Harish Rao (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Harish Rao: ప్రాణాలు లెక్కచేయకుండా పేదల కోసం పోరాడారు..హరీష్ రావు!

Harish Rao: సిద్దిపేట జిల్లా, నంగునూర్ మండలం, పాలమాకుల గ్రామంలో పండగ సాయన్న ముదిరాజ్, కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ మరియు, హరీష్ రావు పాల్గోన్నారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ, ఈరోజు మన మండలంలో మొట్టమొదటిసారిగా పండుగ సాయన్న, కొరవి కృష్ణ స్వామి విగ్రహాలు పాలమాకుల గ్రామంలో ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. విగ్రహాలను ఆవిష్కరించడం ఎంత ముఖ్యమో వారిని జీవితంలో ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లడం కూడా ముఖ్యమైనదని, కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ గురించి బండ ప్రకాష్ ఎంతో గొప్పగా చెప్పారు. హైదరాబాద్ తొలి మేయర్ గా, ముదిరాజ్ సమాజానికి ఆయన చేసిన కృషి ఎంతో గొప్పదని అన్నారు. పండుగ సాయన్న తన ప్రాణాలను లెక్కచేయకుండా పేదల కోసం పోరాడి చివరికి ప్రాణాలను వదిలడం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని అన్నారు.

కానిస్టేబుల్ కృష్ణయ్య

కానిస్టేబుల్ కిష్టయ్య ఆరోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసి చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. కానిస్టేబుల్ కృష్ణయ్య విగ్రహాలు అనేక చోట్ల పెట్టుకున్నాం. కేసీఆర్ కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని ఆదుకున్నారు. వారి కూతుర్ని డాక్టర్ చదివించారు. ఇప్పుడు పీజీ కూడా చదివిస్తున్నారని, ముదిరాజులకు బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా ప్రాజెక్టులను చెరువులకు అనుసంధానం చేసి, కొత్త ప్రాజెక్టులు నిర్మించి చెరువులో నీళ్లు నింపాంమని గుర్తుచేశారు. ముదిరాజుల ఉపాధి పెరిగింది. కాలమైనా కాకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులను నింపి నిండుకుండలా చేసాం. గ్రామాల్లో ముదిరాజులకు ఉపాధి దొరికింది. సమైక్య రాష్ట్రంలో చెరువులను పట్టించుకోలేదు. ప్రాజెక్టులను పట్టించుకోలేదు. మన నీళ్లను మనకు దక్కనీయలేదు. ఈరోజు కృష్ణా, గోదావరిలో మన నీళ్ల వాటా మనకు దక్కాలని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులను పూర్తి చేసామని అన్నారు. ఏ గ్రామంలో పోయిన కూడా చెరువులో చాపలు ఎండిపోతున్నాయి. చాపలు చనిపోతున్నాయి. బోర్లేసి నీళ్లు నింపమని అడిగిన రోజులు తెలంగాణలో ఉండే. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. చెరువుల నీళ్లు నిండా ఉన్నాయి. చాపలు దొరకలేక కొన్ని చెరువులలో నీళ్లు తీయమని అడిగే పరిస్థితి వచ్చిందని, నీళ్లు నింపండి అనే పరిస్థితి నుంచి నీళ్లు తీయండి అనే పరిస్థితికి వచ్చిందని హరీష్ రావు అన్నారు.

Also Read: Miss World 2025: అందాల పోటీల్లో అభాసుపాలు.. మొదట్నుంచీ అడ్డంకులే!

చేప పిల్లల టెండర్లు పిలవలేదు

ఎట్లుండే తెలంగాణ ఎట్లా ఉంది అనేది గమనించండి. కేసీఆర్ ఉన్నప్పుడు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ముదిరాజులకు బండ్లు, ఆటోలు, పడవలు, వలల కోసం ఆర్థిక సాయం అందించారు. ప్రతి సంవత్సరం120 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉచితంగా చేప పిల్లలు, రొయ్యల్ని చెరువుల్లో, ప్రాజెక్టులలో పోసింది బీఆర్ఎస్ ప్రభుత్వంమని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సగం జిల్లాల్లోని చెరువుల్లో కూడా ఇప్పటివరకు చాపలు పోయలేదని, పోయిన సంవత్సరం మన జిల్లాలో చేప పిల్లలను ప్రభుత్వం పోయలేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వానాకాలం రాకముందే టెండర్లను పిలిచి సిద్దపడేవాళ్ళం. జూన్ నెల వచ్చినా ఇప్పటికీ ప్రభుత్వం చేప పిల్లల టెండర్లు పిలవలేదు. దీన్ని బట్టి ముదిరాజుల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్ధమవుతున్నదని హరీష్ రావు అన్నారు. కమీషన్లకోసం, జేబులు నింపుకోవడానికి, ఢిల్లీకి కప్పం కట్టడానికి లక్ష కోట్ల టెండర్లను పిలుస్తున్నారని, మత్స్యకారులకు, కులవృత్తులకు ఉపాధి కల్పించమంటే డబ్బులు లేవు అనడం ప్రభుత్వం ఎంత నిర్లక్షం చేస్తు్ందో అర్థం చేసు కవాలని అన్నారు.

Also Read: IAS Officers: ఒకే సమయంలో సమీక్షలు.. ఐఏఎస్ ల మధ్య రివ్యూల రచ్చ!

 

Just In

01

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్