WTC Final: సెమీ ఫైనల్లో ఓడిపోవడం లేదా ఫైనల్ మ్యాచ్‌లో మట్టికరవడం.. మైదానంలోనే ప్లేయర్లు కన్నీళ్లు పెట్టిన సందర్భాలెన్నో.. దురదృష్టం వెక్కిరించిన సందర్భాలు మరెన్నో.. హేమాహేమీలు ఉన్నప్పటికీ ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవని దుస్థితి. ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు తెరపైడింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025ను (ICC World Test Championship) దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. ఏకంగా 27 ఏళ్ల వ్యవధిలో తొలిసారి ఒక ఐసీసీ టైటిల్‌ను సఫారీలు సొంతం చేసుకున్నారు. ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును దక్షిణాఫ్రికా (Australia Vs South Africa) చిత్తు చేసింది.
సెకండ్ ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన ఐడెన్ మార్క్‌రమ్ (Aiden Markram) ఈ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు. చిరకాలం గుర్తిండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 207 బంతులు ఎదుర్కొని 136 పరుగులు సాధించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక, కెప్టెన్ తెంబా బావుమా కూడా అర్ధ శతకంతో రాణించాడు. రెండవ ఇన్నింగ్స్‌లో 134 బంతులు ఎదుర్కొని 66 పరుగులు సాధించాడు. వీరిద్దరూ కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో 282 పరుగుల భారీ లక్ష్యం సునాయాసంగా మారిపోయింది. దీంతో, నాలుగవ రోజున ఆట ముగిసింది. ఇక, బౌలింగ్‌లో కగిసో రబాడ మెరిశాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 9 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Read this- Ahmadabad Plane Crash: రంగంలోకి హైలెవెల్ కమిటీ.. అసలు విషయం బయటకు రానుందా?
గెలుపు నిజంగా అద్భుతం
నిజానికి ఐసీసీ టోర్నమెంట్లలో దక్షిణాఫ్రికాకు ఎదురైనన్ని నిరుత్సాహకర ఘటనలు మిగతా జట్లకు ఎదురుకాలేదని చెప్పాలి. ఉత్కంఠభరిత మ్యాచ్‌ల్లోనూ దురదృష్టం వెక్కిరించి కీలక మ్యాచ్‌ల్లో ఓడిపోయారు. వారి బాధను చూసి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు కూడా చలించిపోయారు. అయితే, డబ్ల్యూటీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్-2025లో మాత్రం దక్షిణాఫ్రికా జట్టు గురితప్పలేదు. కెప్టెన్ తెంబా బావుమా జట్టును విజయపథంలో నడిపాడు. ఎట్టకేలకు దక్షిణాఫ్రికా జట్టు చిరకాలవాంఛను నెరవేర్చాడు. 2024-25 టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో దక్షిణాఫ్రికా జట్టు వరుసగా 8 మ్యాచ్‌లు గెలిచి సంచలన రీతిలో ఫైనల్‌కు చేరుకుంది. క్రికెట్‌కు పుట్టనిల్లు అయిన లార్డ్స్ మైదానంలోనే ఆ జట్టు ఐసీసీ ట్రోఫీని ముద్దాడడం మరింత ఆసక్తికరంగా మారింది.
Read this- Israel Secret Plan: బయటపడిన ఇజ్రాయెల్ రహస్యం.. గుట్టుచప్పుడు కాకుండా..
స్కోర్ బోర్డు
దక్షిణాఫ్రికా రెండవ ఇన్నింగ్స్- ఐడెన్ మార్క్‌రమ్ 136 పరుగులు, రికెల్టన్ 6, వియాన్ ముల్డర్ 27, తెంబా బవూమా 66, స్టబ్స్ 8, డేవిడ్ బెడింగ్‌హమ్ 21 (నాటౌట్), కైల్ వెర్రీనైన్ 4 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ అత్యధికంగా 3 వికెట్లు తీయగా, కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, హేజల్‌వుడ్ చెరో వికెట్ తీశాడు.
ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్- లబూషేన్ 22 పరుగులు, ఖవాజా 6, గ్రీన్ 0, స్టీవ్ స్మిత్ 13, హెడ్ 9, వెబ్‌స్టర్ 9, అలెక్స్ క్యారీ 43, కమ్మిన్స్ 6, మిచెల్ స్టార్క్ 58 (నాటౌట్), లియోన్ 2, హేజల్‌వుడ్ 17 చొప్పున పరుగులు సాధించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడా 4 వికెట్లు, కేశవ్ మహారాజ్ 3, యన్‌సెన్, ముల్డర్, మార్క్‌రమ్ తలో వికెట్ చొప్పున తీశారు.
–ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకు ఆలౌట్, రెండవ ఇన్నింగ్స్ 207 ఆలౌట్.
–క్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకు ఆలౌట్, రెండవ ఇన్నింగ్స్ 282/5 వికెట్లు.