Ponguleti Srinivasa Reddy: ఆ తేదిన పాలేరుకు సీఎం రేవంత్ రెడ్డి
Ponguleti Srinivasa Reddy ( image credit: swetcha reporter)
Political News, నార్త్ తెలంగాణ

Ponguleti Srinivasa Reddy: ఆ తేదిన పాలేరుకు సీఎం రేవంత్ రెడ్డి .. రూ. 362 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం!

Ponguleti Srinivasa Reddy:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత ఉమ్మడి జిల్లాల పర్యటనలో భాగంగా ఈ నెల 18న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy)  వెల్లడించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పర్యటనలో భాగంగా మొత్తం రూ. 362 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు.

పాలేరు గడ్డపై అభివృద్ధి పండుగ

మద్దులపల్లిలో జేఎన్టీయూ కళాశాలకు శంకుస్థాపన, నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం చేయడంతో పాటు మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ నిర్మాణ పనులను సీఎం ప్రారంభిస్తారు. అదేవిధంగా మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ ను ప్రారంభిస్తారు. అలాగే కూసుమంచిలో నిర్మించిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొంటారని వివరించారు. ఇదే వేదికగా రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల సన్నద్ధతపై ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తలతో సీఎం దిశానిర్దేశం చేయనున్నారని పొంగులేటి తెలిపారు.

Also Read: Ponguleti Srinivasa Reddy: గాంధీజీ పేరు తీసేస్తే చరిత్ర మారుతుందా?.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి!

తొలిసారిగా హైదరాబాద్ వెలుపల క్యాబినెట్ భేటీ

రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా ఈ నెల 18న మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (క్యాబినెట్ మీటింగ్) నిర్వహించనున్నట్లు పొంగులేటి ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వెలుపల క్యాబినెట్ భేటీ జరగడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలా ఎన్నికల వేళ బొమ్మలు చూపడం మా అలవాటు కాదు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పనిచేసే ప్రభుత్వమిది” అని స్పష్టం చేశారు.

కుంభమేళాకు మించి మేడారం ఏర్పాట్లు

సమ్మక్క-సారలమ్మ జాతరను కుంభమేళా కంటే అద్భుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తెలిపారు. మేడారంలో కాకతీయుల నాటి వైభవం ఉట్టిపడేలా నిర్మించిన రాతి కట్టడాలను 19వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు. అలాగే గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత ఉమ్మడి జిల్లాల పర్యటనలో భాగంగా ఈ నెల 18న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పర్యటనలో భాగంగా మొత్తం రూ. 362 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు.

Also Read: Ponguleti Srinivasa Reddy: హౌసింగ్ బోర్డు భూముల ప‌రిర‌క్షణ‌కు ప‌టిష్ట చ‌ర్యలు తీసుకోవాలి : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి!

పాలేరు గడ్డపై అభివృద్ధి పండుగ

మద్దులపల్లిలో జేఎన్టీయూ కళాశాలకు శంకుస్థాపన, నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం చేయడంతో పాటు యమున్నేరు-పాలేరు లింక్ కెనాల్ నిర్మాణ పనులను సీఎం ప్రారంభిస్తారు. అదేవిధంగా మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ ను ప్రారంభిస్తారు. అలాగే కూసుమంచిలో నిర్మించిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొంటారని వివరించారు. ఇదే వేదికగా రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల సన్నద్ధతపై ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తలతో సీఎం దిశానిర్దేశం చేయనున్నారని పొంగులేటి తెలిపారు.

తొలిసారిగా హైదరాబాద్ వెలుపల క్యాబినెట్ భేటీ

రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా ఈ నెల 18న మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (క్యాబినెట్ మీటింగ్) నిర్వహించనున్నట్లు పొంగులేటి ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వెలుపల క్యాబినెట్ భేటీ జరగడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. “గత ప్రభుత్వంలా ఎన్నికల వేళ బొమ్మలు చూపడం మా అలవాటు కాదు.. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పనిచేసే ప్రభుత్వమిది” అని స్పష్టం చేశారు.

కుంభమేళాకు మించి మేడారం ఏర్పాట్లు

సమ్మక్క-సారలమ్మ జాతరను కుంభమేళా కంటే అద్భుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తెలిపారు. మేడారంలో కాకతీయుల నాటి వైభవం ఉట్టిపడేలా నిర్మించిన రాతి కట్టడాలను 19వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు. అలాగే గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

Also Read: Ponguleti Srinivasa Reddy: గాంధీజీ పేరు తీసేస్తే చరిత్ర మారుతుందా?.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి!

Just In

01

MLA Vijayudu: ప్రజాపాలన కాదు.. ప్రజలను పీడించే పాలన.. ఆ మాజీ ఎమ్మెల్యే ఆధారాలు బయటపెడతా.. బీఆర్ఎస్ నేత కీలక వ్యాఖ్యలు!

Mahesh Incident: అక్కడ మహేష్ బాబును కూడా వదలని ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

Spirit Release Date: ప్రభాస్, సందీప్ వంగా ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

Netflix Telugu: ఈ ఏడాది ‘నెట్‌ఫ్లిక్స్‌’లో విడుదల కానున్న బిగ్ బడ్జెట్ చిత్రాలు ఇవే.. ఓ లుక్కేయండి

Tiger Of Martial Arts: పవన్ కళ్యాణ్, విద్యుత్ జమ్వాల్ మధ్య ఆసక్తికర సంభాషణ!