కర్ సెంటర్, ఆదాలత్ సెంటర్, హన్మకొండ(Hanumakonda) కలెక్టర్ కార్యాలయం నుండి తిరిగి ఇదే మార్గం నుండి నక్కలగుట్ట మీదగా పొలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయమునకు చేరుకున్నారు. ఈ ర్యాలీ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సైకిలింగ్‌ రైడర్స్‌తో కలిసి పోలీస్‌ అమర వీరులకు జోహర్లు నినాదాలు చేస్తు రైడర్స్‌ ను ఉత్సహపర్చారు. అనంతరం ఈ సైకిల్‌ ర్యాలీ పాల్గోన్న సైకిల్‌ రైడర్లకు పోలీస్‌ అధికారుల చేతుల మీదుగా సర్టిఫికేట్లను ప్రధానం చేసారు.

Also Read: CM Revanth Reddy: రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం వార్నింగ్..!

అమరవీరులను స్మరిస్తూ..

ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ప్రతి రోజు సైకిలింగ్‌ చేయడం ద్వారా మరింత ఆరోగ్యంగా వుండటంతో పాటు, రోజంతా ఉత్సహంగా తమ విధుల్లో రాణించవచ్చని, ప్రతి ఒక్కరు సైకిలింగ్‌ కోసం కొద్ది సమయాన్ని కేటాయించడం ద్వారా అనారోగ్య సమస్యలు దూరం కావవ్చని, అలాగే పోలీస్‌ అమరవీరులను స్మరిస్తూ నిర్వహించిన ఈ ర్యాలీలో పాల్గోన్న ప్రతి ఒక్కరికి పోలీస్‌ అమరవీరుల కుటుంబాలతో పాటు, పోలీసుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ కమిషనర్, ఎన్.డి.పి సి.ఎల్ సి యం డి మాట్లాడుతూ నిత్యం సైకిలింగ్ చేయడం మన ఆరోగ్యాన్ని పరి రక్షించుకోవచ్చని,సైకిలింగ్ చేయడం రోజు వారి అలవాటుగా మార్చు కోవాలని తెలిపారు. ఈ ర్యాలీలో అదనపు డిసిపి లు, శ్రీనివాస్, ప్రభాకర్, బాలస్వామి, ఏ ఎస్పీ శుభం, ఏసిపిలు జితేందర్ రెడ్డి, నర్సింహా రావు, అనంతయ్య, నాగయ్య, సత్యనారాయణ, ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్‌.ఐలు, ఏ.జే పెడల్స్‌ యాజమాన్యం, ట్రైసిటి సైకిల్‌ రైడర్స్‌, పబ్లిక్‌ గార్డెన్స్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు, నిట్‌ కళాశాల విద్యార్థులతో పాటు ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గోన్నారు.

Also Read: Adluri Laxman Kumar: గిరిజన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

Just In

01

Government Lands: త్వరలో ప్రభుత్వానికి అందనున్న నిషేధిత భూముల జాబితా..!

Jubilee Hills Bypoll: మీకు అభివృద్ధి కావాలా.. అబద్ధాలు కావాలా.. జూబ్లీహిల్స్ ఓటర్లకు పొన్నం అల్టిమేటం!

Gadwal District: సెటిల్మెంట్లు అక్రమ వసూళ్లకు కేరాఫ్‌గా కేటిదొడ్డి పోలీస్ స్టేషన్.. ఎక్కడంటే..!

Kiran Kumar Reddy: కేటీఆర్ కొత్త ఆటో అవతారం ఎత్తాడు: చామల కిరణ్ కుమార్ రెడ్డి

IND vs AUS 1st T20: ఆసీస్‌తో ఫస్ట్ టీ20.. టాస్ పడిందోచ్.. బ్యాటింగ్ ఎవరిదంటే?