Khammam District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Khammam District: కొత్త రెవెన్యూ చట్టంతో.. సమస్యలకు చెక్!

Khammam District: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇందిరమ్మ పాలన ద్వారా ప్రజల వద్దకే రెవెన్యూ వ్యవస్థ వచ్చే విధంగా కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించిందని రెవెన్యూ డివిజనల్ అధికారి గరిడే నరసింహారావు పేర్కొన్నారు. కొత్త రెవెన్యూ చట్టం భూభారతి అమలులో భాగంగా రాష్ట్రమంతటా రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం నిర్వహిస్తుందని భూభారతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ఉద్దేశంతో ఆయా గ్రామాల్లో సదస్సులకు శ్రీకారం చుడుతున్నామని ఆర్డీవో వివరించారు. ముదిగొండ మండలం మేడేపల్లి, పమ్మి గ్రామాలలో జరిగిన రెవెన్యూ సదస్సుకు ఆర్డీవో హాజరయ్యారు.

భూభారతి చట్టం 2025

స్థానిక తహసిల్దార్ సునీతా ఎలిజబెత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి భూభారతి చట్టం 2025 పై అవగాహన సదస్సులు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డిఓ గ్రామస్తులను, రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. ఏడాదిలోపు భూ ప్రక్షాళన పూర్తి చేయాలని నిర్ణయించిన సర్కార్‌, ప్రతి కమతానికి సరిహద్దులతో కూడిన మ్యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుందనీ గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించడంతో పాటు సర్వేయర్ల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు కొనసాగుతోందన్నారు. భూభారతి సదస్సులు – ప్రజ‌ల వద్దకే రెవెన్యూ నినాదంతో సమస్యల పరిష్కారం చేసేందుకు అధికారులు గ్రామాలకే వస్తున్నారని అన్నారు.

Also Read: Strawberry Moon: రేపే స్ట్రాబెర్రీ మూన్.. ఆకాశంలో ఏం జరగబోతోంది?

రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

అనేక సంఖ్యలో ఉన్న ధరణి సమస్యలతో పాటు ఇతర భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ స్పష్టం చేశారు. కొత్త రెవెన్యూ చట్టం భూ భారతిపై అవగాహన కల్పించడంతో పాటు పైసా ఖర్చు లేకుండా భూ సమస్యల తక్షణ పరిష్కారానికి సదస్సులు వేదిక కానున్నాయనీ వివరించారు. అనంతరం రైతుల వద్దనుంచి దరఖాస్తులను స్వీకరించారు. భూ పరిపాలనను సదస్సుల ద్వారా ప్రజల వద్దకే రెవిన్యూ వ్యవస్థను తీసుకెళ్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సునీతా ఎలిజబెత్, నాయబ్ తహశీల్దార్ లక్ష్మీ, రెవిన్యూ ఇన్స్పెక్టర్‌లు ప్రసన్న కుమార్, వహీదా సుల్తానా, జూనియర్ అసిస్టెంట్లు జ్యోతి రవీంద్ర, అబ్బాస్, జాన్ పాషా, రమా దేవి, ఆపరేటర్ ప్రవీణ్ ఆయా గ్రామ పంచాయితీల కార్యదర్శులు, రైతులు, యువకులు,మహిళలు హాజరయ్యారు.

Also Read: ACB Raids: కాళేశ్వరం ఇంజనీర్‌కు బిగ్ షాక్.. రంగంలోకి ఏసీబీ.. 12 చోట్ల సోదాలు!

 

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు