Collector Rizwan Basha: అన్నా.. పంటకు నష్టం వచ్చిందా.. ఎంత వచ్చిందే.. పెట్టిన పెట్టుబడి ఎంత.. దిగుబడి ఎంతోచ్చింది.. ఎంత నష్టం వచ్చింది.. అయ్యా సారు.. పత్తి పంట ఏసినం.. ఏమి లాభం లేదు.. ఏరుదామంటే వానలే వానలు వచ్చాయి.. ఎండలు వస్తే ఎరుదామనుకున్నాం.. ఇంతలోపే ఇంత పెద్ద వానొచ్చింది.. వాన వొచ్చింది.. పత్తిపంటంతా నేలరాలింది.. అంతా నల్లగా మారింది.. ఎకరాకు అందాజ ముప్పైవేల దాకా పెట్టామయ్యా.. చేతికొచ్చే ముందట గిట్ల అయ్యింది. ఇప్పుడు చేసిన అప్పులు తీరేదెట్టా.. ఇల్లు గడిసేదెట్టా.. ఏమి చేయాలో దిక్కు తోస్తలేదయ్యా.. ఏమన్నా సర్కారు సాయం చేస్తే మా ఇల్లు గడుత్తది అయ్యా.. మీరేమన్నా దారి చూపియ్యాలే.. లేకుంటే మాకు పస్తులే.. అప్పులోల్లతోని తిప్పలే అయ్యా అంటూ తమ గోడును రైతు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్‌కు వినిపించాడు. ఇది జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం వనపర్తిలో చోటు చేసుకున్నది.
Also Read: Mass Jathara Review: రవితేజ ‘మాస్ జాతర’ ప్రేక్షకులను మెప్పించిందా?
జిల్లా వ్యాప్తంగా మొంథా తుపాన్‌తో..
నేడు కలెక్టర్ నేరుగా పంట పొలాలు, చేలల్లోకి వెళ్ళి పంటలను పరిశీలించారు. నల్లగా మారిన పత్తిని చూసి ఛలించిపోయారు. చేనులో ఇసుక మేటలు వేయడంతో కలత చెందారు. రైతులను ఓదార్చారు. దైర్యం నూరిపోసారు. దిగులు చెందవద్దు.. సర్కారు అండగా ఉంటది అని భరోసా ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా మొంథా తుపాన్‌తో నష్టపోయిన పంటలను నేరుగా అధికారులు పరిశీలిస్తారని అన్నారు. పరిహారం విషయంలో సర్కారుకు నివేధికలు ఇస్తామన్నారు. రైతులు దిగులు చెందవద్దని సూచించారు. సర్కారు సాయం చేసేలా అధికారులతో మాట్లాడుతానని రైతులకు చెప్పారు. నేరుగా కలెక్టర్ రంగంలోకి దిగడంతో రైతులు కొంత గుండె నిబ్బరం చేసుకున్నారు. కలెక్టర్ వ్యవసాయాధికారులను దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించాలని ఆదేశించారు.
Also Read: Hyderabad Metro: హైదరాబాదీలకు మెట్రో రైల్ బ్యాడ్‌న్యూస్.. సోమవారం నుంచే అమలు
