Mysterious Temple: దేవుని గుట్ట పై నీరు సడెన్ గా అదృశ్యం అవుతున్నాయి. ఇతర దేశాల్లోనే కాకుండా.. మన దేశంలో కూడా వింత ప్రదేశాలు ఉన్నాయని తెలుసా. అలాంటి వాటిలో ఈ చెరువు కూడా ఒకటిగా చెప్పొచ్చు. ఆ కాలంలో ఇలాంటివి ఎలా సాధ్యం అని ప్రస్తుత నిపుణులకు కి కూడా అంతు చిక్కని రహస్యంగా ఉంది. ఎందుకంటే, ఒక కొండ గుట్టల మధ్య ఉన్న ఈ చెరువు లోని నీరు అదృశ్యం అవుతుంది. అసలు, ఈ చెరువులోని నీరు ఎక్కడికి పోతుంది? దాని వెనుకున్న మిస్టరీని ఇక్కడ తెలుసుకుందాం..
అక్కడ ఏడాదిలో 15 రోజులు నీరు అదృశ్యం..?
వరంగల్ జిల్లాకి 70 కిలో మీటర్ల దూరంలో కొత్తూరు అనే చిన్న గ్రామం ఉంది. ఈ ఊరికి 2 కిలో మీటర్ల దూరంలో దేవుని గుట్ట అనే ప్రదేశం ఉంది. ఈ గుడికి వెళ్ళాలంటే 1 కిలో మీటర్ వరకు వాగు లాంటి ప్రదేశంలోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న గుట్ట పై దాదాపు వంద ఎకరాల సమతల ప్రదేశం కనిపిస్తుంది. ఈ గుట్ట పైన ప్రాచీన ఒక ఆలయం ఉంది. దీని వెనుక భాగంలో చెరువు ఉంది. అయితే, ఈ చెరువులో ఎన్నో అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి. దీనికి ఒక వైపు కొండ రాళ్లు ఉన్నాయి. ఇది ఎండిపోవడం అసలు ఉండదు. కానీ, ఆశ్చర్యకరంగా వానా కాలంలో వర్షాలు పడకపోతే 15 రోజులు నీరు అదృశ్యం అవుతాయి. అసలు, ఈ చెరువు ఆ సమయంలోనే ఎందుకు ఎండి పోతుంది? అనేది ఎవరికీ అర్థం కాలేదు. ఇక్కడ ఏం జరుగుతుందా అని తెలుసుకోవడానికి కొందరు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇక చివరికి నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి.
ఆ నీటి ధార కొండల పై నుంచి కాకుండా రెండు అతి పెద్ద బండల నుంచి వస్తుండటం గమనించారు, అయితే, ఆ రెండు రాళ్లు చెరువుకి వ్యతిరేఖ దిశలో చెరువు లోపల 50 అడుగుల దూరంలో ఉన్నాయి. చెరువుకి, రాళ్ళకు, నీళ్ళకు ఏమైనా సంబంధం ఉందా అని చెరువుకి రెండు వైపులా పరిశోధించారు. ఆ సమయంలో చెరువు లోపల వైపు చిన్న సొరంగం కనిపించింది. దాని పై నుంచి రాళ్ళను తొలగించి చూస్తే ,లోతు తెలియలేదు కానీ, లోపల నీళ్ళ శబ్దం వినిపించిందని చెప్పారు.
