Bhadradri Kothagudem (magecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Bhadradri Kothagudem: ఈ జర్నలిస్ట్ నిజంగా దేవుడు.. నేను ఉన్నానంటూ హమీ

Bhadradri Kothagudem: జర్నలిజం అంటే ప్రభుత్వానికి ప్రజలకు వారదే కాకుండా సమాజంలో పేరుకుపోయిన సమస్యలను సైతం తెరపైకి తీసుకొచ్చి పరిష్కార మార్గానికి దారి చూపడమే లక్ష్యం. ప్రతి జర్నలిస్టు తన కుటుంబానికి సరైన సమయం కేటాయించకుండా సమాజం కోసం ప్రతిక్షణం కేటాయిస్తూ వారి సమస్యలను పరిష్కరింప చేసేందుకు అధికారులను, ప్రజా ప్రతినిధులను మేల్కొల్పే నైజం. అలాగే కాకుండా ఇటీవల కొంతమంది జర్నలిస్టులు తమ యాక్టివిటీస్ ను పెంచుతూ స్వచ్ఛందంగా వ్యక్తులకు సాయం చేసే దిశగా అడుగులు వేయడం జర్నలిజానికి మరింత వన్నెతెస్తుంది. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఇటీవల చాలానే చోటు చేసుకున్నాయి. నిర్భాగ్యులకు సహాయం చేయడంతో పాటు సహాయం చేయించే చొరవ చూపడం కూడా జర్నలిజంలో ఓ భాగమైంది.

గోడ కూలిన ఘటనలో వెన్నుపూస దెబ్బతింది

అలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా జర్నలిస్ట్ గండికోట కిరణ్ కుమార్(Kiran Kumar) తన ఉదాహరతను చాటుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే కొత్తగూడెం పట్టణంలోని రామవరం సి.ఆర్.పి క్యాంపు కాలనీకి చెందిన గుబ్బల సతీష్(Sathish) ప్రమాదవశాత్తు గోడకూలి నడుము మీద పడడంతో వెన్నుపూస దెబ్బతిని రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. వృత్తిరీత్యా ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ తన కుటుంబాన్ని 15 ఏళ్లుగా పోషిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే గోడ కూలిన ఘటనలో వెన్నుపూస దెబ్బతిని రెండు కాళ్లు పనిచేయకపోవడంతో కుటుంబ భారం ఇబ్బంది అవుతుంది. కుటుంబ ఆర్థిక ఇబ్బందులను తెలుసుకున్న కొత్తగూడెం జిల్లాకు చెందిన జర్నలిస్టు గండికోట కిరణ్ గుబ్బల సతీష్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అతని ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. నేనున్నానంటూ ధైర్యం చెబుతూ ప్రతి నెలకు మెడికల్ ఖర్చులకు ₹1000 లను ఇస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే సతీష్ రెండు కాళ్లు తొలగిస్తే ప్రాణాలకే ప్రమాదం అని, హైదరాబాద్ లోని గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులు చెప్పడంతో గుబ్బల సతీష్ తీవ్ర మానసిక శోభకు గురవుతూ వస్తున్నాడు.

Also Read: Rath Yatra: భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగు.. విషాదం

ఆర్థిక సాయం చేస్తానని హామీ

ఈ విషయం తెలుసుకున్న కిరణ్ ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ ప్రతినెల 1000 రూపాయలు అందించే కిరణ్ తాజాగా ఒక్కో నెలకు 5000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేస్తూ వస్తున్నాడు. అంతేకాకుండా ఆపరేషన్ తర్వాత గుబ్బల సతీష్ కుటుంబానికి బతుకుతెరువు కోసం వ్యాపారం చేసుకునేందుకు తన వంతుగా ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. నేటి సమాజంలో ఎంతో కొంత సాయం చేసి నేను వారికి సాయం చేశానని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో జర్నలిస్టు(Journalist) వృత్తిలో ఉన్న గండికోట కిరణ్ కుమార్ గుబ్బల సతీష్ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తూ తన మానవతా దృక్పథానికి అడ్డం పడుతుంది. ప్రతినెలా రూ.5000 అందించడంతోపాటు వారు ఆర్థికంగా నిలదుక్కుకునేందుకు వ్యాపారానికి అవసరపడే ఆర్థిక సహాయాన్ని అందిస్తానని ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారాడు. ఈ విషయంతో స్థానికులు జర్నలిస్టు కుమార్ చేసేది సాదాసీదా సాయం కాదని, సినిమాల్లో ప్రజలను ఆకట్టుకోవడానికి చేపట్టే స్టంట్‌లు, ఇతర సామాజిక కార్యక్రమాలు లాగా కాకుండా రీల్ లైఫ్ లో చేయడం కాదు రియల్ లైఫ్ లోను చేయడమే గొప్పగా భావిస్తూ గుబ్బల సతీష్ కుటుంబానికి ఆర్థిక ధీమాగా కొత్తగూడెం జిల్లా రిపోర్టర్ గండికోట కిరణ్ కుమార్ నిలుస్తున్నారు.

Also Read: Viral Video: రోడ్డుపై నడుం లోతు నీళ్లు.. ఎంచక్కా స్కూటీపై వెళ్లిన వ్యక్తి.. వీడియో వైరల్!

 

 

Just In

01

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

Naresh65: కామెడీ గోస్ కాస్మిక్.. అల్లరి నరేష్ 65వ చిత్ర వివరాలివే..!