alluserish ( imahe :X)
ఎంటర్‌టైన్మెంట్

Allu Sirish engagement: అల్లు శిరీష్ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు వైరల్.. లైఫ్ “పార్టనర్” ను చూశారా..

Allu Sirish engagement: తెలుగు సినీ కుటుంబంలో మరో శుభకార్యం జరిగింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, యువ హీరోగా పేరొందిన అల్లు శిరీష్ తన ప్రేయసి నయనికతో గ్రాండ్‌గా నిశ్చితార్థం జరిగింది.​  అల్లు కుటుంబం ఇప్పటికే టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు పొందింది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. శిరీష్ – నయనిక ప్రేమకథ ఇప్పటివరకు బయటికి రాలేదు. ఇటీవలే శిరీష్ తన సోషల్ మీడియా ద్వారా ‘ప్రేమించుకుని పెళ్లి చేసుకోబోతున్నా’ అని వెల్లడించాడు. అయితే నయనిక వివరాలపై కొంత గోప్యత కొనసాగిస్తూ, ఆమె ఫోటోలు, పేరే మాత్రమే బయటపడ్డాయి. దీపావళి వేడుకల్లో అల్లు కుటుంబ ఫోటోలు లీక్ కాగానే నయనిక కూడా వారిలో ఉన్నట్లు స్పష్టమైంది.​ నిశ్చితార్థ వేడుకకు అల్లు కుటుంబ సభ్యులు, టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. అల్లు అర్జున్, చిరంజీవి , రామ్ చరణ్ వంటి అతిథులు ఈ వేడుకకు హాజరయ్యారు. సంప్రదాయ దుస్తుల్లో శిరీష్, నయనిక మెరిసిపోయారు.​

Read also-Sandigdham teaser: ‘సందిగ్ధం’ టీజర్ వచ్చేసింది గురూ.. ఓ లుక్కేసుకో మరి..

దీంతో అల్లు ఫ్యామిలీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో నిశ్చితార్థం ఫోటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. అభిమానులకు ఇది మరొక ఉత్సవంలా ఉంది.​ అల్లు శిరీష్, నయనిక నిశ్చితార్థం తెలుగు సినీ కుటుంబాల్లో ఆనందంగా, భార్యాభర్తగా కొత్త జీవితానికి శ్రీకారం చుట్టిన ఆత్మీయ వేడుకగా నిలిచింది. సినిమా అభిమానులు, టాలీవుడ్ సెలబ్రిటీలు శిరీష్ కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.​

Just In

01

Vishnu Priya: ఇప్పటికి మూడు సార్లు జరిగింది.. కిసిక్ టాక్స్‌లో ఆ నిజాలు బయట పెట్టిన విష్ణుప్రియ..

MLAs Defection: ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణలో కీలక పరిణామం.. సుప్రీంకోర్టుని గడువు కోరిన స్పీకర్

Congress Politics: రాజగోపాల్ రెడ్డిని ఎలా కూల్ చేస్తారు?.. కాంగ్రెస్‌లో ఇంటర్నల్ పాలిటిక్స్ మళ్లీ మొదలు?

Kishan Reddy: సింగరేణికి సర్కార్ రూ.42 కోట్లు పెండింగ్.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

JubileeHills Bypoll: బిల్లా రంగాలు ఇటొస్తే స్తంభానికి కట్టేయిర్రి.. కేటీఆర్‌పై సీఎం రేవంత్ పంచ్‌ల మీద పంచులు