Indian Traditions: మన సంస్కృతిలో ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. వాటిని మనం తెలియకుండానే వాటిని అనుసరిస్తూ ఉంటాం. అలాంటి ఒక సంప్రదాయమే గురువారం ఆడవాళ్లు తలస్నానం చేయకూడదనే నియమం. అసలు, ఈ నియమం ఎందుకు పెట్టారు? తలస్నానం చేస్తే ఏం జరుగుతుందనే విషయం మనలో చాలామందికి తెలియదు.
ఈ సంప్రదాయం ప్రకారం, గురువారం రోజున తల స్నానం చేయడం వల్ల ఆర్థిక నష్టం, కుటుంబంలో అభిప్రాయ భేదాలు, వివాదాలు తలెత్తవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా, పెళ్లైన మహిళలు ఈ రోజున తల స్నానం చేయడం వలన కలిసి రాదని అంటున్నారు.
Also Read: Allu Kanakaratnamma: ముగిసిన అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు.. పాడె మోసిన చిరు, మనవళ్లు!
గురువారం తల స్నానం చేయడం వల్ల స్త్రీలకు మాత్రమే కాక, పురుషులకు కూడా వైవాహిక జీవితంలో సమస్యలు, భాగస్వామితో విభేదాలు, ఆర్థిక ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, స్త్రీ జాతకంలో కుజుడు (మంగళ గ్రహం), భర్త సంతాన అంశాలతో ముడిపడి ఉంటాడు. అందుకే, గురువారం తల స్నానం చేయడం వల్ల భర్తతో విభేదాలు, పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం, ఇంట్లో ఆర్థిక సంక్షోభం వంటివి తలెత్తవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు.
అంతే కాకుండా, గురువారం ఉపవాసం ఉండే వారు ఈ రోజున తలస్నానం చేయడం మరింత సమస్యలను తెచ్చిపెడుతుందని నమ్మకం. వారంలోని ప్రతి రోజు ఒక గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. గురువారం బృహస్పతి (గురు గ్రహం)కి చెందిన రోజుగా పరిగణించబడుతుంది. జ్యోతిష్యం ప్రకారం, ఈ రోజున తలస్నానం చేయడం వలన బృహస్పతి గ్రహాన్ని అసంతృప్తి పరచడమే కాక, ఆ గ్రహం తెచ్చే సానుకూల శక్తిని తొలగిస్తుందని నమ్ముతారు. అందుకే, ఈ రోజున తలస్నానం చేయకపోవడమే మంచిదని అంటున్నారు.
Also Read: BRS Harish Rao Protest: రోడ్లపై పరిగెత్తి.. సచివాలయం వద్ద బైఠాయించి.. హరీశ్ నేతృత్వంలో హైడ్రామా!
శాస్త్రీయ కోణంలో ఆలోచిస్తే..
శాస్త్రీయ కోణంలో చూస్తే, ఈ రోజున తలస్నానం చేయడం వల్ల ఎలాంటి హాని జరగదని, దీనికి బలమైన ఆధారాలు లేవని సైన్స్ చెబుతోంది. అయినప్పటికీ, ఈ సంప్రదాయం గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది. జ్యోతిష్యాన్ని నమ్మాలా, సైన్స్‌ను అనుసరించాలా అనేది మీ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
గమనిక: పలు శాస్త్రాల నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం జ్యోతిష్యానికి ప్రత్యామ్నాయం కాదు. జ్యోతిష్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా పండితులను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.