Adwait Kumar Singh (image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Adwait Kumar Singh: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్

Adwait Kumar Singh: ప్రత్యేక అధికారులు అన్ని వసతి గృహాలను తనిఖీ తనిఖీ చేయాలని, ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ (Adwait Kumar Singh) ఆదేశించారు.  కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో, (రెవెన్యూ) కె.అనిల్ కుమార్ లతో కలిసి ఆయన ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సంక్షేమ వసతి గృహాలలో ప్రత్యేక అధికారులు తనిఖీ నిర్వహించి, పరిసరాలను పరిశీలించి, పిల్లలతో కలిసి భోజనం చేసి, వసతి గృహాలలో ప్రస్తుత పరిస్థితులను గమనించాలని ఆయన ఆదేశించారు. 

 Also Read: Adwait Kumar Singh: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి.. జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ కీలక అదేశాలు

ప్రణాళికతో ముందుకు సాగాలి

ప్రత్యేక అధికారులు పర్యటన కార్యక్రమంలో పక్కాగా వసతి గృహాల నిర్వహణ తనిఖీలు చేసి నివేదికను సమర్పించాలని అన్నారు. విద్యార్థిని, విద్యార్థులకు డైట్ మెనూ ప్రకారం రుచికరమైన ఆహారాన్ని అందించాలని, సబ్జెక్టుల వారిగా విద్యాబోధనలో అందించి ఉత్తమ ఫలితాలు వచ్చే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.షెడ్యూలు ప్రకారం నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించే ఈ విధంగా వసతి గృహాల ప్రిన్సిపల్లను, వార్డెన్లు, టీచర్లను ఆదేశించాలని ఆయన సూచించారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులలో మరిపెడ మండలం ఎడ్జెర్ల గ్రామానికి చెందిన ఎస్. నారాయణ ఎడ్జెర్ల గ్రామంలోని మండల ప్రజపరిషత్ ప్రాథమికోన్నత పాటశాలలో వివిధ పనులకు సంబందించిన పనులకు గాను ఎటువంటి మినహాయింపు లేకుండా బిల్లులను ఇప్పించగలరని కోరారు.

దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలి 

బెస్ట్ అవేలబుల్ స్కీం ద్వారా అడ్మిషన్ పొందిన జిల్లాకు చెందిన విద్యార్థుల తల్లి తండ్రులు తమ పిల్లలు ఈ స్కీం ద్వారా అడ్మిషన్ పొంది వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారని, మా పిల్లల యొక్క ఫీజులు ప్రభుత్వం ద్వారా సకాలంలో చెల్లింపు జరగకపోవడం వలన విద్యార్థులను ప్రైవేటు పాటశాలల యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తున్నారని, నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామానికి చెందిన ఆమంచి లక్ష్మి తనకు ఇందిరమ్మ కమిటీ తీర్మానం ద్వారా ఇందిరమ్మ ఇంటికి ఎంపిక అయ్యాయని దయతో అధికారులు ఇందిరమ్మ ఇంటికి సంబందించిన ఉత్తర్వులను ఇప్పించగలరని కోరారు. వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజావాణిలో ప్రజలు చేసుకున్న (46) దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో సంబంధిత విభాగానికి పంపి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రజావాణి కార్యక్రమం

ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డిసిఓ వెంకటేశ్వర్లు, డిపిఓ హరిప్రసాద్, పశు వైద్య అధికారి డాక్టర్ కిరణ్ కుమార్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి దేశీ రామ్ నాయక్, వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల, గ్రౌండ్ వాటర్ అధికారి వేముల సురేష్, డీఎం సివిల్ సప్లై కృష్ణవేణి, సర్వే ల్యాండ్ అధికారి నరసింహమూర్తి, వెల్ఫేర్ అధికారిని సబిత, ఎస్సీ, బిసి వెల్ఫేర్ అధికారులు శ్రీనివాసరావు, శ్రీనివాస్, జిఎం ఇండస్ట్రీస్ శ్రీమన్నారాయణ రెడ్డి, లిడ్ బ్యాంక్ మేనేజర్ యాదగిరి, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, పర్యవేక్షకులు రాఘవరెడ్డి, వినోద్, జిల్లాలోని మున్సిపల్ కార్యాలయల మేనేజర్లు, డిప్యూటీ తహసిల్దార్లు, అన్ని విభాగాల సిబ్బంది ఈ ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు.

 Also ReadAdwait Kumar Singh: రోగులకు మెరుగైన వైద్యం అందించాలి.. జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ కీలక అదేశాలు

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?