BRS( IMAGE CREDIt: TWITTER)
Politics

BRS: పార్టీ నేతలను వెంటాడుతున్న కేసులు.. నైరాశ్యంలో గులాబీ క్యాడర్..

BRS:కేసులు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం ఏ కేసును ఎప్పుడు ఓపెన్ చేస్తుందో, ఎప్పుడు విచారణకు పిలుస్తారో తెలియకపోవడంతో గులాబీ నేతలు సతమతమవుతున్నారు. పార్టీ కార్యక్రమాలు స్పీడప్ చేస్తే, ఆ తరుణంలోనే కేసు విచారణలు అంటే క్యాడర్‌లో ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉందని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు పార్టీ కార్యక్రమాలను స్పీడప్ చేయడం లేదని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. సభ్యత్వ నమోదు సైతం ప్రారంభించడం లేదనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న తరుణంలో గులాబీ నుంచి ఎలాంటి యాక్టీవిటీస్ చేయడం లేదు.

బీఆర్ఎస్ వైఫల్యాలపై కాంగ్రెస్ ఫోకస్
బీఆర్ఎస్ వైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఫార్ములా ఈ-కారు రేసు కేసులో గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ఇప్పటికే మూడుసార్లు విచారణకు పిలిచారు. సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. అయితే, మళ్లీ ఇదే కేసులో కేటీఆర్‌ను విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన పీసీ ఘోష్ కమిషన్ ఈ నెలలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది. ఈ కమిషన్ పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు హరీశ్ రావును సైతం విచారించింది. అయితే, కమిషన్ ఇచ్చే నివేదికను బట్టి కేసీఆర్, హరీశ్ రావుపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు కమిషన్ నివేదిక ఏం ఇస్తుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 Also Read: Kota Srinivasa Rao: రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన కోట.. 2015లో పద్మశ్రీ పురస్కారం

మెడపై కత్తిలా ఫోన్ ట్యాపింగ్ కేసు
మరోవైపు ఫోన్ ట్యాప్ కేసు బీఆర్ఎస్ మెడపై కత్తిలా వెంటాడుతున్నది. సిట్ అధికారులు విచారణను ఇప్పటికే ముమ్మరం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌తో పాటు బీజేపీ నేతల ఫోన్ ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అప్పుడు ఎవరెవరు కీలకంగా ఉన్నారని వారి ఫోన్ ట్యాప్ చేశారని కొందరు నేరుగా విచారణ చేయాలని సిట్ అధికారులకు విజ్ఞప్తి చేయగా ఇప్పటికే ఎంపీలను, ఎమ్మెల్సీలను సైతం అధికారులు విచారించారు. నాడు ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు ఉండడంతో ఆయనను సైతం ఐదుసార్లు సిట్ విచారణ చేపట్టింది. ఆయన నోరు తెరిస్తే బీఆర్ఎస్ కీలకనేతలను విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ మూడు కేసులు బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతున్నాయి. ఎప్పుడు ఏ కేసులో గులాబీలో కీలకంగా ఉన్న నేతలను విచారణకు పిలుస్తారో తెలియకపోవడంతో సతమతమవుతున్నారు.

ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని
పార్టీ కార్యక్రమాలను యాక్టివ్ చేసి నాయకులు ప్రజల మధ్య వెళ్లేందుకు ప్రణాళికలు సైతం అధిష్టానం సిద్ధం చేసింది. అయితే, ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో ఎండగడుతున్న తరుణంలో ప్రభుత్వం కేసుల విచారణను ముమ్మరం చేస్తే పార్టీ కార్యక్రమాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. దీంతో పార్టీపై ప్రజల్లో మళ్లీ వ్యతిరేకత వస్తుందని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే పార్టీ కార్యక్రమాలను స్పీడప్ చేయడం లేదని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను కేవలం మీడియా ముందు మాత్రం ఎండగడుతున్నారని సమాచారం. లేకుంటే మీడియా ప్రకటనల ద్వారా ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.

సభ్యత నమోదుపై స్పష్టత లేదు
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జూన్‌లోనే ప్రారంభిస్తామని పార్టీ అధిష్టానం పేర్కొంది. అంతేకాదు లీకులు సైతం ఇచ్చింది. కానీ, జూలై నెల సైతం ప్రారంభమైంది. నెలలో సగం రోజులు గడిచాయి. కానీ, సభ్యత్వ నమోదుపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసే తరుణంలో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వారిపై కేసులు నమోదు అవుతున్నాయి. ఈ తరుణంలోనే కొంత క్యాడర్ సైతం వెనుకంజ వేస్తున్నారు. అయితే, బీఆర్ఎస్ అగ్రనేతలపైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టడంతో పార్టీ కార్యక్రమాలను స్పీడ్ పెంచితే, అదే స్థాయిలో పార్టీ నేతలపైనా కేసులు పెట్టి అరెస్టు చేస్తే వారి మనోధైర్యం దెబ్బతింటుందని భావిస్తుందని, పార్టీకి సైతం డ్యామేజ్ అవుతుందని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆచితూచీ ముందుకెళ్తున్నట్లు సమాచారం.

స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు
ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అంతేకాదు ప్రభుత్వ కార్యక్రమాల స్పీడ్ పెంచింది. అయితే గులాబీ పార్టీ మాత్రం తన క్యాడర్‌ను యాక్టివ్ చేయడంలో వెనుకబడిందని నేతలే అభిప్రాయపడుతున్నారు. పార్టీ కార్యక్రమాలు లేకపోవడంతో క్యాడర్ సైలెంట్‌గా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగి 19నెలలు అవుతున్నా గులాబీ అధిష్టానం మాత్రం క్యాడర్‌లో ఆత్మస్థైర్యం నింపే కార్యక్రమాలు చేపట్టకపోవడంతో అయోమయంలో ఉన్నారు. అయితే, బీఆర్ఎస్ ఎలాంటి ప్రణాళికలతో ప్రజల ముందుకు పోతుంది? అసలు పోతదా? పోదా? ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు చాలా టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఎందుకని సైలెంట్‌గా ఉంటుంది? అసలు ఏం చేయబోతుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

 Also Read:Kavitha and Teenmaar Mallanna: ఎప్పుడూ ఏదో ఒక లొల్లి.. ప్రజా సమస్యలపై లేని సోయి? 

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ