సినిమా వివరాలు
సినిమా పేరు: మాస్ జాతర
దర్శకుడు: భాను భోగవరపు
నటులు: రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, మురళి శర్మ, వీటీవీ గణేష్, హైపర్ ఆది, అజయ్ ఘోష్ మొదలైనవారు.
సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరిలియో
సినిమాటోగ్రఫీ: విధు అయ్యన్న
నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్).
Mass Jathara Review: రవితేజ కెరీర్‌లో 75వ సినిమాగా ‘మాస్ జాతర’ తెరకెక్కింది. తన కెరీర్‌లో మైలురాయిగా నిలవాలనే లక్ష్యంతో కొత్త దర్శకుడు భాను భోగవరపును ఎంచుకున్నాడు రవితేజ. ధమాకా తర్వాత రవితేజ, శ్రీలీల జోడీ మళ్లీ కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కానీ, ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే ఉంది. మాస్ మసాలా, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం రవితేజ మార్క్ ఎంటర్‌టైనర్‌గా ఉంది.
Read also-Baahubali The Epic: ‘బాహుబలి ది ఎపిక్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా.. ఆ రికార్డులు బ్రేక్..
కథ సారాంశం
వరంగల్‌లో రైల్వే సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే లక్ష్మణ్ భేరి (రవితేజ) ఓ కారణంతో ఉత్తరాంధ్రలోని అడవివరం అనే గ్రామానికి ట్రాన్స్‌ఫర్ అవుతాడు. అక్కడ గంజాయి మాఫియా దందా విపరీతంగా సాగుతుంటుంది. శివుడు (నవీన్ చంద్ర) అనే క్రూర విలన్ కంట్రోల్‌లో ఉన్న ఈ గ్రామంలో రైల్వే స్టేషన్ పరిధిలోనే నేరాలు జరగకుండా చూసుకోవాల్సి వస్తుంది లక్ష్మణ్‌కు. అదే సమయంలో తులసి (శ్రీలీల) అనే అమ్మాయిని ఇష్టపడతాడు. ఈ ప్రేమ, మాఫియా దందాల మధ్య లక్ష్మణ్ ఎలా పోరాడతాడు? రైల్వే పోలీసు అధికారి పరిధుల్లోనే మాఫియాను ఎలా అడ్డుకుంటాడు? అనేది కథా సారం. సింపుల్‌గా చెప్పాలంటే, ఒక పవర్‌ఫుల్ పోలీసు గంజాయి మాఫియా మధ్య జరిగే పోరాటం. రైల్వే పోలీసు పరిధులు, పవర్స్‌పై కొంచెం ఫోకస్ చేయడం కొత్త అంశం.
ఎవరు ఎలా చేశారంటే..
సినిమాలో రైల్వే సబ్-ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్ భేరి పాత్రలో రవితేజ్, తన సిగ్నేచర్ స్టైల్‌తోనే డామినేట్ చేశాడు. పోలీసు రోల్స్‌లో అతడు ఎప్పుడూ మాస్టర్, ఇక్కడ కూడా అదే. శ్రీకాకుళం, తెలంగాణ యాక్సెంట్‌ల మధ్య స్విచ్ చేస్తూ, డైలాగ్ డెలివరీలో సులభంగా మెరిశాడు. యాక్షన్ సీన్స్‌లో అతడి హై-వోల్టేజ్ ఎనర్జీ సినిమాను ఎలివేట్ చేసింది. హీరోయిన్ తులసి పాత్రలో శ్రీలీల, రొమాన్స్, ఎమోషనల్ ట్రాక్‌లకు పరిమితమైంది. రవితేజతో కెమిస్ట్రీ బాగా కుదిరింది. విలన్ శివుడు పాత్రలో నవీన్ చంద్ర, సినిమాలో బెస్ట్ పెర్ఫార్మర్‌గా నిలిచాడు. క్రూరత్వంలో కొత్త యాంగిల్ చూపించాడు. రాజేంద్ర ప్రసాద్ తన పాత్రలో కామెడా బలవంతంగా పండించినప్పటికీ అది అతికినట్లు అనిపించలేదు. రోతగా మారింది. హైపర్ ఆది తదితరుల కామిడీ కూడా ఎక్కడా నవ్వించలేక పోయింది. దర్శకుడు భాను యాక్షన్ సీన్స్‌లో మంచి గ్రిప్ చూపించాడు. మిడ్-ఇంటర్వల్ ఫైట్, క్లైమాక్స్ చేజ్ సీక్వెన్స్‌లు థ్రిల్లింగ్‌గా డైరెక్ట్ చేశాడు. విధు అయ్యన్న కెమెరా వర్క్‌తో కలిసి, ఈ సీన్స్ సినిమా హైలైట్స్ గా నిలిచాయి. మాస్ ఆడియన్స్‌కు ఈ పార్ట్ మాస్‌గా పండించాడు.
టెక్నికల్‌గా..
సంగీత దర్శకుడు భీమ్స్ అందించిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఎలివేట్ చేస్తుంది. విధు అయ్యన్న అందించిన సినిమాటోగ్రఫీ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అడవి, యాక్షన్ సీన్స్ కలర్‌ఫుల్ బాగా వచ్చాయి. నవీన్ నూలి ఎడిటింగ్ ఓకే అనిపించినా.. కానీ కొన్ని చోట్ల డ్రాగ్ అయినట్లు అనిపిస్తుంది. నందు రాసిన మాస్ ఎలివేషన్ డైలాగ్స్ సందర్భానికి తగ్గట్టుగా ఉన్నాయి.
Read also-Vishnu Priya: ఇప్పటికి మూడు సార్లు జరిగింది.. కిసిక్ టాక్స్‌లో ఆ నిజాలు బయట పెట్టిన విష్ణుప్రియ..
బలాలు
- రవితేజ్ పెర్ఫార్మెన్స్
- యాక్షన్ ఎపిసోడ్స్
- టెక్నికల్స్
బలహీనతలు
- కథ రొటీన్ మాస్ ఫార్ములా
- ఎమోషనల్ టచ్ వీక్ గా ఉంది.
రేటింగ్ – 2.5 / 5
