Jangaon News: బ్రిడ్జి పోరాటంలో జైలుకు వెళ్ళిన వ్యక్తికి స‌న్మానం..!
Jangaon News (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Jangaon News: బ్రిడ్జి పోరాటంలో జైలుకు వెళ్ళిన ఉమాప‌తికి స‌న్మానం..!

Jangaon News: ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేసే ప్ర‌జా ఉద్య‌మ‌కారుల‌పై కేసులు పెట్టి జైలుకు పంపితే ప్ర‌జా ఉద్య‌మాలు ఆగుతాయ‌ని అనుకోవ‌డం మూర్ఖ‌త్వ‌మ‌ని క‌ల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్య‌ద‌ర్శి బూడిద గోపి(Gopi) అన్నారు. గానుగుపహడ్, చీటకోడూర్ బ్రిడ్జి సాధన పోరాటంలో జైలుకు పోయి బెయిల్ పై విడుదలైన బాల్నె ఉమాపతిని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వ‌ర్యంలో శ‌నివారం జ‌న‌గామ ప‌ట్ట‌ణంలోని ఫంక్ష‌న్ హాల్‌లో ఘ‌నంగా స‌న్మానించారు.

నిర‌స‌న ర్యాలీ

ఈ సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మానికి సంఘం జిల్లా నాయ‌కుడు బాల్నే వెంక‌ట‌మ‌ల్ల‌య్య అధ్య‌క్ష‌త వ‌హించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న బూడిద గోపీ మాట్లాడుతూ ఈనెల 3న జనగామ మండలంలోని గానుగు పహాడ్ వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పనుల ఆలస్యాన్ని, చీటకోడూరు లో లెవెల్ బ్రిడ్జి కొట్టుకుపోగా కొత్త బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేస్తూ గాడిద‌కు తెలంగాణ(Telangana) సీఎం, మంత్రుల ఫోటోల‌ను త‌గిలించి నిర‌స‌న ర్యాలీ నిర్వ‌హించారని తెలిపారు. దీనిని సాకుగా తీసుకున్నఅధికారులు అధికార పార్టీ నేత‌ల ఆదేశాల‌తో కేసులు న‌మోదు చేయించి ఐదుగురు యువ‌కులపై కేసులు న‌మోదు చేయించి జైలుకు పంపార‌ని అన్నారు. ప్ర‌జా పోరాటం చేసిన వ్య‌క్తుల‌ను అరెస్టు చేసి జైలుకు పంపితే ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌న్నారు.

Also Read: KTR: తెలంగాణ చరిత్రలో గొప్ప ఘట్టానికి గుర్తుగా దీక్షా దివస్: కేటీఆర్

బ్రిడ్జిల సాధ‌న పోరాటం

కేసులు పెట్టి జైలుకు పంపితే ప్ర‌జా పోరాటాలు ఆగ‌వ‌న్నారు. బ్రిడ్జిల సాధ‌న పోరాటంలో పాల్గొని జైలుకు వెల్ళిన కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షులు బాల్నే ఉమాపతి పోరాటం ప్ర‌జా ఉద్య‌మాల‌కు స్పూర్తిగా నిలుస్తుంద‌న్నారు. అధికారులు వాస్త‌వాలు చూడ‌కుండా కేవ‌లం అధికార పార్టీ నేత‌ల ఒత్తిడికి త‌లొగ్గి కేసులు పెట్ట‌డం సరికాద‌న్నారు. ఇక‌నైనా అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులు గానుగుప‌హాడ్‌, చీట‌కోడూరు బ్రిడ్జిల‌ను వెంట‌నే నిర్మించి, ప్ర‌జ‌ల అసౌక‌ర్యాల‌ను తొల‌గించాల‌ని కోరారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కుర్ర ఉప్పలయ్య, జిల్లా ఉపాధ్యక్షులు జొన్నగోని శ్రీనివాస్, బండపల్లి శంకరయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు బస్వగాని గాని మహేందర్ బైరగోని బలరాం జిల్లా కమిటీ సభ్యులు గోపగోని యాదగిరి వడ్లకొండ వెంకటేష్ , యాదండ్ల పరంధాములు, కుర్ర రాజు, మూల కిరణ్, బాల్నేకార్తీక్, గొల్లపల్లి మురళి పాల్గొన్నారు.

Also Read: Ponnam Prabhakar: గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్

Just In

01

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!

Jailer 2: ‘జైలర్ 2’లో గెస్ట్ రెల్ చేసేది బాలయ్య కాదట.. ఎవరంటే?