Bhadradri Kothagudem (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Bhadradri Kothagudem: కోట్లు దండుకుంటున్న కాంట్రాక్టర్.. ఆందోళనలో గిరిజనులు

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలం మొగలపల్లి భూమిపుత్ర ట్రైబల్ ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్ట్ పరస్పర సహాయ సహకార సంఘం కాంట్రాక్టర్ కొత్తపల్లి ఆంజనేయులు(Kothapalli Anjaneyulu) మాకొద్దు బాబోయ్ అంటూ సభ్యులు మొరపెట్టుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉండే ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కోట్లు దండుకుంటున్న కాంట్రాక్టర్ ఆదివాసీలకు ఆదాయం లేకుండా తన చర్యలతో విసిగిస్తున్నాడు. కాంట్రాక్టర్ చర్యలతో విసికి వేసారిన భూమిపుత్ర ట్రైబల్ ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్టు(Bhumiputra Tribal Sand Quarry Labor Contract) పరస్పర సహాయ సహకార సంఘం సభ్యులు ఈ కాంట్రాక్టర్ తమ కుటుంబాలను కూల్చేలా ఉన్నాడని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ కుటుంబాలకు చెందాల్సిన ఆదాయాన్ని తన సొంతానికి వాడుకుంటూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గొల్లుమంటున్నారు. 2019 కరోనా(Covid) సమయం నుంచి నేటి వరకు తమకు రావాల్సిన డబ్బులను మొత్తం నొక్కేస్తూ తమ గొంతు నులుముతున్నాడని వాపోతున్నారు.

అధికారులు వత్తాసు పలకడం
ఇసుక రిచ్ ద్వారా వచ్చే డబ్బులను స్వాహా చేస్తూ తమకు శతగోపం పెడుతున్నారని గోస పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల(Tribal) ఉపాధి కోసం ఇసుక రీచ్‌లను కేటాయిస్తే ఆ రీచ్‌లను నడుపుకునే స్తోమత లేక రైజింగ్ కాంట్రాక్టర్ను పెట్టుకుంటే తమకు రేషన్ లేకుండా చేస్తున్నారని మొరపెట్టుకుంటున్నారు. ఈ రైసింగ్ కాంట్రాక్టర్ తో తాము వేగలేమని అధికారులకు విన్నవిస్తుంటే పట్టించుకోవడంలేదని బాధపడుతున్నారు. ఒకవైపు కాంట్రాక్టర్ వచ్చిన ఆదాయాన్ని మొత్తం కొల్లగొడుతుంటే, కొల్లగొట్టే కాంట్రాక్టర్ కే తమ సపోర్టు అంటూ అధికారులు సైతం వత్తాసు పలకడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. న్యాయం కావాలని అధికారులను వేడుకుంటుంటే గిరిజనుల వేదన అరణ్య ఘోసే అవుతుంది తప్ప పరిష్కార మార్గం కనిపించడం లేదని ఆవేదన వెళ్లగక్కుతున్నారు. తమకు రావాల్సిన డబ్బులను కొల్లగొడుతూ గోస పెట్టుకుంటే తమ గోడు పట్టించుకునే నాధుడే లేరా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగం సైతం కాంట్రాక్టర్కు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుంటే తమను పట్టించుకునే నాధుడు ఎవరని గోడు వెళ్ళబోసుకుంటున్నారు.

Also Read: Betting Apps Case: ఈడీ విచారణకు సమయం కోరిన రానా.. భయపడుతున్నాడా?

ఇసుక సంఘం సభ్యుల ఆవేదన
చర్ల మండలం మొగలపల్లి భూమిపుత్ర ట్రైబల్ ఇసుక క్వారీ సంఘం సభ్యులు తమ రోదనను వేదన రూపంలో వెళ్లగక్కిన అధికారులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. రైసింగ్ కాంట్రాక్టర్ మాయలో చిక్కుకొని తాము ఇబ్బందులను ఎదుర్కొంటుంటే ఈ విషయాన్ని అధికారులకు తెలియజేస్తే పట్టించుకోరా అని నిలదీస్తున్నారు. రైసింగ్ కాంట్రాక్టర్ కొత్తపల్లి ఆంజనేయులు తమ నోట్లో మట్టి కొడుతుంటే అధికారులు చూస్తూ మిన్న కుండిపోతారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమిపుత్ర సొసైటీలో 88 మంది సభ్యులు ఉండగా జనరల్ బాడీలో ఉన్న 12 మంది సభ్యులను తన గుప్పిట్లో పెట్టుకొని రైసింగ్ కాంట్రాక్టర్ ఆంజనేయులు తమ జీవితాలతో ఆటలు ఆడేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 12 మంది సభ్యులు తన చెప్పు చేతల్లో ఉంచుకొని ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తూ తమ కుటుంబాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడుతున్నారు.

లెక్కలు కనిపించకుండా దాచేస్తున్నాడు
సొసైటీకి సంబంధించిన అన్ని రకాల రికార్డులను పత్రాలను తీర్మానం చేసిన బుక్కులను తన ఇంట్లో దాచుకొని అధికారులను సైతం తన ఇంట్లో మనిషిలా చేసుకుని తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. సంతకాలు పెట్టే సమయంలోనే పుస్తకాలను తన ఇంట్లో నుంచి బయటకు తీస్తూ ఆ తర్వాత మాకు లెక్కలు సైతం కనిపించకుండా దాచేస్తున్నాడని ఆవేదన చెందుతున్నారు. తమకు రైసింగ్ కాంట్రాక్టర్ ద్వారా తీవ్ర నష్టం వాటిల్లుతుందని అధికారులకు ఫిర్యాదు చేస్తే తమను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోతుందంటున్నారు. ఇక నైనా తమకు ప్రభుత్వం కేటాయించిన ఇసుక రీచ్‌ను ఆమె నిర్వహించుకుంటామని రైసింగ్ కాంట్రాక్టర్ అవసరం తమకు లేదని ఖరాఖండీగా చెబుతున్నారు. రైజింగ్ కాంట్రాక్టర్ నుంచి తమకు వెసులుబాటు కల్పించి అధికారులు సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read: Gadwal Congress leaders: గద్వాలలో బిసి నాయకత్వానికి తీరని అన్యాయం

 

 

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!