Unbelievable Creativity: తెలివితేటలు అందరికీ ఉంటాయి. కానీ, కొందరికి అధిక తెలివి ఉంటుంది. అలాంటివారి ఆలోచనలు కాస్త వింతగా, నవ్వొచ్చేలా అనిపించవచ్చు, కానీ సృజనాత్మకత మాత్రం నెక్స్ట్ లెవల్ (Unbelievable Creativity) అని అంగీకరించాల్సిందే. సోషల్ మీడియాలో రీసెంట్‌గా వైరల్‌గా మారిన ఒక వీడియోను చూస్తే ఎవరైనా ఈ విషయాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. ఇంట్లో డైలీ వాడే పాతబడిపోయిన వస్తువులను తిరిగి ఏదో ఒక పనికి ఉపయోగించుకోవడంలో భారతీయులను మించినవారు బహుశా ఈ ప్రపంచంలో మరెవరూ ఉండరేమో. ఈ తరహా కామెంట్లతో సోషల్ మీడియాలో ఇప్పటికే ఎన్నో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో మరొకటి వెలుగులోకి వచ్చింది.
అండర్‌వేర్‌తో స్లింగ్ బ్యాగ్
పాత దుస్తులను ఫ్లోర్ తుడుచుకోవడానికి ఉపయోగించడం, గాజు సీసాలను పూలకుండీలుగా వాడుకోవడం మన దేశంలో సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంటుంది. అయితే, సృజనాత్మకతకు మరింత పదును పెట్టిన ఓ మహిళ… పాతబడ్డ ఒక జత మెన్స్ అండర్‌వేర్స్‌తో ఒక చక్కటి స్లింగ్ బ్యాగ్ (భుజంపై వేలాడుదీసుకునే సంచి) తయారు చేసి ఆకట్టుకుంటోంది. అండర్‌వేర్స్‌ను తొలుత ఒక సంచి మాదిరిగా కుట్టి, ఆ తర్వాత దానిని భుజానికి తగిలించుకోవడానికి వీలుగా ఒక బెల్ట్ పట్టీని కుట్టింది. దానిని ఎంచక్కగా మార్కెట్ నుంచి కూరగాయలు మోసుకురావడానికి ఉపయోగిస్తోంది. ఇటీవల కూరగాయలు కొనడానికి ఇదే బ్యాగ్‌ను తీసుకొని మార్కెట్‌కు వెళ్లగా, ఎవరో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.
వైరల్‌గా మారిన ఆ వీడియోలో సదరు మహిళ మార్కెట్‌లో కొన్న కూరగాయలను, తాను తయారు చేసుకున్న సంచీలో వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఉన్న నిరిష్ట ప్రదేశం ఎక్కడో తెలియదు గానీ, గుజరాత్ రాష్ట్రంలో జరిగినట్టుగా వీడియోలో కనిపిస్తున్న స్కూటీని బట్టి చూస్తే అర్థమవుతోంది. ఈ వీడియో నెటిజన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ వీడియో చూసినవారు ఆశ్చర్యపోవడంతో పాటు కడుపుబ్బేలా నవ్వుకుంటున్నారు. కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని కామెంట్లు కూడా చేశారు.
Read Also- Mysterious Temple: ఏడాదిలో 15 రోజులు నీరు అదృశ్యం.. ఈ ఆలయం తెలంగాణలో ఎక్కడ ఉందో తెలుసా?
భారతీయ మహిళలు రోజురోజుకూ ఎదిగిపోతున్నారనే వ్యంగ్య క్యాప్షన్‌తో ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కెర్లు కొడుతోంది. వనరుల వినియోగం చాలా చక్కగా ఉందంటూ చాలా మంది నెటిజన్లు మెచ్చుకున్నారు. సుస్థిరాభివృద్ధి విధానమంటూ కొందరు మెచ్చుకున్నారు. కానీ, మరికొందరు మాత్రం జోకులు పేల్చుతూ కామెంట్లు పెట్టారు.
ఒక మహిళ తలచుకుంటే ఏమైనా చేయగలదు, ఆ విషయం ఈ రోజు నిరూపితమైందంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. పాపం భర్త.. ఇంట్లో తన అండర్‌వేర్స్ కోసం వెతుక్కుంటున్నాడో ఏమో అంటూ ఒకరు హాస్యాస్పదంగా స్పందించారు. మరో వ్యక్తి స్పందిస్తూ, ఈ సంచీని తాను అమెరికాలో 50 డాలర్లకు విక్రయిస్తానని అన్నాడు. ఎన్ని బ్రాండ్లు ఉన్నా.. ఈ ప్రపంచంలో సరికొత్త సృజనాత్మక కొదవే లేదని కొందరు పేర్కొన్నారు. మొత్తానికి అండర్‌వేర్స్‌తో తయారు చేసిన ఈ బ్యాగు ప్రస్తుతం నెట్టింట నవ్వులు పూయిస్తోంది.
Read Also- K Ramp review: కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’ థియేటర్లను ఫుల్ చేసిందా.. ఎలా ఉందంటే?
