Rajastan Case
Viral, లేటెస్ట్ న్యూస్

Viral News: అనారోగ్యంతో భర్త చనిపోయాడన్న భార్య.. 9 ఏళ్ల కొడుకు సాక్ష్యంతో సంచలనం

Viral News: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారంటూ కట్టుకున్న భాగస్వాములనే అంతమొందిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో బాగా ఎక్కువైపోయాయి. రాజస్థాన్‌లోని అల్వార్ ప్రాంతంలో ఉన్న ఖెర్లీ ఏరియాలో ఇలాంటి షాకింగ్ ఘటనే (Viral News) ఒకటి ఇటీవల వెలుగుచూసింది. ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి పథకం ప్రకారం, ఇంట్లోనే భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేయించింది. కన్నతండ్రిని కళ్లేదుటే చంపుతుంటే, 9 ఏళ్ల బాలుడు నిస్సహాయుడిగా మారిపోయాడు. చివరకు బాలుడు చెప్పిన సాక్ష్యంతో బండారం మొత్తం బయటపడింది. జూన్ 7న రాత్రి ఈ ఘోరమైన ఘటన జరిగింది.

కన్నతల్లి, ఆమె ప్రియుడు, నలుగురు కిరాయి హంతకులు కలిసి తన తండ్రిని హత్య చేయడాన్ని బాలుడు కళ్లారా చూశాడు. దీంతో, ఈ కేసులో అతడి వాంగ్మూలం అత్యంత కీలకంగా మారింది. కిరాతక హత్యకు గురైన బాధితుడు పేరు మాన్ సింగ్ జాతవ్‌ లేదా వీరు అని పోలీసులు గుర్తించారు. బాధిత వ్యక్తిని ఇంట్లోనే చంపేశారు. సడెన్‌గా ఆరోగ్యం క్షీణించి చనిపోయాడంటూ భార్య అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, కొడుకు అసలు విషయం బయటపెట్టడంతో హత్య జరిగిన 48 గంటల్లో వాస్తవాలు బయటకొచ్చాయి.

Read this- Air India Crash: ‘ఫాదర్స్ డే’ నాడు విషాదం.. డీఎన్ఏ టెస్టులో!

ఆ రాత్రి ఏం జరిగిందంటే?
హత్య జరిగిన రోజు జూన్ 7 రాత్రి అమ్మ (అనిత) ఉద్దేశపూర్వకంగా ఇంటి గేటును తెరిచి ఉంచిందని బాలుడు వివరించాడు. అర్ధరాత్రి సమయంలో, కాశీ అంకుల్ (నిందితురాలి ప్రియుడు), నలుగురు వ్యక్తులు ఇంట్లోకి వచ్చారని వివరించాడు. ‘‘మంచం మీద నిద్రపోతున్న నాన్నకు ఊపిరాడకుండా చేసి చంపేశారు. నాన్నను అందరూ కలిసి కొట్టారు. హత్య జరిగిన ప్రదేశానికి సమీపంలోనే నేను పడుకొని ఉన్నాను. నిద్రపోతున్నట్టు నటిస్తూ అంతా చూశాను’’ అని బాలుడు చెప్పాడు. నిందితురాలు అనిత, తన ప్రియుడు కాశీరాం ప్రజాపత్‌తో కలిసి ఈ పన్నాగానికి పాల్పడ్డట్టు  దర్యాప్తులో తేలింది.

‘‘నేను అప్పుడే నిద్రలోకి జారుకున్నాను. అదే సమయంలో తలుపు దగ్గర చిన్న శబ్దం వినిపించింది. కళ్లు తెరిచి చూస్తే అమ్మ తలుపు తెరిచింది. కాశీ అంకుల్ బయట నిలబడి ఉన్నాడు. ఆయనతో పాటు మరో నలుగురు వ్యక్తులు ఉన్నారు. నేను భయపడి లేవలేదు. సైలెంట్‌గా అంతా చూడడం మొదలుపెట్టాను. వాళ్లు మా గదిలోకి ప్రవేశించారు. నేను లేచి చూసేసరికి మా అమ్మ మంచం ముందు నిలబడి ఉంది. వచ్చిన వ్యక్తులు మా నాన్నను కొట్టారు. కాళ్లు మెలితిప్పారు. గొంతు నులిమారు. కాశీ అంకుల్ దిండుతో నాన్నకు ఊరిరాడకుండా గట్టిగా అదిమి పట్టాడు. భయంతో మా నాన్న దగ్గరికి పరిగెత్తుకెళ్తే, కాశీ అంకుల్ నన్ను తిట్టి బెదిరించాడు. బాగా భయమేసి నేను మౌనంగా ఉండిపోయాను. కొద్దిసేపటి తర్వాత నాన్న చనిపోయాడు. ఆ తర్వాత వాళ్లందరూ వెళ్లిపోయారు’’ అని బాలుడు వివరించాడు.

Read this- Bomb Threat to Airport: బేగంపేట ఎయిర్ పోర్టులో హై అలర్ట్.. అందరినీ బయటకు పంపేసిన పోలీసులు!

పక్కా ప్లాన్‌తో హత్య
నిందితురాలు అనిత, ఆమె ప్రియుడు కాశీరామ్ హత్యకు ముందుగానే ప్లాన్ చేసుకున్నారని, వారి వివాహేతర సంబంధానికి అడ్డుగా భావించి జాతవ్‌ను చంపాలని నిర్ణయించుకున్నారని పోలీసులు వివరించారు. అనిత ఖేర్లిలో ఒక చిన్న కిరాణా దుకాణం నడుపుతోందని, కాశీరామ్ స్థానిక వీధి వ్యాపారి అని చెప్పారు. కచోరీలు విక్రయించే కాశీతో అనితకు పరిచయం ఏర్పడి చనువు పెరిగిందని, క్రమంగా దగ్గరైనట్టు దర్యాప్తులో బయటపడిందన్నారు. అనిత, కాశీరామ్ కలిసి నలుగురు సుపారీ హంతకులకు రూ.2 లక్షలు ముట్టజెప్పారని వివరించారు. జూన్ 7 రాత్రి, అనిత ఇంటి ప్రధాన గేటుకు తాళం వేయకపోవడం ప్లాన్‌లో భాగమేనని చెప్పారు. కిరాయి హంతకులతో కలిసి కాశీరామ్ బైక్‌పై ఇంటికి వెళ్లారని, నిద్రలో ఉన్న మాన్ సింగ్ జాతవ్‌పై దాడి చేసి హత్య చేశారు. కానీ, ఉదయం అకస్మాత్తుగా చనిపోయినట్టుగా నటించారని వివరించారు.

జాతవ్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడంటూ అనిత బంధువులను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, మృతదేహంపై దెబ్బలు ఉండడం, ఒక పన్ను విరిగిపోయి ఉండడం, ఊపిరాడకుండా చేసినట్టు ఆనవాళ్లు కనిపించడంతో మృతుడు జాతవ్ సోదరుడు గబ్బర్ జాతవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శరీ పరీక్షలో జాతవ్ హత్యకు గురైనట్లు నిర్ధారణ అయింది. దీంతో, దర్యాప్తు ఆరంభించిన పోలీసులు ఆ ప్రాంతంలోని సుమారు 100 కి పైగా సీసీటీవీ ఫుటేజ్ క్లిప్‌లను పరిశీలించారు. వీటితో పాటు కాల్ డేటా రికార్డుల ఆధారంగా పరిశీలించగా అసలు నిజాలు బయటపడ్డాయి. ప్రస్తుతానికి అనిత, కాశీరామ్, కిరాయి హంతకుల్లో ఒకరైన బ్రిజేష్ జాతవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురు నిందితుల కోసం అన్వేషిస్తున్నట్టు వెల్లడించారు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ