Cyber Criminals Arrest( IMAGE CREDIT: AL)
తెలంగాణ

Cyber Criminals Arrest: సైబర్ కేటుగాళ్లకు బ్యాండ్ బాజా.. రూ.4.37 కోట్లు వెనక్కి!

Cyber Criminals Arrest: రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సైబర్ క్రిమినల్స్​ పై పంజా విసిరారు. పది రోజులపాటు గుజరాత్​ లో స్పెషల్​ ఆపరేషన్​ జరిపిన రెండు బృందాలు దేశవ్యాప్తంగా 515 సైబర్​ మోసాలకు పాల్పడిన 2‌‌‌‌0మంది సైబర్​ నేరగాళ్లను అరెస్ట్​ చేశారు. ఒక్క మన రాష్ట్రంలోనే నిందితులు 60 నేరాలు చేసినట్టుగా సైబర్​ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ డీజీ షిఖా గోయల్​ తెలిపారు.

ఏయేటికాయేడు పెరిగిపోతున్న సైబర్​ మోసాలకు కళ్లెం వేయటానికి రాష్ట్ర సైబర్​ సెక్యూరిటీ బ్యూరో పటిష్ట చర్యలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా ఆయా కేసుల్లో బాధితులు పోగొట్టుకున్న డబ్బుకు సంబంధించిన లావాదేవీలపై నిఘా పెట్టారు.

 Alos Read: Ganja Seized: ఎక్సయిజ్ టాస్క్ ఫోర్స్ దాడులు.. 53 లక్షల విలువైన గంజాయి సీజ్!

సైబర్ క్రిమినల్స్​ ఏయే బ్యాంకుల నుంచి డబ్బు విత్​ డ్రా చేశారు? ఆయా ఖాతాల వివరాలను తెలుసుకున్నారు. ఇలా పక్కగా సమాచారాన్ని సేకరించిన అనంతరం సైబర్​ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీలు ఫణీందర్​, రంగారెడ్డిల నేతృత్వంలో సీఐలు మహేందర్​, రవికుమార్ లతో కూడిన రెండు బృందాలు గుజరాత్​ రాష్ట్రం సూరత్​ కు ఈనెల 1న వెళ్లాయి. ఎస్పీ దేవేందర్​ సింగ్​, డిప్యూటీ సూపరిండింటెంట్లు సూర్యప్రకాశ్​, హరికృష్ణల పర్యవేక్షణలో విచారణ చేపట్టాయి.

ఈ క్రమంలో సైబర్​ క్రిమినల్స్ కు బ్యాంక్​ ఖాతాలను సమకూర్చిన 14మందితోపాటు ఏజెంట్లుగా వ్యవహరించిన మరో 6గురిని అరెస్ట్​ చేశాయి. మొత్తం 27 బ్యాంక్​ ఖాతాల ద్వారా నిందితులు 4.37కోట్ల రూపాయలను విత్​ డ్రా చేసినట్టుగా గుర్తించాయి. ఒక్క తెలంగాణలో నమోదైన 5 కేసుల్లో 22.64లక్షల రూపాయలను చెక్కుల ద్వారా విత్ డ్రా చేసినట్టుగా నిర్ధారించుకున్నాయి. అరెస్ట్​ చేసిన నిందితుల్లో ప్రైవేట్​ ఉద్యోగులు, వ్యాపారులు, గుజరాత్​ రాష్ట్రం వాపీ బ్రాంచ్​ డీసీబీ బ్యాంకులో రిలేషన్​ షిప్​ మేనేజర్​ గా పని చేస్తున్న ఉద్యోగి ఉండటం గమనార్హం.

 Also Read: Ganja Seized: ఎక్సయిజ్ టాస్క్ ఫోర్స్ దాడులు.. 53 లక్షల విలువైన గంజాయి సీజ్!

ఇన్వెస్ట్​ మెంట్​, ట్రేడింగ్​ ఫ్రాడ్లతోపాటు పార్ట్​ టైం ఉద్యోగాల పేర సైబర్​ మోసగాళ్లు నేరాలు చేసినట్టుగా వెల్లడైంది. వీరి నుంచి 2‌‌0 మొబైల్​ ఫోన్లు, 28 సిమ్​ కార్డులు, 4 ఏటీఎం కార్డులు, 5 చెక్​ బుక్కులు, 2 పాన్​ కార్డులు, 2 రబ్బర్​ స్టాంపులతోపాటు పలు డాక్యుమెంట్లను సీజ్​ చేశారు.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు