RCB for Sale
Viral, లేటెస్ట్ న్యూస్

RCB for Sale: సంచలన పరిణామం.. అమ్మకానికి ఆర్సీబీ?

RCB for Sale: ఏకంగా 18 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ 2025 (IPL 2025) ఎడిషన్ టైటిల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు గెలుచుకుంది. కానీ, ట్రోఫీ సాధించిన ఆనందాన్ని కనీసం ఒక్క రోజు కూడా ఆస్వాదించకముందే తీవ్ర వివాదాన్ని ఫ్రాంచైజీని చుట్టుముట్టింది. విజయోత్సవ కార్యక్రమం భారీ తొక్కిసలాటకు దారితీసింది. ఏకంగా 11 మంది అభిమానులు మృత్యువాతపడ్డారు. 47 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిర్లక్షపూరితంగా వ్యవహరించి అభిమానుల మృతికి కారణమయ్యారంటూ ఆర్సీబీ ఫ్రాంచైజీపై బెంగళూరు సిటీ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆ జట్టు మార్కెటింగ్ హెడ్‌తో పాటు మరో ఇద్దరు అధికారులను అరెస్ట్ కూడా చేశారు. ఈ తీవ్ర వివాదం నేపథ్యంలో ఆర్సీబీ ఓవర్ ‘డయాజియో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ’ (Diageo Plc) ఫ్రాంచైజీని విక్రయించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

పాక్షికంగా లేదా సంపూర్ణంగా…
ఆర్సీబీ ఫ్రాంచైజీని పాక్షికంగా లేదా, సంపూర్ణంగా అయినా సరే విక్రయించాలని డియాజియో యాజమాన్యం భావిస్తున్నట్టు ఈ వ్యవహారంపై సమాచారం ఉన్న వర్గాలు తెలిపాయి. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జట్టు ఐపీఎల్ టైటిల్ గెలిచి ప్రశంసలు అందుకుంటున్న సమయంలో ఈ నిర్ణయానికి వచ్చినట్టు జాతీయ మీడియా సంస్థలో కథనాలు వెలువడుతున్నాయి.

Read this- Boy Swallows Bulb: బాబోయ్.. 9 నెలల చిన్నారి బొమ్మ ఫోన్‌‌తో ఆడుకుంటూ..

కంపెనీ ఇప్పటికే పలువురు పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతున్నట్టు పేర్కొంది. ఫ్రాంచైజీ విలువ ఎంత ఉంటుందనే దానిపై ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు. ఒకవేళ ఫ్రాంచైజీని సంపూర్ణంగా అమ్మకానికి పెడితే 2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.16,834 కోట్లు) వరకు ధర పలకవచ్చని ‘బ్లూమ్‌బెర్గ్ కథనం’ అంచనా వేసింది. పాక్షికంగా విక్రయించాలా?, లేక పూర్తిగా అమ్మేయాలా? అనేదానిపై యజమానులు సమాలోచనలు చేస్తున్నారని ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న వర్గాలు వెల్లడించాయి. ఆర్సీబీని డయాజియో పీఎల్‌సీ నిర్వహిస్తుండగా, ఈ కంపెనీకి యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్, బ్రిటిస్ డిస్టిలర్ మాతృసంస్థలుగా ఉన్నాయి. టైటిల్ గెలుచుకున్న నేపథ్యంలో ఎక్కువ ధరకు విక్రయించడానికి అవకాశం ఉంటుందని కంపెనీ భావిస్తోంది. సలహాలు, సూచనల కోసం సలహాదారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఫ్రాంచైజీని విక్రయించాలా వద్దా అనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయినప్పటికీ, ఆర్సీబీని విక్రయించబోతున్నారనే వార్తలు వెలువడగా, యునైటెడ్ స్పిరిట్స్ షేర్లు ఒక్కసారిగా భారీ లాభాల్లో పయనిస్తున్నాయి. మంగళవారం ఉదయం స్టాక్ ధర 3.3 శాతం మేర దూసుకెళ్లింది.

Read this- GHMC – Hydraa: జీహెచ్ఎంసీకి ఆ బాధ్యతలు కట్.. ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

డయాజియో ఎలా దక్కించుకుంది?

డయాజియో ఎలా దక్కించుకుంది?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీ ప్రస్థానం 2008లో మొదలైంది. అప్పట్లో కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను నిర్వహించిన విజయ్ మాల్యా తొలుత ఆర్సీబీని కొనుగోలు చేశారు. దేశీయ లిక్కర్ ఇండస్ట్రీలో ప్రముఖ వ్యక్తిగా ఉన్న రోజుల్లో ఆయన దీనిని దక్కించుకున్నారు. అయితే, తన వ్యాపార సామ్రాజ్యం దెబ్బతినడం, ఆ తర్వాత క్రమంగా ఆయన అప్పుల్లో కూరుకుపోయారు. ఆ పరిస్థితుల్లో ఆర్సీబీని కొనుగోలు చేసే అవకాశం డయాజియో సంస్థకు దక్కింది. యునైటెడ్ స్పిరిట్స్ సంస్థకు భారత్‌లో అనుబంధ సంస్థగా ఉంటూ దీనిని దక్కించుకుంది. కాగా, ఐపీఎల్ ఫ్రాంచైజీలలో అత్యధిక ఫాలోయింగ్ కలిగిన జట్లలో ఒకటిగా ఆర్సీబీ ఉంది. సోషల్ మీడియాలో కూడా ఈ టీమ్‌ని ఫాలో అయ్యేవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉన్నారు. ఐపీఎల్ హిస్టరీలో ఏకంగా 18 ఏళ్లపాటు ట్రోఫీని సాధించలేకపోయినప్పటికీ, జట్టు ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. పైగా, ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. విరాట్ కోహ్లీతో పాటు పలువురు స్టార్ క్రికెటర్లు ఈ జట్టుకి ప్రాతినిధ్యం వహించడం ఇందుకు కారణంగా ఉంది.

Just In

01

IAS Shailaja Ramaiyer: కమిషనర్ శైలజా రామయ్యర్ కు కీలక బాధ్యతలు..?

Mahabubabad District: యూరియా టోకెన్ల కోసం కిక్కిరిసి పోయిన రైతులు.. ఎక్కడంటే..?

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Gadwal District: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం.. నది ప్రవాహంలో బాలుడు గల్లంతు

Bigg Boss 9 Telugu Promo: డబుల్ హౌస్ తో.. డబుల్ జోష్ తో.. ప్రోమో అదిరింది గురూ!