Kamareddy District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Kamareddy District: ఒకప్పుడు పేపర్ బాయ్.. కానీ ఇప్పుడు అందరికీ ఆదర్శం.. ఎవరతను?

Kamareddy District: పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపించారు కామారెడ్డి(Kamareddy) జిల్లా పిట్లంకు చెందిన అబ్దుల్ మతీన్(Abdul Mateen). చిన్నతనంలోనే తండ్రి అబ్దుల్ హమీద్‌ను కోల్పోయి, పినతండ్రి అబ్దుల్ మజీద్, అన్నయ్య అబ్దుల్ మాలిక్ పర్యవేక్షణలో పెరిగారు. ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా చదువును మాత్రం మానివేయలేదు. పిట్లం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూనే పేపర్ బాయ్‌(Paper Boy)గా పనిచేసి, తన జీవితాన్ని కష్టపడి ముందుకు నడిపించారు.

పెట్టుబడిదారులపై ఒక అధ్యయనం
హైదరాబాద్‌(Hyderabad)కు వెళ్లి ఉస్మానియా యూనివర్సిటీ(OU)లో MBA, M.Com పూర్తి చేశారు. ప్రస్తుతం, ఒక ప్రఖ్యాతిగాంచిన డిగ్రీ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన “రియల్ ఎస్టేట్(Real estate) పెట్టుబడులపై ప్రవర్తనా అంశాల ప్రభావాన్ని అన్వేషించడం, హైదరాబాద్ పెట్టుబడిదారులపై ఒక అధ్యయనం” అనే అంశంపై Ph.D. పూర్తి చేశారు.

Also Read: Jangaon Crime: జనగామ జిల్లాలో ఘోరం.. తల్లి కూతురు దారుణ హత్య!

పేదరికం అడ్డు కాదు
సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఉషా కిరణ్(Usha Kiran) ఆధ్వర్యంలో మతీన్ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. తన విజయం గురించి అబ్దుల్ మతీన్ మాట్లాడుతూ.. “తలచుకుంటే ఏదైనా సాధించవచ్చు, పేదరికం(Poverty) ఉన్నా కష్టపడితే ఉన్నత స్థాయికి ఎదగవచ్చు” అని పేర్కొన్నారు. తన పట్టుదల, కష్టంతో పేదరికాన్ని జయించి ఉన్నత స్థాయికి ఎదిగిన అబ్దుల్ మతీన్(Abdul Mateen) ఎందరికో ఆదర్శంగా నిలిచారు. మతీన్ డాక్టరేట్ పట్టా పొందడంపై ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.

Alsom Read: Sand Scam: ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇసుక దందా.. పట్టించుకోని అధికారులు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు