Janhvi Kapoor and Nani: ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) కల్ట్ క్లాసిక్ సినిమా. ఎంతో మందికి ఇష్టమైన సినిమా. మానవుడైన మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi), దేవత అయిన శ్రీదేవి (Sridevi) మధ్య లవ్ స్టోరీతో దర్శకేంద్రుడు క్రియేట్ చేసిన మాయాజాలం. అందుకే ఇప్పటికీ ఎంతో మందికి ఫేవరెట్ సినిమాగా చెప్పుకోబడుతుంది. ఈ సినిమాను ఈ మధ్య 4కె వెర్షన్‌లో, 3డి వెర్షన్‌లో ఛేంజ్ చేసి రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. థియేటర్లలో ఈ అద్భుతాన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. రీ రిలీజ్ తర్వాత మరోసారి ఈ సినిమా వార్తలలోకి వచ్చింది.. అందుకు కారణం బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్.. అలాగే నేచురల్ స్టార్ నానినే.
Also Read- Pottimama: ఏకంగా రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ పొట్టిమామ గురించి తెలుసా?
అదేంటి వారిద్దరి కారణంగా ఈ సినిమా ట్రెండ్ అవుతుండటం ఏంటి? ఇంతకీ వారిద్దరూ ఇస్తున్న మెసేజ్ ఏంటి? వారిద్దరే ఎందుకిలా ఈ సినిమా గురించి ప్రస్తావిస్తున్నారనే అనుమానాలు మొదలవుతున్నాయి కదా. అసలు విషయంలోకి వస్తే.. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రీ రిలీజ్ తర్వాత.. రెండు రోజుల క్రితం రీ రిలీజ్ ప్రింట్‌ని జాన్వీ కపూర్ చూసిందట. అంతే ఆ ట్రాన్స్‌లోకి వెళ్లిపోయింది. అప్పుడు శ్రీదేవి ధరించిన జాకెట్ ధరించి.. ఈ సినిమా గొప్పతనాన్ని మరోసారి సోషల్ మీడియా వేదికగా రివ్యూ ఇచ్చేసింది. మరీ ముఖ్యంగా శ్రీదేవి ధరించిన డ్రస్‌లో జాన్వీని చూడగానే అందరికీ శ్రీదేవే కనిపిస్తుండటం విశేషం.
ఇంతకీ జాన్వీ కపూర్ ఈ సినిమా గురించి ఏం రాసుకొచ్చిదంటే.. ‘‘నాకు ఈ జాకెట్ అంటే పిచ్చి. ఈ సినిమా అంటే ప్రాణం. రెండు రోజుల క్రితం రీ రిలీజ్ అయిన ప్రింట్‌ని మళ్లీ చూసే అవకాశం వరించింది. ఆ టీమ్ సృష్టించిన అద్భుతం మరోసారి నా కళ్ల ముందు మెదిలింది. మా అమ్మ శ్రీదేవి ఓ దేవకన్య. అద్భుతమైన యువరాణి. చాలా ముద్దుగా ఉంది. చిరంజీవి సార్ పండించిన హాస్యం, ధైర్యం, రాజసంతో పాటు వారిద్దరి మధ్య ప్రేమ అద్భుతం. రాఘవేంద్రరావు సార్ విజన్, అమ్రిష్ పూరి సర్, సంగీతం, సెట్స్, కాస్ట్యూమ్స్, కథ, నటీనటులందరూ ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లారు. ఈ నూతన ప్రింట్ ఇంత సమర్ధవంతంగా రావడానికి కృషి చేసిన వారందరికీ నా ధన్యవాదాలు. ఇది నేటి సినీ ప్రియులకు ఒక వరం. ప్రస్తుత చిత్రాలకు కూడా పోటీనిచ్చే అద్భుతమైన దృశ్యకావ్యాన్ని సమర్థవంతంగా సిద్ధం చేసిన స్వప్న సినిమాస్, వైజయంతీ మూవీస్, నాగ్ అశ్విన్‌లకు ధన్యవాదాలు’’ అని పేర్కొంది.
Also Read- Samantha: సమంత మోసం చేస్తుంది.. డాక్టర్ ఫైర్!
మరో వైపు నాని కూడా సేమ్ జాన్వీ కపూర్ ధరించిన జాకెట్‌లోనే కనిపించి ఆశ్చర్యపరిచారు. జగదేక వీరుడు అతిలోక సుందరి అనే ట్యాగ్‌తో ఒక వీధిలో ఆయన నడుచుకుంటూ వెళుతున్న ఫొటోలని నాని తన ఇన్‌స్టాగ్రమ్ వేదికగా షేర్ చేశారు. ఆయన జాకెట్ పై ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ అని రాసి ఉంది. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. ఒకేసారి జాన్వీ, నాని ఇలా ఫొటోలను షేర్ చేయడం వెనుక మతలబు ఏమై ఉంటుందా? అని కూడా నెటిజన్లు తెగ ఆలోచించేస్తున్నారు. ఈ మధ్య ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాల తర్వాత జాన్వీ కపూర్ నటించే నెక్ట్స్ టాలీవుడ్ హీరో నానినే అనేలా వార్తలు వచ్చాయి. ఆ లింక్ ఏమైనా ఉందా? త్వరలోనే ఈ కాంబోలో సినిమా ఏమైనా అనౌన్స్ కాబోతుందా? అందుకే ఇద్దరూ ఇలా ‘జగదేక వీరుడు అతిలోకి సుందరి’తో హడావుడి చేయడం స్టార్ట్ చేశారా? అంటూ కొందరు నెటిజన్లు వారికున్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అయితే.. వీరిద్దరూ ఈ సినిమాను మరోసారి ట్రెండ్‌లోకి తీసుకొచ్చారనేది మాత్రం వాస్తవం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు