Vishnu Priya: తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో విష్ణుప్రియ అంటే తెలియని వారుండరు. తాజాగా సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిన బిగ్ టీవీ కిసిక్ టాక్ షోకి ఆమి అతిథిగా హజరయ్యారు. అందులో తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఎప్పుడూ హాట్ ఫోజులతో కుర్రకారును చిర్రెత్తించే లుక్ లో కనిపించే విష్ణుప్రియ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు అదిరిపోయే సమాధానం ఇచ్చారు. యాంకర్ ఈ మధ్య చాలా అందంగా తయారవుతున్నావు కారణం లవ్ లోపడటమేనా .. ఇప్పటివరకూ ఎంత మందిని పడేశావ్ ఏమిటి అని ప్రశ్నించారు. దానికి విష్ణు ప్రియ సమాధానం ఇస్తూ ఇప్పటివరకూ మూడు బ్రేకప్ లు అయ్యాయి. అంటూ బాధ పడుతూ సమాధానం ఇచ్చారు.
Read also-Allu Sirish engagement: అల్లు శిరీష్ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు వైరల్.. లైఫ్ “పార్టనర్” ను చూశారా..
అంతే కాకుండా తన అంతరంగం గురించి చెబుతూ ఓ సందర్భంలో ఎమోషనల్ అయ్యారు. అది ఏంటంటే.. బిగ్ బాస్ నుంచి వచ్చిన సందర్భంలో కొంత మంది నా మార్పింగ్ ఫోటోలతో వీడియోలు క్రియేట్ చేసి తెగ వైరల్ చేశారు. అప్పుడు అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆ సందర్భంలో సూసైడ్ చేసుకుని చచ్చి పోదామనుకున్నా.. కానీ మా అమ్మవల్ల నేనే మళ్లీ ఇప్పుడ మీ ముందు ఇలా ఉన్నా’ అంటూ ఎమోషనల్ అయ్యారు. తర్వాత మీకు కాబోయే రాజకుమారుడు ఎలా ఉండాలి అని అడగ్గా.. బేలన్స్డ్ పర్సన్ అయితే బాగుంటుంది. అని అన్నారు. దానికి యాంకర్ పృధ్వీ లాంటి వాడా అని చెప్పడా ఎందుకు కాకూడదు అని సమాధానం ఇచ్చారు.
Read also-Peter movie teaser: ‘పీటర్’ మూవీ టీజర్ మరీ ఇంత థ్రిల్లింగ్ గా ఉందేంటి..
