Kothagudem: కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు(Rohith raju) ఎదుట మావోయిస్టు పార్టీకి చెందిన 8 మంది దళ సభ్యులు లొంగిపోయారు. నిషేధిత మావోయిస్టు పార్టీలో మొనగాడకు అవకాశం లేదని ఉద్దేశంతో దళంలో పనిచేస్తున్న ఎనిమిది మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పోలీసులు, 81 అండ్ 141 సిఆర్పిఎఫ్ బెటాలియన్ అధికారులు ఆదివాసి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిర్వహిస్తున్న ఆపరేషన్ చేయుట కార్యక్రమానికి మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వారు ఆకర్షితులై లొంగిపోతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ కల్పిస్తున్న సదుపాయాల నేపథ్యంలో నక్సల్ నిజాన్ని వీడనాడి తాము కుటుంబ సభ్యులకు కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకొని వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న 8 మంది నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగిపోయినట్లు వెల్లడించారు. లొంగిపోయిన ఎనిమిది మందిలో ఒక మహిళా సభ్యురాలు ఉన్నట్లు చెప్పారు.
Also Read: Suryapet: నకిలీ మద్యం లేబుళ్ల తయారీ.. లక్షల విలువ చేసే యంత్ర సామాగ్రి సీజ్
ఆపరేషన్ చేయూత… లొంగిపోయిన మావోయిస్టులకు చేయూతనిస్తుంది
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పోలీస్ శాఖ అమలు చేస్తున్న ఆపరేషన్ చేయూత కార్యక్రమం లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులకు అత్యంత చేయూతనిస్తుందని ఎస్పీ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. ఆదివాసి గ్రామాల్లో రోడ్లు, పాఠశాలలు, వైద్యశాలలు, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యాలను కల్పించి వారి అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) నుంచి అయిదుగురు, మొత్తం తెలంగాణ రాష్ట్రం నుండి 81 మంది మావోయిస్టు పార్టీలో వివిధ రాష్ట్రాల్లో సభ్యులుగా ఉన్నారని తెలిపారు.
తెలంగాణ పోలీస్ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem District) పోలీస్ ఆధ్వర్యంలో మావోయిస్టు పార్టీలో సభ్యులుగా పనిచేస్తున్న వారిని విడనాడి ఇకపై కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవితం గడపాలని విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో లొంగుబాటు బాటను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. ఆదివాసి ప్రజలు నమ్మకంతోనో, భయంతోనూ మావోయిస్టు పార్టీకి ఎంత సహకరించిన ఆదివాసి ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవని వెల్లడించారు. కేవలం ప్రజాస్వామ్య ప్రభుత్వం ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. అభివృద్ధి తో కూడిన ప్రజల శాంతియుత జీవనమే పోలీసుల ప్రధాన నినాదం అన్నారు. లొంగిపోయిన ఎనిమిది మంది దళ సభ్యులకు తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి 25వేల నగదు చొప్పున మొత్తం 2లక్షల రూపాయలను అందజేశామని తెలిపారు.
Also Read: AP New Bar Policy: మందుబాబులకు తీపి కబురు.. రాత్రి 12 గంటల వరకూ మద్యం అమ్మకాలు
