Near Death Experience: మనిషి మరణానికి దగ్గరయ్యాక ఏం జరుగుతుంది?, వారు ఎలాంటి అనుభూతి చెందుతారు?.. ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి రేకెత్తించే ఈ ప్రశ్నలకు శాస్త్రీయపరంగా నిర్దిష్టమైన సమాధానమేమీ లేదు. కానీ, అమెరికాకు చెందిన ఓ మహిళ వైద్యపరంగా సుమారు 8 నిమిషాలపాటు చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కానీ, అనూహ్యంగా తిరిగి బతికిన ఆమె, ఆ ఎనిమిది నిమిషాలలో ఎదురైన అనుభూతిని పంచుకుంది. శరీర అచేతన స్థితికి మరోవైపున ఉన్నట్టుగా అనిపించిందని అమెరికాలోని కొలరాడోకు చెందిన 33 ఏళ్ల బ్రియాన్నా లాఫెర్టీ చెప్పింది. తన మృతదేహం మీద నుంచి తాను తేలిపోతున్నట్టుగా అనిపించిందని, శరీరాన్ని వదిలిపెట్టి పోతున్నట్టుగా అనిపించిందని తెలిపింది. కాలమంటూ (Time) లేని ఒక లోకంలోకి ప్రవేశించినట్టు అనిపించిందని ఆమె తెలిపింది.
Read this- Honeymoon Tragedy: మరో హనీమూన్ జంట మాయం.. 12 రోజుల నుంచి మిస్సింగ్
సిద్ధమేనా అని వాయిస్
సిద్ధమేనా అని అడుగుతూ ఒక వాయిస్ కూడా వినిపించిందని, ఆ తర్వాత అంతా చీకటిమయంగా మారిందని బ్రియాన్నా చెప్పింది. శరీరం జీవచ్ఛంలా మారినప్పటికీ, ఆత్మ (Consciousness) మాత్రం చనిపోలేదని ఆమె వివరించింది.
కాగా, బ్రియాన్నా ప్రాణాంతక నాడీ సంబంధిత వ్యాధితో బాధపడింది.
మరణం ఒక భ్రమ
ఆత్మ ఎప్పటికీ మరణించదని, కాబట్టి మరణం అనేది ఒక భ్రమ అని బ్రియాన్నా అభిప్రాయపడింది. ఆత్మ సజీవంగా ఉంటుందని, రూపాంతరం చెందుతుందని ఆమె పేర్కొంది. ఆలోచనలన్నీ మరణానంతర జీవితంలో వెంటనే కార్యరూపం దాల్చుతాయని, వ్యక్తుల ఆలోచనలన్నీ వాస్తవికతకు రూపమిస్తాయని తాను గ్రహించినట్టు ఆమె పేర్కొంది. ఈ విషయాలు బ్రియాన్నా చెప్పినట్టు ‘ది మిర్రర్’ కథనం పేర్కొంది. ‘‘నేను సడెన్‌గా నా భౌతిక రూపం నుంచి దూరమయ్యాను. నేను నా మనిషి రూపాన్ని చూసుకోలేదు. కనీసం గుర్తుంచుకోలేదు. ఆత్మ ద్వారా పూర్తి సజీవంగా, స్పృహతో, గతం కంటే ఎక్కువగా నన్ను నేను గ్రహించాను. నాకు ఎలాంటి నొప్పి కలగలేదు. భూమి అంతిమం కాదని నేను గుర్తించా. మనుషుల కంటే ఉన్నతమైన ఉనికి, తెలివితేటలు ఉన్నాయి. అవే మనల్ని ప్రేమతో నడిపిస్తున్నాయి’’ అని బ్రియాన్నా చెప్పింది.
Read this- RCB Stampede: హైకోర్టుకు వెళ్లిన ఆర్సీబీ.. ఎందుకో తెలుసా?
చనిపోయాక ఏమౌతుంది?
మనిషి మరణానికి దగ్గరైన సంక్లిష్ట సమయంలోగా ఏం జరుగుతుందో అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికే కొన్ని అధ్యయనాలు చేపట్టారు. కానీ, స్పష్టంగా ఏమీ చెప్పలేదు. కానీ, 2022లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, మరణం అంచున నిలిచినప్పుడు మానవ మెదడు జీవితంలోని ముఖ్యమైన ఘటనలను త్వరగా తిరిగి గుర్తుచేసుకోగలదని, చాలామందికి వారి జీవితం కళ్ల ముందు కదలాడుతుందని పేర్కొంది. ఇక, కెనడాలోని కాల్గరీ విశ్వవిద్యాలయం పరిశోధకులు గత నెలలో ఒక ఆసక్తికరమైన అధ్యయనాన్ని ప్రచురించారు. దాని ప్రకారం, ప్రాణులు తమ జీవితాంతం ఒక అసాధారణ మసక కాంతిని విడుదల చేస్తాయని, చనిపోయినప్పుడు మాత్రమే ఆ కాంతి కనుమరుగు అవుతుందని పేర్కొన్నారు. ఈ కాంతి అల్ట్రావీక్ ఫోటాన్ ఎమిషన్ (UPE) అనే దృగ్విషయంతో ముడిపడి ఉంటుందని పేర్కొన్నారు.