Jurala project: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలలో నీటి నిల్వలు గరిష్ట స్థాయికి చేరడంతో అక్కడి అధికారులు నీటిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వదులుతున్నారు.దీంతో జూరాలకు మరో సారి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.
Also Read: Students Protest: ఆర్టీసీ బస్సుల సర్వీసులు పెంచాలని విద్యార్థుల నిరసన
9 క్రస్ట్ గేట్స్ ఓపెన్.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టు (Jurala Project )పన్నెండు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని వదులుతున్నారు. ఇన్ ఫ్లో 82 వేల క్యూసెక్కులు నమోదు అవుతుండగా ఔట్ ఫ్లో 72 వేల 142 క్యూసెక్కులు ఉంది. ఇందులో జూరాల జల విద్యుత్ ఉత్పత్తికి 34,149 క్యూసెక్కుల నీటిని వదులుతుండగా,నెట్టెంపాడు లిఫ్ట్ కు 750 క్యూసెక్కులు, ఎడమ ప్రధాన కాలువకు 550 క్యూసెక్కులు, కుడి ప్రధాన కాలువకు 480 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్ 2 కు750 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ లిఫ్ట్ కు 315 క్యూసెక్కులు, సమాంతర కాలువకు 200 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 45 క్యూసెక్కుల నీరు పోతుంది.ప్రాజెక్టు(Jurala Project) పూర్తిస్థాయి నీటిమట్టం 318.516. మీటర్లు ఉండగా ప్రస్తుత నీటిమట్టం..317.630 మీటర్ల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 7.894 టీఎంసీలుగా కొనసాగుతోంది.జూరాల ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాలలో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
సుంకేసుల బ్యారేజీకి తగ్గిన వరద
రాజోలికి సమీపంలోని సుంకేసుల బ్యారేజీకి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. బ్యారేజీకి 36 వేల క్యూసెక్కులు వస్తోంది. దీంతో బ్యారేజీ 8 గేట్లను ఒక మీటర్ మేర ఎత్తి 34,655 క్యూసెక్కులు, కేసీ కెనాల్ కు 1847 క్యూసెక్కులు వదులుతుండగా మొత్తం ఔట్ ఫ్లో 36 వేల 335 క్యూసెక్కులన్నిటిని శ్రీశైలం వైపు వదులుతున్నారు.
Also Read:Jurala Accident: జూరాల వద్ద విషాదం.. కొంపముంచిన సెల్ ఫోన్ డ్రైవింగ్