sandhigham( image:X)
ఎంటర్‌టైన్మెంట్

Sandigdham teaser: ‘సందిగ్ధం’ టీజర్ వచ్చేసింది గురూ.. ఓ లుక్కేసుకో మరి..

Sandigdham teaser: సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లో తీర్థ క్రియేషన్స్ బ్యానర్ మీద సంధ్య తిరువీధుల నిర్మాతగా పార్ద సారథి కొమ్మోజు తెరకెక్కించిన చిత్రం ‘సందిగ్ధం’. ఈ చిత్రంలో నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ దేవ్, కాజల్ తివారి, జీవ కోచెర్ల, నవీన్ రాజ్, చిట్టిబాబు, ఆనంద్ భారతి, రైజింగ్ రాజు, అప్పారావు, నాగి వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ క్రమంలో ‘సందిగ్ధం’ టీజర్‌ను నటుడు, నిర్మాత అశోక్ కుమార్ శుక్రవారం నాడు రిలీజ్ చేశారు. ‘సందిగ్ధం’ టీజర్ గమనిస్తే.. ఓ ఊరు, అందులో జరిగే వింత ఘటనలు, ప్రేమ కథ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఇందులో చూపించిన విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ ఎంతో సహజంగా కనిపిస్తున్నాయి. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌కి సరిపోయే మంచి ఆర్ఆర్ కూడా ఉంది. టీజర్‌తో సినిమా మీద మంచి బజ్‌ను అయితే క్రియేట్ చేశారు.

Read also-OG Let’s Go Johnny song: ‘ఓజీ’ సినిమా నుంచి ‘లెట్స్ గో జానీ’ వీడియో సాంగ్ వచ్చేసింది.. చూసేయండి మరి

టీజర్ లాంఛ్ అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో.. నటుడు, నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ .. ‘ప్రస్తుతం ఓ సినిమా సక్సెస్ అవ్వడం చాలా కష్టంగా మారిందన్నారు. ‘సందిగ్ధం’ టీజర్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చే చిన్న చిత్రాలు కూడా పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. భార్యభర్తలైన సంధ్య, పార్దు కష్టపడి తీసిన ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను. దర్శక, నిర్మాతలు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి.’ అని అన్నారు. హీరో నిహాల్ మాట్లాడుతూ .. ‘పార్ద సారథి గారు వల్లే నేను ఈ మూవీలోకి వచ్చాను. పార్దు గారు, సంధ్య గారు ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించారు.’ అని అన్నారు.

Read also-Mega concert 2025: ఏఆర్ రెహమాన్ మెగా కాన్సర్ట్ డేట్ ఫిక్స్.. పెద్ది సాంగ్ వచ్చేది అప్పుడేనా?..

హీరో అర్జున్ దేవ్ మాట్లాడుతూ .. ‘పార్దు గారు, సంధ్య గారు ‘సందిగ్ధం’ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. మా కోసం వచ్చిన అశోక్ కుమార్ గారికి థాంక్స్. సినిమాను చూసి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. దర్శకుడు పార్ద సారథి మాట్లాడుతూ .. ‘‘సందిగ్ధం’ విషయంలో ప్రతీ ఒక్క ఆర్టిస్ట్, టెక్నీషియన్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇలాంటి కథ ఇంత వరకు రాలేదని చెప్పొచ్చు. ఆద్యంతం ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఈ ప్రయాణంలో నాకు వెన్నంటే ఉండి నా భార్య సంధ్య తోడుగా నిలిచారు. నన్ను దర్శకుడిగా చేయాలని ఎంతో కష్టపడి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని అందరూ చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. కొత్త వాళ్లను మీడియా సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Just In

01

Vishnu Priya: ఇప్పటికి మూడు సార్లు జరిగింది.. కిసిక్ టాక్స్‌లో ఆ నిజాలు బయట పెట్టిన విష్ణుప్రియ..

MLAs Defection: ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణలో కీలక పరిణామం.. సుప్రీంకోర్టుని గడువు కోరిన స్పీకర్

Congress Politics: రాజగోపాల్ రెడ్డిని ఎలా కూల్ చేస్తారు?.. కాంగ్రెస్‌లో ఇంటర్నల్ పాలిటిక్స్ మళ్లీ మొదలు?

Kishan Reddy: సింగరేణికి సర్కార్ రూ.42 కోట్లు పెండింగ్.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

JubileeHills Bypoll: బిల్లా రంగాలు ఇటొస్తే స్తంభానికి కట్టేయిర్రి.. కేటీఆర్‌పై సీఎం రేవంత్ పంచ్‌ల మీద పంచులు