Thug Life Pic
ఎంటర్‌టైన్మెంట్

Thug Life Twitter Review: కమల్ హాసన్ అన్ని చెప్పాడు.. టాక్ ఏంటి ఇలా ఉంది?

Thug Life Twitter Review: చాలా గ్యాప్ తర్వాత యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, తమిళ సంచలన దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘థగ్ లైఫ్’. దాదాపు 37 ఏళ్ల తర్వాత ఈ కాంబోలో రూపుదిద్దుకున్న ఈ సినిమా నేడు (జూన్ 5) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. విడుదలకు ముందు కమల్ హాసన్ చేసిన కొన్ని కామెంట్స్ కాంట్రవర్సీగా మారడంతో ‘కర్ణాటక’లో ఈ సినిమా బ్యాన్ చేసే పరిస్థితికి వెళ్లింది. మరోవైపు ఈ కాంట్రవర్సీనే ఈ సినిమాకు మంచి పబ్లిసిటీని కూడా తెచ్చిపెట్టడం విశేషం. అంతకు ముందు టీమ్ అంతా కలిసి ఎన్ని వేడుకలు నిర్వహించినా, ట్రైలర్ విడుదలైనా, ప్రీ రిలీజ్ వేడుకలు జరిగినా కూడా ‘థగ్ లైఫ్’ అంతగా వార్తలలో నిలవలేదు. ఎప్పుడైతే కర్ణాటకని ఉద్దేశిస్తూ.. కమల్ కామెంట్స్ చేశారో, అప్పటి నుంచి ఆ వివాదమే ఈ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లింది. గత వారం రోజులుగా ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలాంటి టాక్‌ని సొంతం చేసుకుందో.. ఇప్పటికే పడిన ప్రీమియర్స్ ద్వారా బయటికి వచ్చేసింది. సినిమా చూసిన వారంతా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. శింబు, అభిరామి, త్రిష వంటి వారు కీలక పాత్రలలో నటించిన ‘థగ్ లైఫ్’పై నెటిజన్లు ఇస్తున్న రివ్యూస్ ఎలా ఉన్నాయంటే..

Also Read- Janhvi Kapoor and Nani: ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’.. ఇద్దరూ ఏదో మెసేజ్ ఇస్తున్నారే!

సినిమా చాలా బాగుంది. నెగిటివ్ రివ్యూలను నమ్మకండి. అవి వేరే ప్రాంతాల నుండి డబ్బులు తీసుకున్న రివ్యూయర్స్ ఇస్తున్నారు. వెళ్లి మీ కుటుంబంతో కలిసి సినిమా చూడండి. థియేటర్లలో గూస్‌బంప్స్ వస్తాయి. కమల్ హాసన్ ఎప్పుడూ కింగే! అని నెటిజన్ పేర్కొన్నారు.

‘రెట్రో’ కంటే ‘కంగువ’ బెటర్.. ‘థగ్ లైఫ్’ కంటే ‘ఇండియన్ 2’ బెటర్ అని ఓ నెటిజన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

మణిరత్నం సార్ ఫిల్మ్ ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదని తెలుపుతూ.. ఓ నెటిజన్ 2.5 రేటింగ్ ఇచ్చిన రివ్యూని షేర్ చేశారు.

మణిరత్నం సర్ ఏమి చెప్పాలనుకున్నారో అర్థం కాలేదు. సినిమాలో ఎమోషన్, కొత్తదనం లేదు. BGM వర్కవుట్ కాలేదు. కమల్, శింబులను వాడుకోవడంలో పూర్తిగా ట్రాక్ తప్పారు. కథ రొటీన్, సినిమాలో ఏం లేదు. మణిరత్నం సార్ డిజప్పాయింట్ చేశారు.. అని ఓ నెటిజన్ తన రివ్యూని వ్యక్తం చేశారు.

ఓవరాల్‌గా అయితే.. ట్విట్టర్‌లో మిక్స్‌డ్ టాక్ నడుస్తుంది. కొంతమంది నెటిజన్లు సినిమా బాగుంది.. అంతా చూడవచ్చిన అంటుంటే.. సినిమాలో ఏం లేదు.. అనవసరంగా డబ్బులు వృథా చేయకండి. ఓటీటీలో త్వరగానే వచ్చేస్తుంది. అప్పుడు చూసుకోవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు సినిమా పరిస్థితి ఏంటనేది కాసేపట్లో పడే రివ్యూలతో తెలిసిపోనుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!