BJP MP Etela Rajender (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

BJP MP Etela Rajender: బీజేపీ పార్టీ ప్రాధాన్యం ఇవ్వకుంటే ఏం చేయాలి?

BJP MP Etela Rajender: బీజేపీ పార్టీ తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుంటే ఏం చేయాలి? అని హుజురాబాద్ నియోజక వర్గంలోని ఈటల రాజేందర్ అభిమానులు అంతర్మదనంలో పడ్డారు. ఈ మేరకు కమలాపూర్ లో మండల ఈటల రాజేందర్ అనుచరుల బేటి అయ్యారు. పార్టీ జిల్లా కమిటీ, మండల కమిటీ నియామకంలో ఈటల రాజేందర్ అనుచరులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తమ భవిష్యత్ ఏంటనే ఆందోళనలో ఉన్న ఈటల రాజేందర్ ఫాలోవర్స్ త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరిపారు. 25 సంవత్సరాలుగా ఈటల రాజేందర్(Etala Rajender) వెన్నంటి నడిచిన తమకు బీజేపీ పార్టీలో ఎలాంటి స్థానం ఉంటుందో అనే అనుమానాన్నీ ఈటల అనుచరగణం వ్యక్తం చేశారు.

మాకు అన్యాయం జరగకుండా చూడాలి
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఈటల రాజేందర్ వెంట ఉంటూ ఆయన వెంట బీజేపీలో చేరిన తమకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అవకాశం ఇస్తుందా లేదా అనే అనుమానం వ్యక్తం చేసినట్టు సమాచారం. బీజేపీ పార్టీ నుంచి సరైన సపోర్ట్ దొరకక పోతే ఏం నిర్ణయం తీసుకోవాలని అనే అంశం పై సుదీర్ఘ చర్చ జరిగింది. బీజేపీ(BJP) పార్టీ తగిన ప్రాధాన్యత ఇవ్వకుంటే ప్రత్యామ్నాయ ఆలోచన చేసే దిశగా అడుగులు వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. నిన్నే నమ్ముకుని అనేక కష్టనష్టాలకోర్చి బీజేపీ లో కొనసాగుతున్నాం మా భవిష్యత్ మాకు అన్యాయం జరగకుండా చూడాలని ఈటలను కలిసి చెప్పాలని. మా భవిష్యత్ నిర్ణయానికి తగిన సపోర్ట్ చేయాలని కోరేందుకు సిద్ధం కావాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Also Read: Swetcha: ఆకర్షణీయమైన ఆఫర్లతో ఆన్ లైన్ బెట్టింగ్ వలలో చిక్కుకుంటున్న యువత

పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ కు దగ్గరగా ఉంటారు అనే విషయం తెలిసిన పార్టీలో దూరం పెట్టారని, ఈటల రాజేందర్ సన్నిహితుడు అని తెలిసి ఇచ్చిన పార్టీ పదవిని పక్కన పెట్టారని ఇకపై సహించేది లేదని చర్చించినట్టు సమచారం. పార్టీ అధినాయకత్వం, పార్టీ పెద్దలు ఇకపై వివక్ష చూపితే పార్టీలో ఉంటూనే కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకైన వెనుకాడేది లేదని ఈటల రాజేందర్‌ ఫాలో అయ్యే బీజేపీ నాయకులు చర్చినట్టు సంచారం.

ఈటల తో తేల్చుకునేందుకు సిద్ధం
ఉద్యమ సమయం నుంచి ఇంతకాలం ఎన్ని ఇబ్బందులు వచ్చినా సాధారణ ఎన్నికల్లో ప్రతికూల ఫలితం వచ్చిన కష్టకాలంలో ఏనాడు పార్టీని వీడకుండా బీజేపీ నేత ఈటల రాజేందర్(Etala Rajender) తో నడిచిన మనం. భవిష్యత్ రాజకీయాల నేపథ్యంలో మాకు ఏం న్యాయం చేస్తారు. ఈటల మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన అక్కడికి వెళ్లిన తరువాత తాము పార్టీలో వివక్షకు గురి అయ్యాం. పార్టీ పదవులు లేక కనీసం గుర్తిపు లేక ఇబ్బంది పడ్డాం. ఇక నైనా మాకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈటల రాజేందర్ పై ఉంది. ఈ విషయంలో మాకు ఎలా న్యాయం చేస్తారో ఈటలతోనే తేల్చుకోవాలని సమావేశంలో చర్చించినట్టు సమచారం.

Also Read: BRS: పార్టీ నేతలను వెంటాడుతున్న కేసులు.. నైరాశ్యంలో గులాబీ క్యాడర్..

 

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?