Rajiv Yuva Vika: రాజీవ్ యువ వికాసం కింద వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు పొందడానికి లబ్ధిదారులు మూడు నెలలుగా నిరీక్షిస్తున్నారు. నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 న జోగులాంబ గద్వాల జిల్లాలో(Jogulamba Gadwal District) లబ్ధిదారులకు రాయితీ రుణాల చెక్కులు పంపిణీ చేయడానికి సిద్ధం చేసి చివరి క్షణంలో వాయిదా వేయడంతో లబ్ధిదారులు నిరాశకు గురయ్యారు. ఆ రోజు ముందుగా రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు రుణాలు పొందడానికి దరఖాస్తులు చేసుకున్న లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేస్తామని ప్రకటించి వాయిదా వేశారు. సెప్టెంబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం యోచిస్తోంది. ఆ లోపు రుణాలు అందజేస్తారో లేదోనని లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు.
Also Read: Nagarkurnool district: నాగర్‌కర్నూల్ జిల్లాలో నయా మోసం.. అధికారులపై వేటు!
18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు గల నిరుద్యోగులకు రుణాలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడంతో జోగులాంబ గద్వాల జిల్లాలో(Jogulamba Gadwal District)భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. లబ్ధిదారుడు ఎంచుకున్న యూనిట్ ఆధారంగా రూ.50 వేల నుంచి రూ. 4 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నారు. ఇందులో రూ.50 వేలు రుణం తీసుకున్న వారికి పూర్తి స్థాయి రాయితీ కల్పించారు. మిగతా వారికి బ్యాంకు లింకేజీ ద్వారా ఇచ్చే రుణాలకు ఆ యూనిట్ విలువ ఆధారంగా రాయితీ ఇవ్వను న్నారు. లబ్ధిదారులు స్వయం ఉపాధి పొందడానికి ప్రభుత్వం 81 రకాల యూనిట్లను పెట్టుకోవడానికి అవకాశం కల్పించింది.
లబ్దిదారుల్లో తీవ్ర నిరాశ
ప్రభుత్వం నిరుద్యోగ యువత,యువకులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాజీవ్ యువ వికాసం(Rajiv Yuva Vikasam)పథకం ద్వారా యూనిట్ల స్థాపనకు దరఖాస్తులు స్వీకరించి కేటగిరి-1. కేటగిరి-2 అబ్దిదారులకు ఈనెల 2 న రుణాలు అందజేస్తారని ప్రకటించినా చివరి నిమిషంలో రుణాల పంపిణీ వాయిదా పడటంతో లబ్దిదారులు తీవ్ర నిరాశలో ఉన్నారు. జూన్ 5 వరకు లబ్ధిదారులకు రుణాల మంజూరు పత్రాలు పంపిణీ చేసి ఈ నెల 15 లోపు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. నెలాఖరు లోపు బ్యాంకుల నుంచి వచ్చేలా కూడా ఏర్పాట్లు చేశారు.కానీ చివరి నిమిషంలో రుణాల పంపిణీ వాయిదా పడటంతో లబ్ధిదారులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.
జిల్లా వివరాలు ఇలా..
కులాల వారీగా కార్పొరేషన్లు, దరఖాస్తులు
❄️ఎస్సీ కార్పొరేషన్ : .8771
❄️బిసి కార్పొరేషన్: 13551
❄️ఎస్టీ కార్పొరేషన్: …473
❄️ఈ బి సి కార్పొరేషన్: …388
❄️మైనారిటీ కార్పొరేషన్ : ..2200
❄️క్రిస్టియన్ కార్పొరేషన్:…….66
❄️మొత్తం : 25439
Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..