Bhatti Vikramarka(image credit:X)
నార్త్ తెలంగాణ

Bhatti Vikramarka: ఖనిజాల అన్వేషణలో సింగరేణి రాణించాలి.. డిప్యూటీ సీఎం ఆదేశం!

Bhatti Vikramarka: బొగ్గు రంగంలో అగ్రస్థానంలో ఉన్న సింగరేణి రానున్న రోజుల్లో క్రిటికల్ మినరల్స్, సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో ప్రవేశించి తన సత్తాను చాటాలని, 136 ఏళ్ల మైనింగ్ అనుభవాన్ని ఉపయోగించుకొని సంస్థ భవిష్యత్తుకు సుస్థిర ప్రణాళికలు రూపొందించుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు.

శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సింగరేణి భవిష్యత్తు విస్తరణ ప్రాజెక్టులపై సమీక్షించారు. గ్రాఫేట్, లిథియం, కాపర్ తదితర ఖనిజాలకు రానున్న రోజుల్లో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో వాటి అన్వేషణకై ఉన్న అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాలని నిర్దేశించారు. ఇందుకోసం ఇప్పటికే కన్సల్టెంట్ ఏజెన్సీలను నియమించుకొని ముందుకు వెళుతుండటంపై సంతృప్తిని వ్యక్తం చేశారు.

Also read: Hydra: బడా బాబులకు బిగ్ షాక్.. ఆక్రమణలకు పాల్పడితే ఆస్తులు జప్తు!

ఈ విషయంలో అనుభవజ్ఞులైన అధికారుల ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు అలాగే సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం పెరుగుతున్నందున సింగరేణి ప్రాంతాల్లోనూ, దేశంలోని ఇతర ప్రాంతాలలో అందుబాటులో ఉన్న అవకాశాల అన్వేషణకు సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగాలన్నారు.

అలాగే రాజస్థాన్ తో చేసుకున్న అవగాహన ఒప్పందం మేరకు విద్యుత్, సోలార్ ప్లాంట్ ఏర్పాట్లపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ ఎన్ బలరాం నాయక్, ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్, సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుభాని తదితరులు పాల్గొన్నారు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ