Strawberry Moon: వినీలాకాశంలో చోటుచేసుకునే ఖగోళ అద్భుతాలు ప్రతి ఒక్కరినీ ఎంతో ఆశ్చర్యపరుస్తాయి. ఔత్సాహిక ఖగోళ ప్రేమికులనైతే మరింత అబ్బురపరుస్తాయి. అలాంటి దృశ్యమే ఒకటి రేపు (జూన్ 11) ఆకాశంలో ఆవిష్కృతం కాబోతోంది. ఈ నెలలో వచ్చే పౌర్ణమిని ‘స్ట్రాబెర్రీ మూన్’ (Strawberry Moon) అని పిలుస్తారు. స్ట్రాబెర్రీ మూన్ ప్రక్రియ జూన్ 10న రాత్రే ప్రారంభమయ్యి, జూన్ 11న తెల్లవారుజామున 2:44 గంటలకు జాబిల్లి గరిష్ఠ ప్రకాశ స్థాయికి చేరుతుందని ఖగోళ డేటా, సమాచారాన్ని పంచుకునే ‘ఓల్డ్ ఫార్మర్స్ ఆల్మానాక్’ (Old Farmer’s Almanac) వెల్లడించింది.
Read this- Russia Vs Ukraine: రాత్రికి రాత్రే.. ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద దాడి
అసలు ఈ పేరు ఎలా వచ్చింది?
ఉత్తర అమెరికాలోని అల్గాన్‌క్వీన్ అనే తెగల నుంచి ‘స్ట్రాబెర్రీ మూన్’ పేరు వచ్చింది. అడవిలో లభ్యమయ్యే స్ట్రాబెర్రీలు తినడానికి సిద్ధంగా ఉన్నాయని గుర్తించేందుకు ఆ తెగవారు ఈ పౌర్ణమిని సూచికగా భావించేవారు. అందుకే ‘స్ట్రాబెర్రీ మూన్’ అని పిలుస్తారని అమెరికా మీడియా కథనాలు తెలిపాయి. యూరప్‌లో అయితే, దీనిని ‘హనీ (తేనె) మూన్, మీడ్ (సారాయి) మూన్ అని కూడా పిలుస్తారని వివరించాయి.
Read this- RCB for Sale: సంచలన పరిణామం.. అమ్మకానికి ఆర్సీబీ?
ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి?
ఆకాశంలో చందమామ ఎంత తక్కువ ఎత్తులో కనిపించనుందనేది ఈ ఏడాది స్ట్రాబెర్రీ మూన్ ప్రత్యేకతగా నిలువబోతోంది. చంద్రుడి కక్ష్య మార్గం క్షితిజ సమాంతరానికి తక్కువ కోణంలో ఈ ఖగోళ అద్భుతం సాక్షాత్కారమవుతుంది. చంద్రుడి వక్రగతి, వంపు ఫలితంగా ఇది జరగనుంది. ఇది అరుదైన ఖగోళ దృగ్విషయమని, దీనిని ‘లూనార్ స్టాండ్‌స్టిల్’ అని పిలుస్తారని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తికి ఉండే లాక్కునే స్వభావంతో ప్రతి 18.6 ఏళ్లకు ఒకసారి ఈ ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. చంద్రుడి కక్ష్య ప్రస్తుతం ఒక బిందువు వద్ద ఉందని, దాని కారణంగా జాబిల్లి ఉదయించడం లేదా అస్తమించడం చాలా తక్కువ ఎత్తులో జరుగుతుందని లాస్ ఏంజిల్స్‌లోని గ్రిఫిత్ అబ్జర్వేటరీకి చెందిన ఖగోళ శాస్త్రజ్ఞులు వివరించారు.
Read this- Boy Swallows Bulb: బాబోయ్.. 9 నెలల చిన్నారి బొమ్మ ఫోన్‌తో ఆడుకుంటూ..
మళ్లీ 2043లోనే..
2006 తర్వాత తొలిసారి ప్రస్తుత జూన్ నెలలో చందమామ కక్ష్య చాలా తక్కువ ఎత్తులో ఉండనుందని, ఈ ఖగోళ దృశ్యం తిరిగి 2043లోనే జరగనుందని ‘ఎర్త్ స్కై’ కథనం పేర్కొంది. చంద్రుడి మార్గం తక్కువ ఎత్తులో ఉండడమంటే, భూవాతావరణంలో ఉన్నట్టే అవుతుంది. కాబట్టి చందమామ మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అంతేకాదు, సాధారణం కంటే ఎక్కువ ఎర్రగా, లేదా నారింజ రంగులో దర్శనమిస్తుంది. చంద్రుడి రంగు ఈ విధంగా మారడాన్నే ‘స్ట్రాబెర్రీ మూన్’ అని పిలవడానికి కారణం. జూన్ 11న తెల్లవారుజాము వరకు పౌర్ణమి ఉంటుంది. ఈ దృశ్యం దాదాపు రెండు దశాబ్దాల దాకా మళ్లీ కనిపించదు.