Hesitation-in-Mulugu
నార్త్ తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Mulugu: కేటీఆర్ సారీ చెప్పాలంటూ ఆదివాసీ నవనిర్మాణ సేన ధర్నా.. ఎందుకంటే?

Mulugu: కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని భారీ ర్యాలీ

ములుగు జిల్లా కలెక్టర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం

రైతులతో రాస్తారోకో నిర్వహించిన ఆదివాసీ నవనిర్మాణ సేన
రైతులు చనిపోతే కేటీఆర్‌కు కన్నీళ్లు ఎందుకు రాలేదు?
ప్రశ్నించిన ఏఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి

ములుగు స్వేచ్ఛ: ములుగు (Mulugu) జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదివాసీ నవనిర్మాణ సేన (ఏఎన్ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కొర్స నరసింహమూర్తి డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కలెక్టర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, మల్టీ నేషనల్ మొక్కజొన్న విత్తన కంపెనీ ఆర్గనైజర్ గొడవర్తి నర్సింహా మూర్తికి వ్యతిరేకంగా గురువారం ధర్నా నిర్వహించారు. ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో వెంకటాపురం మండల కేంద్రంలో రైతులు, ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. గంటసేపు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వెంకటాపురం మండలంలో బైక్ ర్యాలీ చేసి ధర్నా చేపట్టారు. కలెక్టర్ జోలికి వస్తే బీఆర్ఎస్‌ను ఏజెన్సీలో రెడ్‌బుక్‌లో పెడతామని హెచ్చరించారు.

అనంతరం కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం చేసి కలెక్టర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ.. బహుళ జాతి మొక్కజొన్న విత్తన కంపెనీల చేతుల్లో మోసపోయి నష్టపోయిన రైతులకు రూ.5 కోట్ల నష్టపరిహారం ఇప్పిస్తే కలెక్టర్‌ను పింక్ బుక్‌లో పెడతారా q. అని కేటీఆర్‌పై ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహామూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ఆదివాసీ రైతులకు, ప్రజలకు న్యాయం చేసే అధికారులపై ఇలాంటి దుర్మార్గపు పనులకు ఒడి కడతారా?, అధికారం పోయినా మార్పు రాలేదా? అని ప్రశ్నించారు. రాజకీయ విమర్శలు అధికార ప్రతిపక్ష పార్టీలపైన చేసుకోవాలని, కానీ దివాకర టీఎస్ లాంటి అధికారులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు.

Read Also- TSRTC: టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఈ నెల 20 నుంచి అక్టోబ‌ర్ 2 వరకు..

ప్రజలు అధికారం ఇస్తే అధికారులపై కక్ష కట్టడం దిక్కుమాలిన చర్య అని విమర్శించారు. బహుళ జాతి విత్తనోత్పత్తి కంపెనీలను అడ్డు పెట్టుకొని ఏజెన్సీ రైతులను ఆర్థికంగా దోపిడీ చేస్తూ రూ.కోట్లు సంపాదించి రైతుల ఆత్మహత్యలకు కారణం అయిన దళారీ మాటలు తమరికి కన్నీళ్లు తెప్పించాయా? అని నర్సింహమూర్తి ప్రశ్నించారు. బహుళజాతి కంపెనీల మోసాలకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డ ఆదివాసీ రైతుల విషయంలో  ఎందుకు కన్నీళ్లు రాలేదంటూ బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్‌ను నిలదీశారు. గొడవర్తి నర్సిం మూర్తి ఏజెన్సీ రైతులను కోట్ల రూపాయలకు ముంచినందుకు కే‌టీఆర్ అతడి ముందు శిరస్సు వంచి నమస్కరించారా? అని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ప్రజల పక్షాన నిజాయితీగా పని చేసిన ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌పై ఇలాంటి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన హితువు పలికారు. జిల్లా కలెక్టర్ ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి అని అన్నారు. ఆదివాసీ గూడెల్లో పాఠశాలలు, వైద్య సదుపాయం లేకపోతె కంటైనర్ పాఠశాలలు, కంటైనర్ హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేసి విద్యా వైద్య సదుపాయాలు అందిస్తున్న కలెక్టర్‌ని ఏదైనా చేయాలని చూస్తే ప్రజలు మరోసారి స్థానిక ఎన్నికల్లో బుద్ది చెప్తారని అన్నారు.

Read Also- Daksha: ‘దక్ష’తో హ్యాట్రిక్.. మంచు లక్ష్మి కాన్ఫిడెంట్ చూశారా!

ప్రజలు ఓడించినా ఇంకా బుద్ది రాలేదా అని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఆదివాసీలపై దమనకాండ కొనసాగించిన బీఆర్ఎస్ పార్టీ, అధికారం పోయినా ఆదివాసీలపై అక్కసు పోలేదని నరసింహమూర్తి అన్నారు. ఆదివాసీల పక్షాన పని చేసిన కలెక్టర్లు బీడీ శర్మ, ఎస్‌ఆర్ శంకరణ్, వీపీ గౌతమ్, ప్రవీణ్ ప్రకాశ్, గిరిధర్, యోగితా రానా, దివ్య దేవరాజన్‌లను ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారని ఈ సందర్బంగా గుర్తు చేశాారు. ములుగు జిల్లా కలెక్టర్‌గా వచ్చిన దివాకర టీఎస్ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు. 1/70 చట్టం కారణంగా గిరిజనేతరులకు ఏజెన్సీలో ఎటువంటి హక్కు ఇవ్వలేదని, వలస గిరిజనేతరులకు ఏజెన్సీలో ఆస్తి హక్కు రద్దు అయిందని అన్నారు. ఆస్తి హక్కు రద్దు అయినప్పుడు కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడివి అని ఆయన ప్రశ్నించారు. ఎల్ టి ఆర్ చట్టాన్ని ఉల్లాంఘించి వందల ఎకరాల భూములు కబ్జా చేసి బి ఆర్ ఎస్ కు దార దత్తం చేస్తే ఆదివాసీలు ఊరుకోరని హెచ్చరించారు.

రైతులకు న్యాయం జరగడానికి కలెక్టర్ దివాకరా టి ఎస్ తో పాటు వ్యవసాయ మంత్రి తుమ్ముల, జాతీయ ఎస్టీ కమిషన్ జాటోత్ హుస్సేన్, రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, జిల్లా మంత్రి సీతక్క అని రైతులు తెలిపారు. కలెక్టర్ చిత్ర పటానికి రైతులు మహిళలు పాలాభిషేకం చేసారు. కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం చేసారు. కే టి ఆర్ డౌన్, డౌన్ అని నినాదాలు చేసారు. కే టి ఆర్, గుడవర్తి నర్సింహా మూర్తి రైతులకు, కలెక్టర్ కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, గుదవర్తిని తక్షణమే పార్టీ నుండి బహిస్కరించాలని డిమాండ్ చేసారు. గుడవర్తి ఆస్తులపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా అధ్యక్షులు కుంజ మహేష్, మండల అధ్యక్షులు ముర్రం రాజేష్, వాజేడు మండల అధ్యక్షులు మోడెం నాగరాజు, వాసం నారాయణ, ఇసుక సహకార సంఘాల జిల్లా అధ్యక్షులు ముర్రం రామలక్ష్మి, నాయకులు పద్మ, చిలకమ్మా, సుశీల, అపర్ణ, కాక రాజు, ఇర్ప బాబు రైతులు, ఆదివాసీ ఇసుక సహకార సంఘాల మహిళలు, ప్రజలు యువత పాల్గొన్నారు.

Just In

01

Money Fraud: కాన్ఫరెన్స్‌‌లో అమిత్ షా, అజిత్ దోవల్‌ ఉన్నారంటూ మాట్లాడించి.. బంధువుకు కుచ్చుటోపీ

OG release issue: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాకు అక్కడ ఎదురుదెబ్బ!.. ఎందుకంటే?

CM Revanth Reddy: కుంభమేళాకు వేల కోట్లు కుమ్మరిస్తున్నారు.. మరి మేడారానికి ఏవి?

Pruthivi Raj – Dulquer: లగ్జరీ కార్ల పన్ను ఎగవేత.. మలయాళం స్టార్స్ ఇళ్లల్లో మెరుపు దాడులు

Hyderabad Floods: దేవరకొండ బస్తీలోనీ ఇండ్లలోకి నీళ్లు.. ముంపు నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశం