Closed Schools (imagecredit:twitter)
నార్త్ తెలంగాణ

Closed Schools: మూసివేసిన బడులతో గిరిజనులకు అన్యాయం.. మామిడాల సత్యనారాయణ!

Closed Schools: మహబూబాబాద్ జిల్లాలో 2024 -25 విద్యా సంవత్సరంలో విద్యార్థులు నమోదు కాలేదనే కారణంగా 167 పాఠశాలను మూసివేశారు. ఇందులోగిరిజన తండాలు, కోయ గుంపులలోనే 140 పాఠశాలలు ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా పూర్తిగా గిరిజన జనాభా అధికంగా గల జిల్లా. ఈ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో నలుగురు గిరిజన శాసనసభ సభ్యులు ఉన్నారు. అయినప్పటికీ గిరిజన తండాలు, కోయగుంపులలోని పాఠశాలలే మూతపడటం శోచనీయంగా మారింది. ఐదు నియోజకవర్గాల శాసనసభ సభ్యులు తమ నియోజకవర్గంలోని ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత విద్యాసంస్థల వరకు విద్యాస్థితి గతులను సమీక్ష చేయకపోవడం వల్లనే బడులు మూత పడ్డాయి.

మూతపడిన 167 పాఠశాలలు

నియోజక వర్గాలవారీగా మహబూబాబాద్ నియోజకవర్గం లోని ఐదు మండలాలలో 350 పాఠశాలలు ఉండగా 50 పాఠశాలలు మూతపడ్డాయి. డోర్నకల్ నియోజకవర్గంలో ఏడు మండలాల్లో 329 పాఠశాలలు ఉండగా 78 పాఠశాలలను మూసేశారు. పాలకుర్తి నియోజకవర్గంలోని (తొర్రూరు,పెద్దవంగర) లో 82 పాఠశాలలు ఉండగా 12 మూసివేశారు. ఇల్లెందు నియోజకవర్గంలో 136 పాఠశాలలు ఉంటే 12 పాఠశాలలు మూత పడ్డాయి. ములుగు నియోజకవర్గంలో 98 పాఠశాల ఉంటే 15 పాఠశాలలు మూత పడ్డాయి. మండలవారీగా పాఠశాలల సంఖ్య, మూతబడిన బడుల సంఖ్య వివరాలు, మహబూబాబాద్- (119)19, కేసముద్రం (65),8, గూడూరు (93),11, మరిపెడ (100),36, మరియు దంతాలపల్లితో పాటు ఇకొన్ని మండలాలో బడులు మూతపడ్డాయి.

Also Read: Ethanol Factory: ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను అడ్డగించిన రైతులు.. కార్లు ధ్వంసం!

తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ

ఈసారి బడి బాటలో మూసివేయబడిన 167 పాఠశాలల హాబిటేషన్స్ కు ఉపాధ్యాయులను బడి బాట కోసం డిప్యూటేషన్ చేస్తూ ఆయా పాఠశాలలో బడి ఈడు పిల్లలు ఉంటే తల్లిదండ్రులను ఒప్పించి వారి కోరిక మేరకు సౌకర్యాలు కల్పించి ఆ పాఠశాలలను తెరిపించాలని తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ మహబూబాద్ జిల్లా తరఫున జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా విద్యాశాఖ రవీందర్ రెడ్డి, వివిధ నియోజకవర్గాల శాసనసభ సభ్యులకు తీపి జెఎసి సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈసారి బడి బాటలో మూసేసిన బడులు తెరిపించే ప్రణాళిక చేయకపోతే భవిష్యత్తులో మరొక 300పైగా పాఠశాలలను మూసివేసే ప్రమాదం పొంచి ఉందని వివరిస్తున్నారు.

గిరిజనులలో అక్షరాస్యత తక్కువ

జిల్లా విద్యలో అభివృద్ధి కావాలంటే గిరిజనులలో ముఖ్యంగా ఇప్పటికే మహిళల అక్షరాస్యత తక్కువగా ఉందనే విషయం అందరికీ తెలుసు, కాబట్టి గిరిజన ప్రాంతాలలో మూసివేసిన బడులను జరిపించుటకు కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసి అమలుపరచాలని తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ మహబూబాబాద్ జిల్లా కన్వీనర్ మామిడాల సత్యనారాయణ, స్టేట్ కో కన్వీనర్ మైస శ్రీనివాసులు, జిల్లా ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read: Thug Life Twitter Review: కమల్ హాసన్ అన్ని చెప్పాడు.. టాక్ ఏంటి ఇలా ఉంది?

 

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?