Maoists killed: ఆపరేషన్ కగార్ చేంజ్ చేసుకుంది. కేంద్ర, చత్తీస్గడ్ రాష్ట్ర రాష్ట్ర భద్రతా బలగాలు ఆపరేషన్ కగారులో భాగంగా ములుగు జిల్లా వెంకటాపురం శివారు కర్రెగుట్టల ప్రాంతంలో దాదాపు 19 రోజులపాటు కూంబింగ్ నిర్వహించిన వివిధ రకాల సాయుధ బలగాలు కేంద్రం ఆదేశాలతో రూటు మార్చుకున్నారు. చత్తీస్గడ్ తో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాలకు గుహల నుంచి తప్పించుకుపోయిన మావోయిస్టులను వెంటాడుతూనే ఉన్నారు. సోమవారం నలుగురు మావోలని మట్టు పెట్టిన భద్రత బలగాలు మంగళవారం తెల్లవారుజాము నుంచి జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం కలిగినట్లు సమాచారం.
30 మందికి పైగా మావోయిస్టు హతం…
చత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా శివారు లంకపల్లి సమీపంలో మంగళవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎన్కౌంటర్లో దాదాపు 30 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారికంగా భద్రతా బలగాలు వెల్లడించాయి. మృతి చెందిన 30 మందిలో 24 మంది మృతదేహాలు లభ్యమైనట్లుగా కూడా బలగాలు వెల్లడించాయి. మరో ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలు ల్యాండ్ మైన్స్ పేలడంతో విడివిడి భాగాలుగా పడిపోవడంతో గుర్తించడం కష్టసాధ్యంగా ఉందని బలగాలు వివరిస్తున్నారు. ఆరు మృతదేహాల గుర్తింపు దాదాపు కష్టతరమేనని స్పష్టం చేస్తున్నారు.
Also Read: Karregutta Mulugu Effects: ఆదివాసీల ఊచకోతలు.. మావోయిస్టుల హింస.. కర్రెగుట్టల వాస్తవ కథనం!
కర్రెగుట్టల్లో నుంచి ఎంట్రీ… మహారాష్ట్ర, ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో ఎగ్జిట్
కర్రెగుట్టల ప్రాంతం నుంచి తప్పించుకుపోయిన మావోయిస్టులు మహారాష్ట్ర -చత్తీస్గడ్, ఆంధ్ర ప్రదేశ్ -ఒడిస్సా రాష్ట్రాల సరిహద్దుల నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కర్రెగుట్టల ప్రాంతం నుంచి కేంద్ర భద్రతా బలగాలు వెనక్కి రావాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఈ మేరకు ఐదు బృందాల సిఆర్పిఎఫ్ బలగాల్లో రెండు విభాగాల సాయుధ బలగాలు కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేశాయి. 141,146,81 లకు చెందిన సి ఆర్ పి ఎఫ్ బలగాలు చత్తీస్గడ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలకు తప్పించుకుపోయిన మావోయిస్టు దళాలను వెంటాడుతున్నారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్లుగా సమాచారం.
85 కిలోమీటర్ల మేర భారీ సొరంగాలు
కర్రెగుట్టల నుంచి ప్రారంభమైన భారీ సొరంగాలు దాదాపు 85 కిలోమీటర్ల మేర పొడవు ఉన్నట్లుగా తెలుస్తుంది. కేంద్ర, చత్తీస్గడ్ రాష్ట్ర భద్రతా బలగాలు కర్రెగుట్టల ప్రాంతాన్ని చుట్టి ముట్టినప్పుడు ఈ గుహలనుంచే మావోయిస్టులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే కర్రెగుట్టల ప్రాంతంలో భారీ కూంబింగులు నిర్వహించిన భద్రతా బలగాలు తమ ఆపరేషన్ కగార్ లో భాగంగా రూట్ చేంజ్ చేశారు.
Also Read: Cyber Criminals Arrest: సైబర్ కేటుగాళ్లకు బ్యాండ్ బాజా.. రూ.4.37 కోట్లు వెనక్కి!
మహారాష్ట్ర, ఛత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతంలో మహారాష్ట్ర బామ్రాగడ్ ప్రాంతంలో c60 కమాండోస్ అంత మావోయిస్టుల కోసం ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రానికి సంబంధించిన మరో మూడు విభాగాల సిఆర్పిఎఫ్ భద్రత బలగాలు బీజాపూర్లో విస్తృతంగా మావోయిస్టుల కోసం సెర్చ్ చేస్తున్నట్లు సమాచారం ఉంది. కర్రెగుట్టల ప్రాంతాల నుంచి సొరంగలలో ప్రయాణిస్తున్న మావోయిస్టులకు హెలికాప్టర్ల ద్వారా వేసిన బాంబులకు కొన్ని చోట్ల మూసుకుపోయినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే అక్కడక్కడ కొంతమంది మావోయిస్టులు భద్రతా బలగాలకు చిక్కడంతో ఎదురు కాల్పులు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలానికి అతి సమీపంలో ఉన్న కర్రెగుట్టల ప్రాంతం వద్ద నిశ్శబ్ద వాతావరణం చోటుచేసుకుంది.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు